2014 ‘గాలిపటం’ తర్వాత అంటే నాలుగేళ్ల విరామం తరవాత సంపత్ నంది మరో చిత్రాన్ని నిర్మించారు.అదే పేపర్ బాయ్. సంతోష్ శోభన్, ప్రియా శ్రీ, తన్య హోప్ హీరోహీరోయిన్లుగా నటించిన ఈ చిత్రానికి జయశంకర్ దర్శకత్వం వహించారు. సంపత్ నంది టీమ్‌వర్క్స్, ప్రచిత్ర క్రియేషన్స్, బి.ఎల్.ఎన్ సినిమా పతాకాలపై సంపత్ నంది, వెంకట్, నరసింహ సంయుక్తంగా నిర్మించిన చిత్రం ‘పేపర్ బాయ్’.
షూటింగ్ పూర్తి చేసుకుని ‘పేపర్ బాయ్ ’ ఇపుడు పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉంది. రొమాంటిక్ ఎంటర్టైనర్గా రూపొందుతోన్న ఈ చిత్రాన్ని హైదరాబాద్, ముంబయి, లూనావాల, పుణే, కేరళ, గోవాల్లో చిత్రీకరించిన ఈ చిత్రాన్ని జులైలో విడుదల చేయబోతున్నారు. సంపత్ నంది పుట్టినరోజు సందర్భంగా రేపు(జూన్ 20న) ‘పేపర్ బాయ్’ ఫస్ట్ లుక్ విడుదలయింది.
‘గోల్కొండ హైస్కూల్’ సినిమాలో ముఖ్య పాత్ర పోషించిన సంతోష్ శోభన్.. ఆ తరవాత ‘తను నేను’ చిత్రంతో హీరోగా మారిన సంగతితెలిసిందే. ఇప్పుడు ఆయన ‘పేపర్ బాయ్’గా మన ముందుకువస్తున్నారు. పేపర్ బాయ్ లో ఇంకా
చిత్రంలో పోసాని కృష్ణమురళి, బిత్తిరి సత్తి, విద్యుల్లేఖ రామన్, జయప్రకాష్ రెడ్డి, అన్నపూర్ణమ్మ, అభిషేక్ మహర్షి, మహేష్ విట్టా నటించారు. కథ, స్క్రీన్‌ప్లే, డైలాగ్స్‌ను సంపత్ నందియే అందించారు. భీమ్స్ స్వరాలు సమకూర్చారు. సుందర్ రాజన్ సినిమాటోగ్రఫీ అందించారు.