*రంజిత్ కుమార్, నడిగడ్డ హక్కుల పోరాట సమితి జిల్లా చైర్మన్
జోగులాంబ గద్వాల: మల్దకల్ మండలం బిజ్జారం గ్రామంలో జడ్పీహెచ్ఎస్ స్కూల్ లో 480 మంది విద్యార్థిని, విద్యార్థులు ఉండి, పదకొండు సెక్షన్లు ఉండగా కేవలం ఏడు తరగతి గదులు మాత్రమే ఉండి మిగతా నాలుగు తరగతుల విద్యార్థులు ఆరుబయట చెట్ల కింద కూర్చొని పాఠాలు వింటున్నారని, నడిగడ్డ హక్కుల పోరాట సమితి జిల్లా చైర్మన్ రంజిత్ కుమార్ అన్నారు.
ఆడపిల్లలకు బాత్రూం వసతులు లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని అలాగే పిల్లలు తాగునీటి వసతి లేక బయటకెళ్ళి తాగుతున్నారని ఆయన చెప్పాారు.
పూర్తి స్థాయిలో సిబ్బంది లేరని, ప్రహరీ గోడను తరగతి గదులను పగలగొట్టి నేటికి నిర్మించకుండా గా అలా వదిలేయడం వల్ల రాత్రుల్లో స్కూల్ లోపల అసాంఘిక కార్యక్రమాలు జరుగుతున్నాయని ఈరోజు బిజ్జారం గ్రామంలో హైస్కూల్ ను సందర్శిస్తూ రంజిత్ కుమార్ అన్నారు.
70 ఏళ్ళ స్వతంత్రం లో ఇంకా నేటికీ పేద వర్గాలు, బలహీనవర్గాలు చదువు అందక వెనుకబాటుతనానికి గురవుతున్నారని, పాలకులు 60 సంవత్సరాల వారికి పెన్షన్ ఇస్తూ ఓట్లు వేయించుకొని , భవిష్యత్తు తరాలకు మాత్రం విద్యను అందించలేక పోతున్నారని,రాబోయే దేశ సంపదను నాశనం చేస్తున్నారని ఆయన అన్నారు.
గవర్నమెంట్ స్కూల్లో కేవలం పేద వర్గాలు ముఖ్యంగా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వర్గాలు చదువుతారు కావున, సరైన నాణ్యత గల విద్యను అందించకుండా,వారిని జ్ఞానానికి, చైతన్యానికి, అభివృద్ధికి దూరంగా నెట్టి వేయాలనే దురుద్దేశంతో పాలకులు కుట్ర పన్నుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. స్కూల్లో చదివే పిల్లలు మీకు ఓట్లు వేయరు అనే ఉద్దేశంతో ఈ రకంగా చేస్తున్నారా? అని ప్రశ్నించారు.
ఉలిగేపల్లె, దాసరిపల్లె, మేకల సోంపల్లె, జిల్లెడబండ నాలుగు గ్రామాల నుంచి విద్యార్థిని, విద్యార్థులు వస్తున్నటువంటి జెడ్ పి హెచ్ ఎస్ పాఠశాలలో అన్ని వసతులు కల్పించి పిల్లలకు నాణ్యమైన విద్యను అందించడమే కాక మధ్యాహ్న భోజన పథకంలో నాణ్యతతో కూడిన భోజనాన్ని అందించాలని విజ్ఞప్తి చేశారు.
ఈ కార్యక్రమంలో కన్వీనర్ బుచ్చిబాబు బంగారు తిమ్మప్ప ఉలిగేపల్లె లక్ష్మన్న దాసరిపల్లె చిన్న పరశురాముడు, సర్వేషు, కుమ్మరి రమేష్, ప్రేమ్ రాజ్, ఉప్పరి కృష్ణ, అడవి రావులచెరువు రాజు, ఆశన్న జయన్న తదితరులు పాల్గొన్నారు.l