పెరటితోట గురించి ఎప్పటినుంచో వింటున్నాం. పెరట్లో కూరగాయలు, ఆకుకూరలు, పళ్లు పెంచడం ఎప్పటినుంచో ఉంది. ఇలాగే, ఈ మధ్య రూఫ్ గార్డెన్లు వచ్చాయి. ఇంటి కప్పును చాలా మంది తోటలాగా మార్చేసున్నారు. కూరగాయలు,పళ్లు, ఆకుకూరలు పెంచుతున్నారు. ఎన్నో ప్రయోగాలు చేస్తున్నారు. కొత్త కొత్త పళ్లమొక్కలుపెంచతున్నారు. ఇందులో చాలా మంది నైపుణ్యం సంపాదించారు. ఏకంగా, రూఫ్ గార్డెన్ పెంచడమెలా అనే దాని పుస్తకాలు కూడా రాస్తున్నారు.
ఇక్కడ తుమ్మోటి రఘోత్తమరెడ్డి కూడా గురించి చెప్పుకోవాలి. ఆయన తెలంగాణలో పేరున్న కథా రచయిత. ఇపుడాయనకు కథలకంటే, ఆయన ఇంటి కప్పు మీద పెంచి రూఫ్ గార్డెన్ తో చాలా పాపులర్ అవుతున్నారు. ఆయన తన ఇంటి మీద ఉన్న 160 గజాల స్థలంలో ఒక కూరగాయల తోట పెంచారు. ఈ తోటను చూడ్డానికి చాలా మంది వెళ్లొస్తున్నారట. ఇలా పెరటిలోనో ట్రెర్రేస్ మీద నో కూరగాయలు పళ్లు పెంచే వార్తలు కథలు ఎన్నో చదివాం. అయితే, పెరటితోటలో ముత్యాలు పండించడం గురించి చాలా మందికి తెలియదు.
కేరళ కు చెందిన కెజె ముతాచన్ (KJ Muthachan) పెరట్లో ముత్యాలు పండించి సంచలనం సృష్టించారు. ముత్యాలు మూడు రకాలు. ఇందులో న్యాచురల్ ముత్యాలు సముద్రంలో దొరుకుతాయి. కృత్రిమ ముత్యాలు ఫ్యాక్టరీలో తయారవుతాయి. మూడో రకం ముత్యాలు కల్చర్డ్ ముత్యాలు.అంటే పండించే ముత్యాలు.
ముతాచన్ కల్చర్డ్ ముత్యాలు పండించి బాగా ఆర్థిస్తున్నారు. ఆయనకు ఈరంగంలో చాలా కీర్తి కూడా లభించింది. అవార్డులు అందుకుంటున్నారు
నిజానికి ముతాచన్ కు ముత్యాల సేద్యం అనుకోకుండా తారసపడింది. ఎటో తిరిగి ఆయన జీవితం ముత్యాల సేద్యానికి మళ్లింది. నిజానికి కింగ్ ఫహాద్సౌదీ అరేబియా,ధరాన్ (Dhahran) యూనివర్శిటీ ఆఫ్ పెట్రోలియం అండ్ మినరల్స్ ( King Fahd University of Petroleum and Minerals) అధ్యాపకుడు. అయితే, ఆయనకు చైనాలోని ఆర్మకో ఆయిల్ కంపెనీలో అరబిక్ ఇంగ్లీష్ ట్రాన్స్ లేటర్ గా ఉద్యోగం వచ్చింది. చైనా వెళ్లిపోయాడు. చైనాలో ఉన్నపుడు వూషి (Wuxi)లో ఉన్న ఫిషరీస్ రీసెర్చ్ సెంటర్ సందర్శించాడు.
“నాకు తొలి నుంచి చేపలపెంపకం అంటే ఇష్టం. చైనాలో పనిచేస్తున్నపుడు వూషి (Wuxi) దాన్ షుయ్ ఫిషరీస్ రీసెర్చ్ సెంటర్ (Danshui Fisheries Research Centre) కు వెళ్లాను. అక్కడ ఏమేమికోర్సులున్నాయో చూశాను. ఆ కోర్సుల్లో ముత్యాల సేద్యం (peal cultivation) కోర్సు కూడా ఉంది. ఇలాంటిది కొత్త. అందుకే ఆ కోర్సు మీద ఆసక్తి పెరిగింది. ఈ కోర్సులో ఎందుకు చేరకూడదు అనుకున్నాను, కోర్సు చేశాను,’ అని ఆయన చెప్పారు. తర్వాత ఈ కోర్సుకోసం ఆర్మకో కంపెనీ రాజీనామా చేసి, ముత్యాల సేద్యంలో డిప్లొమా చేశాడు.ఈ కొత్త వృత్తి మీద ఆయనఎంత ఆసక్తి పెరిగిందంటే ఆరునెలల కోర్సు తర్వాత ఇండియాకు వెళ్లిపోయి, ముత్యాల సేద్యం చేయాలనుకున్నాడు. అనుకున్నట్లే కేరళ తిరిగొచ్చాడు. 1999లో ముత్యాల సేద్యం మొదలు పెట్టాడు.
ఉద్యోగం వదిలేసి తానిలా ఆల్చిప్పల పెంపక చేపట్టడమేమిటా ఆని చాలా మంది ఆశ్చర్యపోయారు. కొందరు విమర్శించారు. అయితే, ఈ బిజినెస్ ఈ ప్రాంతంలోలేదు. అందుకే ఎవరేమన్నా నేను ముతాలా సేద్యమే చేయాలనుకున్నాడు.
మహారాష్ట్ర నుంచి, పశ్చిమకనుమల్లోని నదులనుంచి మంచినీటి ఆల్చిప్పలను తెప్పించుకుని మొదట్లో బకెట్లలో వీటిని పెంచి ముత్యాలు పండించడం మొదలు పెట్టాడు. ఈ పంటకాలం 18 నెలలు. మొదట 50 బకెట్ల ముత్యాలు పండించారు. వీటి మీద 1.5 లక్షలు పెట్టుబడి పెట్టాడు. అయితే, రు. 4.5లక్షలువచ్చింది. అంటే మూడు లక్షల లాభం వచ్చింది.ప్రయోగం విజయవంతమయింది. అప్పటినుంచి ఆయన ముత్యాల సేద్యం చేస్తూనే ఉన్నాడు. అది పెరిగి పెద్దదయింది. బాగా లాభసాటిగా మారింది. చివరకు అందులోనే ఆయన స్థిరపడ్డారు.
ముత్యాలు ఎలా వస్తాయి?
నదులనుంచి తెచ్చిన అల్చిప్ప (Mussels)ను జాగ్రత్తగా తెరచి వాటి పరల్ న్యూక్లియస్ వదలాలి. తర్వాత ఆల్చిప్పను మళ్లీ నీళ్లలోనే వదిలపెట్టాలి.ఈ నీళ్ల ఉష్షోగ్రత ఎపుడూ 15 నుంచి 25 డిగ్రీల సెల్సియస్ ఉండేలా చూసుకోవాలి. ఆల్చిప్ప మనం వదలిపెట్టిన న్యూక్లియస్ చుట్టూర ఒక తత్తిని యారు చేస్తుంది. ఆల్చిప్ప తయారు చేసే కాల్సియం కార్బేట్ ఈ తత్తిలోకి వచ్చిపొరలాగా చుట్టు కుంటూ ఉంటుంది. మనం వదిలిని న్యూక్లియస్ చుట్టూ సుమారు 540 పొరలు చుట్టుకుని 18 నెలల కాలంలో ఒక అందమయిన ముత్యం తయారవుతుంది.ఇలా తన పొలంలో పండించిన ముత్యాలను ఆయన ఆస్ట్రేలియా, కువాయిత్, సౌదీ అరేబియా, స్విజర్లాండ్ లకు పింపస్తూ ఉంటారు. భారతదేశంలో దొరికే ముత్యాలు చాలా మటుకు కృత్రిమమయినవి. దాని చుట్టు మంచి కవచం తయారుచేస్తారుకాబట్టి అవన్నీ ఒరిజినల్ ముత్యాల్లా కనిపిస్తుంటాయి. మంచి ముత్యాలు క్యారట్ రు. 360 దాకా పలుకుతాయి. అంటే గ్రాం ధర రు.1800దాకా ఉంటుందని ఆయన చెబుతున్నారు. ఇపుడాయన తన ఇంటివెనక పెద్ద ముత్యాల చెరువు, 40 మీటర్లు పొడవు, 15 మీటర్లు వెడల్పలు, ఆరు మీటర్ల లోతుతో, కట్టించి ఆల్చిప్పలను పెంచుతున్నాడు. ఇపుడాయన సహాయకులను కూడా పెట్టుకుని ముత్యాలు పండిస్తున్నారు. ఇపుడాయన ఆసక్తి ఉన్న వారికి ముత్యాల సేద్యంలో శిక్షణ కూడా ఇస్తున్నారు. ఇది 28 రోజుల కోర్సు. ముత్యాల సేద్యంలోని అన్ని