కిరణ్ అబ్బవరం ‘సెబాస్టియన్ పిసి524’ టీజర్

టాలెంట్‌ ఉన్నోళ్లకు టాలీవుడ్‌ ఎప్పుడూ వెల్కమ్‌ చెబుతుంది. కథానాయకుడిగా పరిచయమైన ‘రాజావారు రాణిగారు’ సినిమాతో కంటెంట్‌ ఉన్న కుర్రాడని కిరణ్‌ అబ్బవరం పేరు తెచ్చుకున్నారు. ఆ తర్వాత ‘ఎస్ఆర్ కళ్యాణమండపం’తో మరో సాలిడ్ సక్సెస్ అందుకున్నారు. క్లాసు – మాసు, యూత్ – ఫ్యామిలీ… అన్ని వర్గాల ప్రేక్షకుల్లో మంచి పేరు తెచ్చుకున్నారు. ఇప్పుడు హ్యాట్రిక్ హిట్ అందుకోవడానికి రెడీ అవుతున్నారు. ‘సెబాస్టియన్ పిసి 524’తో ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు.

కిరణ్‌ అబ్బవరం కథానాయకుడిగా నటించిన తాజా సినిమా ‘సెబాస్టియన్‌ పిసి524’. కోమలీ ప్రసాద్‌, నువేక్ష (నమ్రతా దరేకర్‌) హీరోయిన్లు. ఎలైట్ ఎంట‌ర్‌టైన్‌మెంట్‌ సమర్పణలో జ్యోవిత సినిమాస్ పతాకంపై సిద్ధారెడ్డి బి, రాజు, ప్రమోద్ నిర్మించారు. బాలాజీ సయ్యపురెడ్డి దర్శకత్వం వహించారు. తెలుగులో ఈ నెల 24న సినిమా విడుదల కానుంది. ఈ రోజు టీజర్ విడుదల చేశారు.

‘నీకు రేచీకటి (నైట్ బ్లైండ్‌నెస్‌) అన్న విషయం ఎవ్వరికీ తెలియనివ్వొద్దయ్యా!’ అని తల్లి చెప్పే మాటతో ‘సెబాస్టియన్ పిసి524’ టీజర్ మొదలైంది. సినిమాలో హీరోకి రేచీకటి అనే సంగతి తెలిసిందే. ఆ తర్వాత పోలీస్ కానిస్టేబుల్ సెబాస్టియన్ పాత్రలో జాకీ చాన్ స్టయిల్‌లో కిరణ్ అబ్బవరం ఎంట్రీ ఇచ్చారు. ‘పేరు ఏమో క్రిస్టియన్ లాగా ఉండాది. వచ్చింది ఏమో గుడి కాడనుండా’ అని శ్రీకాంత్ అయ్యంగార్ చెప్పే డైలాగ్ వింటుంటే… హీరోకి భక్తి ఉందని తెలుస్తోంది.

రేచీకటి గల హీరో నైట్ డ్యూటీ ఎలా చేశాడన్నది ఆసక్తికరంగా ఉంది. ‘దయగల ప్రభువా… ఈ రాత్రి మదనపల్లి పట్టణ ప్రజలకు ఏ ఇబ్బందీ రాకుండా చూడు తండ్రి. నీకు స్తోత్రం’, ‘ప్రభువా… ఒకరాత్రి వీళ్లకు కళ్లు కనపడకుండా చూడు ప్రభువా! ఎన్ని వణుకుతాయో అర్థం కావడం లేదు’, ‘నేను దేవుడి బిడ్డను కాదన్నమాట’ అని హీరో చెప్పే డైలాగులు వినోదాత్మకంగా ఉన్నాయి. మొత్తం మీద సినిమాపై టీజర్ ఇంట్రెస్ట్ క్రియేట్ చేసింది. సోషల్ మీడియాలో ఈ టీజర్ ట్రెండింగ్ టాపిక్ అయ్యింది.

కిరణ్ అబ్బవరం, కోమలీ ప్రసాద్, నువేక్ష (నమ్రతా దారేకర్), శ్రీకాంత్ అయ్యంగార్, సూర్య, రోహిణీ రఘువరన్, ఆదర్ష్ బాలకృష్ణ, జార్జ్, సూర్య, మహేష్ విట్టా, రవితేజ, రాజ్ విక్రమ్, లత, ఇషాన్, రాజేష్ తదితరులు ‘సెబాస్టియన్ పిసి524’లో ప్రధాన పాత్రలు పోషించారు.

ఈ చిత్రానికి పీఆర్వో: సురేంద్రకుమార్‌ నాయుడు – ఫణి కందుకూరి (బియాండ్‌ మీడియా), డిజిటల్‌ పార్ట్‌నర్‌: టికెట్‌ ఫ్యాక్టరీ, పబ్లిసిటీ డిజైన్: చవన్ ప్రసాద్, స్టిల్స్: కుందన్ – శివ, సౌండ్: సింక్ సినిమాస్ సచిన్ సుధాకరన్, కాస్ట్యూమ్స్: రెబెకా – అయేషా మరియమ్, ఫైట్స్: అంజి మాస్టర్, సిజి: వీర, డీఐ: రాజు, కూర్పు: విప్లవ్‌ న్యసదాం, కళ: కిరణ్‌ మామిడి, ఛాయాగ్రహణం: రాజ్‌ కె. నల్లి, ఎగ్జిక్యూటివ్ నిర్మాత: కె.ఎల్. మదన్, సమర్పణ: ఎలైట్ ఎంటర్టైన్మెంట్స్, నిర్మాణ సంస్థ: జ్యోవిత సినిమాస్, సంగీతం: జిబ్రాన్, నిర్మాతలు: సిద్ధారెడ్డి బి, ప్రమోద్‌, రాజు, కథ – దర్శకత్వం: బాలాజీ సయ్యపురెడ్డి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *