హనుమంతుడు లేని ప్రముఖ రామాలయమేది?

 

ఆంధ్ర అయోధ్య గా పేరున్న ఒంటిమిట్ట శ్రీకోదండరామస్వామి ఆలయ బ్రహ్మోత్సవాలు ఏప్రిల్ నెల 9 వతేది నుంచి 19 వ తేదీ వరకు జరగనున్నాయి.  ఒంటి మిట్ట ఆలయం కడప జిల్లాలోనే పెద్ద దేవాలయం. విశేషమేమిటంటే,  హనుమాన్ విగ్రహం లేని ప్రముఖ రామాలయం ఇదే. ఇలా ఎందుకు జరిగిందో కచ్చితమయిన సమాచారం లేదు. హనుమాన్ లేని రామలక్ష్మణులను విగ్రహాలనుఊహించలేం.

ఆంధ్రప్రదేశ్ రెండు విభజన తర్వాత ప్రభుత్వ నిర్వహించే శ్రీరామనవి ఉత్సవాలకు ఒంటి మిట్ట ఆలయాన్ని కేంద్రం చేసుకున్నారు. ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్ లో భ్రదాచలం ఈ ఉత్సవాలు జరిగేవి. ఒంటిమిట్ట కడప -తిరుపతి పట్టణాల మధ్య ఉంటుంది. ఇక్కడి చేరుకోవడం చాలా సులభం. కడప, తిరుపతిలోవిమానాశ్రయాలున్నాయి.

 

 

ఒంటిమిట్టలో రైల్వేస్టేషన్ కూడా ఉంది. అంటే విమానంలో, బస్సులలో, రైళ్లలో ఒంటిమిట్టకు సులభంగా చేరవచ్చు. జాతీయ రాహదారి పక్కనే ఈ ఆలయం ఉంటుంది.

Vontimitta / AP Tourism Authority

ఈ ఆలయాన్ని చోళ రాజులు నిర్మించారు. తర్వాత విజయనగరరాజులు వృద్ధి చేశారు. శిల్పకళ ఉట్టిపడుతూ ఉంటే ఆలయం తోరణం ఆలయానికి ప్రత్యేక ఆకర్షణ. ఇక్కడ ఒకే రాతి  మీద రామలక్ష్మణ సీత విగ్రహాలను చెక్కారు. కాని హనుమంతుడు లేడు. ఇలాంటి ఆలయాలు చాలా అరుదు. మెదక్ జిల్లా గుమ్మడిదల లో ఉన్న కల్యాణ రామచంద్రాలయం  లో కూడా హనుమాన్ ఉండడు. 2014 రాష్ట్ర విభజన తర్వాత  2015లో ఈ ఆలయం తిరుమల తిరుపతి దేవస్థానాల పరిధిలోకి వచ్చింది. ఆదే ఏడాది నుంచి  ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ  శ్రీరామ నవమి ఉత్సవాలను ప్రతియేటా అధికారికంగా ఒంటిమిట్టలో నిర్వహించాలని నిర్ణయించింది.

 

Vontimitta /AP Tourism Authorityబ్రహ్మోత్సవాల కార్యక్రమావళి

9 వతేది శనివారం ఉదయం దీక్షా తిరుమంజనం సాయంత్రం అంకురార్పణ

10 వ తేదీ ఆదివారం ఉదయం ధ్వజారోహణం సాయంత్రం శేషవాహన సేవ

11 వతేది సోమవారం ఉదయం వేణుగాన అలంకారం స్నపన తిరుమంజనం సాయంత్రం హంస వాహన సేవ

12 వతేది మంగళవారం ఉదయం వటపత్రసాయి అలంకారం సాయంత్రం సింహ వాహన సేవ

13 వతేది బుధవారం ఉదయం నవనీత కృష్ణాలంకారం సాయంత్రం హనుమంత వాహన సేవ

14 వతేది గురువారం ఉదయం మోహిని అలంకారం సాయంత్రం గరుడ సేవ

15 వతేది శుక్రవారం ఉదయం శివ ధనుర్భాణ అలంకారం సాయంత్రం సీతారామ కల్యాణోత్సవం గజావాహన సేవ

16 వతేది శనివారం రధోత్సవం

17 వతేది ఆదివారం ఉదయం కాళియ మర్దన అలంకారం సాయంత్రం అశ్వ వాహన సేవ

18 వతేది సోమవారం ఉదయం చక్రస్నానం

19 వ తేదీ మంగళవారం సాయంత్రం పుష్పయాగం

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *