భారతదేశంలో డేంజర్ లెవెల్లో రక్తం కొరత…

 2020 ఏప్రిల్ లో  రెడ్ క్రాస్  సొసైటీ ఒక షాకింగ్ న్యూస్ బయట పెట్టింది. భారతదేశంలో స్వచ్ఛంద రక్త దానం (voluntary blood donation) నూరుశాతం పడిపోయిందని ఈ సంస్థ  ప్రకటించింది. తగ్గిపోతున్న రక్తదానానికి కోవిడ్ పరిస్థితి కూడా తోడవడంతో ఈ రక్త సంక్షోభం ఎదురవుతూ ఉంది.
నిజానికి జనాభాతక్కువగా ఉన్న సంపన్న దేశాలలోనే  ప్రపంచ రక్తదానంలో 45 శాతం జరుగుతూ ఉంది. ఆదేశాల జనాభా కేవలం 16శాతమే. భారతదేశంలో  18 సంవత్సరాలు పైబడి ఆరోగ్య ఉన్న వాళ్లెవరైనా రక్తదానం చేయవచ్చు. పురుషులు   ప్రతి మూడు నెలల కొకసారి రక్తదానం చేయవచ్చు. మహిళలు నాలుగు నెలల కొకసారి రక్తం దానం చేయవచ్చు. అయితే భారత మహిళల్లో సగానికి పైబడి రక్తహీనతో ఉంటారు. భారత దేశంలో జనాభాలో ఒక శాతం మంది రక్తదానం చేసినా  చాలు,దేశంలో రక్తం కొరత తీరుతుంది.
కోవిడ్ వచ్చాకే కాదు, కోవిడ్ రాకముందు కూడా భారతదేశంలో రక్తం కొరత ఉంది.  రక్తం కొరతలో ప్రపంచంలోనే ఇండియా నెంబర్ వన్.
చికిత్సలో ప్రాణాపాయా సమయాల్లోనే రక్తం అవసరమవుతుంది. రక్త మార్పిడికి రక్తం కావాలి. గుండె నుంచి మోకాలి మార్పిడి ఆపరేషన్ లో రక్తం కావాలి. ప్రిమెచ్చూర్ బేబీలకు రక్తం అవసరం అవుతుంది. క్యాన్సర్ ట్రీట్ మెంట్ లో రక్తం అవసరం అవుతుంది. ప్రమాదంలో గాయపడి తీవ్ర రక్త స్రావం జరిగినపుడు రక్తం కావాలి. ఆసుపత్రులలో ఎన్నో సందర్భాలలో ప్రాణం నిలబెట్టేందుకు రక్తం కావాలి. ఇది ప్రపంచంలో ఎక్కడా దొరకదు, సాటి మనిషి శరీరంలో తప్ప. అందుకే  ఆపత్సమయంలో సాటి మనిషికి ప్రాణంపోయాలంటే రక్తం అవసరం. ఇలాంటి రక్తం ఒక సారి దానంతో చేస్తే ఎనలేని ఎమోటివ్ సంతృప్తి ఉంటుంది.
భారతదేశంలో ఇపుడు దాదాపు 41 మిలియన్ యూనిట్ల బ్లడ్ షార్టేజ్ ఉంది. సప్లై డిమాండ్ గ్యాప్ 400 శాతం పెరిగేప్రమాదం ఉందని ప్రఖ్యాత్ జర్నల్ ది లాన్సెట్ (The Lancet ) రాసింది.
లాన్సెట్ జర్నల్ లో నిరోలాస్ రాబర్ట్స్ తదితరులు చెప్పిన విషయాలు చూస్తే కళ్లు తిరుగుతాయి. వారి అధ్యయనం ప్రకారం భారతదేశంలో 52.5 మిలియన్ యూనిట్ల రక్తం అవసరం ఉందని అంచనా.ఇందులో అందుబాటులోకి వస్తున్నది చాలా తక్కువ.  భారతదేశానికి 34.3 మిలియన్ డొనేషన్లు అవసరం అంతేకాదు.  ప్రతిడొనేషన్ నుంచి  1.53 మిలియన్ల కాంపొనెంట్ ప్రిపరేషన్ చేయాలి. దేశంలో అర్హమయిన ప్రతి వేయి మందిలో 85 మంది రక్తదానం చేయాలి. ఇపుడు ఇండియాలో రక్తం దానం చేస్తున్నది కేవలం 32 మంది మాత్రమే. 2018లో భారతదేశంలో  కేవలం 12.4 మిలియన్ డొనేషన్లు మాత్రమే జరిగాయి.
ఈనేపథ్యంలో ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ భారతదేశంలో బ్లడ్ డొనేషన్లు 100 శాతం పడిపోతున్నయని ఆందోళన వ్యక్తం చేసింది. ప్రమాద ఘంటిక మోగించింది. సకాలంలో బ్లడ్ అందక ప్రతి రోజు దేశంలో 1200 మంది చనిపోతున్నారంటే ఆశ్చర్యంగా ఉంటుంది. అత్యవసరం సమాయాలలో రక్తం కోసం పేద, అల్పాదాయ వర్గాల ప్రజలు తీవ్ర కష్టాలు పడుతూ ఉంటారు. సంపన్న వర్గాలకు రక్తం కొరత లేదనే చెప్పాలి. సమస్యంతా అల్పాదాయ వర్గాల వారిదే. వీళ్లు రక్తం కోసం ఎంత కష్టపడుతుంటారో సోషల్ మీడియాలో వస్తున్న అభ్యర్థనలే సాక్ష్యం.
రకరకాల మూఢ నమ్మకాల వల్ల చాలా మంది భారతీయులు రక్తం దానం చేసేందుకు ముందుకురావడం లేదు.  ఢిల్లీ వంటి నగరాలలో రక్త దానం బాగా ఉన్న, చాలా ప్రాంతాలు రక్త దానం విషయలో బాగా వెనకబడి ఉన్నాయి. ఈ కొరత గమనించి ఢిల్లీకి చెందిన కిరణ్ వర్మ అనే యువకుడు వర్చువల్ బ్లడ్ బ్యాంక్ తెరిచాడు. Simply Blood పేరుతో ఆయన ఫౌండేషన్ తెరిచాడు  2025లోపు భారతదేశంలో ఎవరూ రక్తం అందక చావకూడాదనే ఉన్నతాశయంలతో కిరణ్ వర్మ ఈ ఫౌండేషన్ తెరిచాడు.
 Kiran Varma
Kiran Varma
ఈ ఫౌండేషన్ లో ఇపుడు 50,000వేల మంది దాక సభ్యులుగా రిజిస్టర్ చేసుకున్నారు. వీళ్లందరికి అయిదు కిలో మీటర్ల దూరాన రక్తం అవసరమయినపుడు నోటిఫికేషన్ వస్తుంది. దాతకు ఇష్టమని చెబితే,వెంటనే రక్తం అసవరమయిన వ్యక్తి వివరాలు పంపిస్తారు. అపుడు అక్కడికి వెళ్లి రక్తం ఇవ్వవలసి ఉంటుంది. వర్మ యాప్  data.gov.in తో అనుసంధానం చేశారు.

 

https://www.facebook.com/SimplyBlood/videos/458389218700209

ఇలాంటి ప్రయత్నాలు అభినందించదగ్గవి.అయితే, రక్తదానం పెరగాలంటే, రక్తం దానం చేయడం వల్ల నష్టాలు లేవు, లాభాలే ఉన్నాయనే చైతన్యం ప్రజల్లో రావాలి. రక్తం దానం చేయడం వల్ల ఎన్ని లభాలున్నాయో చూడండి.
