తెలంగాణలో ‘వరి వేస్తె ఉరి’ పథకం అమలు చేయడం షురూ అయిందా? అయినట్లే అనిపిస్తుంది. ఇదిగో ఈ వీడియో చూసి చెప్పండి. వరి పంటను తగ్గించేందుకు తెలంగాణ ప్రభుత్వం తీవ్రంగా ప్రయత్నిస్తూ ఉంది. అదెక్కడో కాదు సీఎం కేసీర్, హరీష్ రావు సొంత జిల్లా సిద్ధిపేట లోనే ఈ పథకాన్ని అమలుచేస్తున్నట్లు కనిపిస్తుంది. కలెక్టర్ వెంకట్రామిరెడి వరి వేయడాన్ని ఈ సమావేశంలో నిషేధించారు. ఈ వీడియో లో కలెక్టర్ చేసింది ఆఫ్ ది రికార్డు ప్రకటన కాదు. తాను చేస్తున్న వరి వార్నింగ్ అన్ రికార్డు అని చెప్పారు. అంతేకాదు, ఈ విషయంలో ప్రజాప్రతినిధుల సిఫార్సులను చివరకు కోర్టు ఉత్తర్వులను కూడా తాను లెక్కలోకి తీసుకోనని కలెక్టర్ చాలా స్పష్టంగా చేప్పారు. మొత్తానికి ఆసక్తికరమయిన కలెక్టర్ ప్రకటనని సమావేశానికి వచ్చిన అధికారులంతా మొబైల్ లో వీడియో తీసి చక్కగా దేశానికంతా షేర్ చేశారు.
యాసంగికి రైతులు వరి పంటవేయకుండా చూడాలనేది ప్రభుత్వం నిర్ణయించింది. దీనిని కలెక్టర్లు అమలు చేస్తున్నారు. విత్తనాలు అమ్మితే కఠినమైన చర్యలు తీసుకుంటాయని వ్యవసాయాధికారులను,ఇతర అధికారలను విత్తన డీలర్లను తీవ్రంగా హెచ్చరించారు. ఒక కిలో వరి విత్తనాలు అమ్మినట్లు తన దృష్టికి వస్తే ఏమవుతుందోకూడా ఆయన చెప్పారు. కలెక్టర్ హెచ్చరిక చూడండి.