(పుంజాల శివశంకర్, మాజీ కేంద్రమంత్రి)
1952 లో నేను ఇంకో ఇద్దరినీ తీసుకుని అప్పటి ముఖ్య మంత్రి బూరుగుల రామకృష్ణయ్య గారి దగ్గరికి పోయి, బాక్వార్డ్ క్లాస్(బీసీ) లిస్ట్ తయారు చేపించమని రిక్వెస్ట్ చేసినాము. కానీ ఆయన దానిని పట్టించుకోలేదు.
1955 కాకా కళేల్కర్ కమిషన్ వచ్చిన తరువాత దాని అంశములతో లిస్ట్ ప్రిపేర్ చెయ్యడానికి మమ్ముల్ని పిలిచి మమ్ములని అధికారులతో కూర్చొని లిస్ట్ తయారు చెయ్యమన్నడు. దాని ప్రకారము బాక్క్వర్డ్ క్లాస్ లిస్ట్ చెయ్యడము జరిగింది.
కానీ ఆ లిస్ట్ ని 1956 లో హై కోర్ట్ కొట్టేసింది. దీనికి కారణమూ అప్పటి ముఖ్య మంత్రి నీలం సంజీవ్ రెడ్డి రిజర్వేషన్స్ కి కిలాఫ్(వ్యతిరేకి) కాబట్టి, కోర్ట్ లో అప్పీల్ సక్కగ చెయ్యక పోవడము.
మేము మల్ల 1960 లో దామోదరం సంజీవయ్య గారు ముఖ్య మంత్రి అయినప్పుడు ఆయనను కలిసి తిరిగి బీసీ లిస్ట్ ఆర్డర్స్ ఇష్యూ చేపించుకున్నాము.
1962 లో నీలం సంజీవ్ రెడ్డి ముఖ్య మంత్రి అయ్యి 20 ఫిబ్రవరి 1964 లో పదవి వదిలే ముందు మొత్తము బీసీ లిస్ట్ ని G.O. MS.No.301, Education, dated 3rd February 1964 ద్వారా మల్ల తీసేసినడు.
ఈ మధ్యలో హై కోర్ట్ బీసీ లకి మెడికల్ కాలెజిలల్లో రేజర్వేషన్ ఇవ్వరాదు అని దాని సంబంధిత G.O.Ms.No.1886, Health dated 21st June 1963 ని కొట్టేసింది.
అతని ప్లేస్ లో 1964 లో బ్రహ్మానంద రెడ్డి ముఖ్య మంత్రి అయ్యినప్పుడు మేము ఆయనను కలిసినము. ఆయన కాబినెట్ లో మంత్రి గ ఉన్న జేవీ నర్సింగ్ రావు గారుమాకు సహాయము చెయ్యడముతో మల్ల బీసీ లిస్ట్ కొత్త ఆర్డర్స్ రిలీజ్ అయ్యినయి. ఈ ఆర్డర్స్ ని మళ్లీ 1966లో హైకోర్టు కొట్టివేసింది.
నేను చాలా సార్లు ఇండివిడ్యువల్ గా మరియు జేవీ నర్సింగ్ రావు గారి తో బ్రహ్మానంద రెడ్డి గారిని కలిసి రిక్వెస్ట్ చెయ్యగా ఆయన బీసీ లిస్ట్ తయారు చెయ్యమని కొన్ని నియమావళులు ఇస్తూ ఒక కాబినెట్ సబ్ కమిటీ ని వేసిండ్రు. దానికి నన్ను లీగల్ ఇంకా టెక్నికల్ అడ్వైసర్ గా స్పెషల్ ఇన్వైటి గా పేర్కొన్నారు.
తర్జన భర్జన తరువాత ఆంధ్ర బీసీ లిస్ట్ లో ఉన్న 86, తెలంగాణ లో ఉన్న 60, మొత్తము 146, లిస్ట్ ని 112, కి కుదించి 4, జులై 1966, న గవర్నమెంట్ కి అందిస్తే G.O.Ms.No.1880, Education, dated 29th July 1966, ద్వారా గవర్నమెంట్ మేము తయారు చేసిన లిస్ట్ ని రిలీజ్ చేసింది.
ఈ లిస్ట్ కి విరుద్ధముగా హై కోర్ట్ లో రిట్ పెటిషన్స్ వెయ్యడముతో కోర్ట్ ఈ G.O. ని కొట్టివేస్తూ ప్రొఫెషనల్ కాలేజీలల్లో రిజర్వేషన్స్ ఇవ్వడానికి వీలు లేదు అని హై కోర్ట్ ఆర్డర్ పాస్ చేయగా సుప్రీమ్ కోర్ట్ ఆ ఆర్డర్ ని అప్హెల్డ్ చేసింది(సమర్థించింది). (judgement dated 27th March, 1968 in the State of Andhra Pradesh and another vs P. Sagar in C.A.No. 1336 of 1967)
మల్లా కథ మొదటికి వచ్చింది. మల్ల బ్రహ్మానంద రెడ్డి గారి చుట్టూ తిరగడము తో ఆయన G.O.Ms.No.870. Education. Dated 12th April 1968 ద్వారా అనంత రామన్ కమిషన్ వేస్తూ ఇంకా ఇది ఆఖరి సారిగా నీ రిక్వెస్ట్ వింటున్నాము అని నీ బీసీ ల కోసము రిజర్వేషన్స్ పట్టుదలను నువ్వే కోర్టులో సాదించుకో, కోర్టులో జడ్జీలని నువ్వు కన్విన్స్ చెయ్యలేకపోతే ఇంకా మేము ఏమీ చేయలేమని నన్ను గవర్నమెంట్ ప్లీడర్ ని చేసి అట్లనే నన్ను అనంత్ రామన్ కమిషన్ కి లీగల్ గా ఇతరత్రా అసిస్ట్ చెయ్యమని ఇంస్ట్రక్షన్స్ ఇచ్చినారు.
ఫైనల్లీ, 20 జూన్, 1970 న 92 కులాలతో అనంత్ రామన్ కమిషన్ గవర్నమెంట్ కి రిపోర్ట్ సబ్మిట్ చేసింది.
దీనికి విరుద్ధంగా కూడా హైకోర్టులో కేసులు వేసిండ్లు. నేను ఎంత వాదించినా, బలరాం వర్సెస్ స్టేట్ అఫ్ ఆంధ్ర ప్రదేశ్ కేసులో మెడికల్ మరియు ఇతర ప్రొఫెషనల్ ఇంజనీరింగ్ లాంటి కోర్సెస్ లో ఈ లిస్ట్ చెల్లదు అని అనంత్ రామన్ కమిషన్ రికమెండేషన్స్ ని హై కోర్ట్ కొట్టివేసింది. నేను స్టేట్ గవర్నమెంట్ ని రిక్వెస్ట్ చేసుకొని కన్విన్స్ చేసి సుప్రీమ్ కోర్ట్ లో అప్పీలు వేసి 1972(1) SCC 660, (State, of, Andhra, Pradesh, and, others, vs. USV. Balram.), సుప్రీమ్ కోర్ట్ నుంచి 28 January, 1972, లో కేసు గెలిచి పాజిటివ్ జడ్జిమెంట్ తో బ్యాక్ వార్డ్ క్లాసెస్ కి రిజర్వేషన్స్ కన్ఫర్మ్ చేయించ గలగడమే కాకుండా వీరికి మెడికల్ ఇంకా అన్ని ప్రొఫెషనల్ కాలేజీ లలో కూడా ఈ రిజర్వేషన్స్ వర్తిస్తాయి అని ఆర్డర్ తీసుక రాగలిగిన.
(Source: Dr Kunkala Vinay Kumar)