గుండె జబ్బులొచ్చే రిస్క్ తగ్గుతుంది
ర‌క్త‌దానం త‌ర‌చూ చేయ‌డం వ‌ల్ల హార్ట్ ఎటాక్‌లు వ‌చ్చే అవ‌కాశాలు 88 శాతం వ‌ర‌కు త‌గ్గుతాయ‌ని ఒక అధ్యయనంలో తేలింది. ఫిన్లండ్ కు చెందిన Kuopiokuopio యూనివర్శిటీ శాస్త్రవేత్తలు Ischaemic Heart Disease Risk Factor ని అధ్యయనం చేశారు. ఈ స్టడీ ఫలితాలు  అమెరికన్ జర్నల్ ఆఫ్ ఎపిడిమియాలజీ (Americal Journal of Epidemiology) లో వచ్చాయి. వారి అధ్యయనం ప్రకారం  blood donors had a 88% reduced risk of acute myocardial infarction, compared with non-blood donors. ఈ రీసెర్చ్  పేపర్ ని ఇక్కడ చదవవచ్చు. క‌నుక ర‌క్త‌దానం చేయ‌డం వ‌ల్ల గుండె జబ్బులొచ్చే అవకాశం బాగా తగ్గుతంది. దీనికి కారణం: మన శరీరంలో ఐరన్ నిల్వలు పెరిగిపోరాదు. ఐరన్ నిల్వలు పెరిగితే, గుండెజబ్బులొచ్చే అవకాశం ఉంది. దీనికి రక్తం దానం  చేసి ముప్పును వదిలించుకోవడం బెస్టు అని  ఈ అధ్యయనంలో తేలింది. (…High body iron stores have been suggested as a risk factor for acute myocardial infarction, donation of blood could theoretically reduce the risk by lowering body iron stores.)
క్యాన్సర్ వచ్చే రిస్కూ తగ్గుతంది
ర‌క్త‌దానం త‌ర‌చూ చేసి శరీరంలో నిల్వ ఉన్న ఐరన్ వోవర్ లోడ్  ను వదిలించుకోవడం వల్ల   లివ‌ర్, పేగులు, ఊపిరితిత్తులు, గొంతు భాగాల‌కు చెందిన క్యాన్స‌ర్లు రాకుండా ఉంటాయని మరొక అధ్యయనం  (Between the lowest (< or = median, < 0.75 g) and highest (> 90th percentile, > 2.7 g) categories of estimated iron loss, there was a trend (P(trend) < .001) of decreasing risk for cancers of the liver, lung, colon, stomach, and esophagus, which are thought to be promoted by iron overload) లో కనిపించింది.
  ఎక్కువ సార్లు  ర‌క్త‌దానం చేయ‌డం వ‌ల్ల శ‌రీరంలో చెడు కొలెస్ట్రాల్ (ఎల్‌డీఎల్‌) తగ్గుతుంది. మంచి కొలెస్ట్రాల్ (హెచ్‌డీఎల్‌) పెరుగుతుందని ఇందిరా గాంధీ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ కార్డియాలజీ (పాట్నా) కి చెందిన హెచ్ కుమార్ అనే శాస్త్రవేత్త అధ్యయనంలో తేలింది. ఆయన ఇలా రాశారు.
Ten patients of hyperlipidemia who donated blood 300 ml every month for 3 months and received gemfibrozil 1200 mg/day (Group B) had nearly 2 fold greater fall in serum total cholesterol, LDL, and triglyceride levels in comparison to 17 patients of group A who were treated with gemfibrozil alone in similar dose for the same period. HDL level remained almost unchanged.
కాబట్టి రక్త దానం చేసేందుకు ఆరోగ్యంగా ఉన్నవాళ్లంతా ముందుకు రావాలి. రక్తదానం అంటే ఒక విధమయిన చికత్స తో సమానమని ఈ రీసెర్చ్ పేపర్లు చెబుతున్నాయి. రక్తం దానం చేయడం వల్ల గుండెజబ్బుల రిస్క్, క్యాన్సర్ రిస్క్ తగ్గుతుంది. ఒక రక్తదానం మన ఆరోగ్యాన్ని కాపాడటమే కాదు, మూడు జీవితాలను ఆదుకుంటుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *