మావోయిస్టు అగ్ర నేత ఆర్కే అంత్యక్రియల ఫొటోలను మావోయిస్టు పార్టీ విడుదల చేసింది. తెలంగాణ సరిహద్దు ప్రాంతంలో పామేడు-కొండపల్లి సరిహద్దు ప్రాంతాల్లో ఆర్కే అంత్యక్రియలు జరుగాయి.
నిన్న మధ్యాహ్నం రెండు గంటలకు జరిగిన అంత్యక్రియలకు భారీగా మావోయిస్టులు హాజరయ్యారు. మావోయిస్టు లాంఛనాలతో అంత్యక్రియలు జరిపారు.
ఆర్కే మృతదేహంపై ఎర్ర జెండా ఉంచి నివాళులు అర్పించారు.
మొన్న మృతి
అక్కిరాజు హరగోపాల్ (63)(ఆర్కే) అనారోగ్యంతో 14 అక్టోబర్ 2021 ఉదయం 6 గంటలకు తుదిశ్వాస విడిచినట్లు నిన్న మావోయిస్టు పార్టీ ప్రకటించిన సంగతి తెలిసిందే.
కామ్రేడ్ హరగోపాలకు అకస్మాత్తుగా కిడ్నీల సమస్య మొదలైంది. వెంటనే డయాలసిస్ ట్రీట్మెంట్ ప్రారంభించి వైద్యం అందిస్తున్న క్రమంలో కిడ్నీలు ఫెయిల్ అయి, ఇతర అనారోగ్య సమస్యలు తలెత్తి అమరుడైనాడు. ఆయనకు పార్టీ నుంచి వైద్యం అందించినప్పటికీ దక్ష్కించుకోలేకపోయింది. ఆయనకు విప్లవ శ్రేణుల మధ్యనే అంత్యక్రియలు నిర్వహించి శ్రద్ధాంజలి అర్పించడం జరిగింది. కామ్రేడ్ రామకృష్ణ అమరత్వం పార్టీకి తీరని లోటని పార్టీ పేర్కొంది