గ్యాస్ సిలిండర్ ధరలో 291 రూ రాష్ట్ర పన్ను ఉందని బిజెపి అభ్య ర్థి రాజేందర్ అంటున్నారు. దాన్ని రుజువు చేస్తే పదవికి రాజీనామా చేస్తానని ఆర్థిక మంత్రి హరీశ్ రావు సవాల్ విసిరారు.
291 రూ ట్యాక్స్ ఉన్నదని రుజువు చేయకపోతే ఎన్నికల నుండి తప్పుకుంటావా అని రాజేందర్ ను ప్రశ్నించారు.
“రేపు రావాలా…. ఇవాల రావాలా.జమ్మికుంటకా…… హుజూరాబాద్ కా….” అంటూఈటలకు సవాల్ విసిరారు.
పెంచికల్ పేట సభలో మంత్రి హరీశ్ రావు ప్రసంగించారు.
ఆయన ఇంకా ఏమన్నారంటే…
రెండు సంవత్సరాల్లో హుజూరాబాద్ లో ఇళ్లుకట్టించి చూపిస్తాం.మంత్రిగా ఉండి ఈటలచేయలేదు. ఇక మనం మీటింగ్ పెట్టుకుంటే 300 రూపాయలు ఇచ్చి ఇంటికాడ ఉండమన్నండట ఇదే సంస్కృతి. నేను మీకు సేవ చేసిన, గెలిపిస్తే ఇది చేస్తా అని చెప్పాలి.కాని ఇలా చేయడం ఏంటి. పేద ప్రజల మీద ప్రేమ ఉండి ఉంటే కేసీఆర్ ఇచ్చిన నాలుగు వేల ఇళ్లు కట్టి ఉంటే బాగుండేది.
నువు కుర్చీలో ఉన్నప్పుడు పేదలు కనిపించ లేదు. 300ఇవ్వడం కాదు. తాళ్లతోకట్టినా ఆ బంధనాలు తెంపుకుని వచ్చి టీఆర్ఎస్ కు ఓటు వేస్తరు.
ఈటల రాజేందర్ చేరింది ఏ పార్టీ. అది బీజేపీ. గ్యాస్ సిలండర్ వేయి రూపాయలు చేసింది ఆపార్టీ. సిలిండర్ ధర పెంచినా మీకు తిప్పలయినా నాకు ఓటు వేయండని అంటాడా. గ్యాస్ బండ ధరలో 291 రూపాయలు రాష్ట్ర ప్రభుత్వ పన్ను ఉందని చెబుతున్నడు. ట్యాక్స్వేసి ఉంటే ఎక్కడకు రావాలి. ఒక వేళ 291 రూపాయలు గ్యాస్ సిలిండర్ పై పన్ను వేసి ఉంటే ఇవాళ రమ్మంటావా….. రేపు రమ్మంటావా..జమ్మికుంటు గాంధీ బొమ్మకాడకు రమ్మంటవా…హుజూరాబాద్ అంబేద్కర్ బొమ్మ కాడకు రమ్మంటవా..
రా ష్ట్ర ప్రభుత్వం 291 రూపాయలు పన్ను వేసి ఉంటే నేను అక్కడ్నే రాజీనామా చేస్తా..నువు ఎన్నిక నుండి తప్పుకుంటవా అని అడుగుతున్న.
పెట్రోల్, డీజీల్, గ్యాస్ ధర, మంచి నూనే పెంచింది నీ ప్రభుత్వం కారణం కాదా. ఇళ్లు కట్టకండా ధరలు పెంచే పార్టీలో చేర ఓట్లువేయమంటావా…నిన్నటిదాకా నువు చేసిందేంటి…రేపు నువు చేసేదేంటి
ముఖ్యమంత్రి కేసీఆర్. రెండేళ్ల పాటు ఉండేది టీఆర్ఎస్ పార్టీ. అభివృద్ది జరగాలి. మాటలతో ప్రజలను మోసం చేస్తున్నారు. అబద్దాలతో, గోబెల్స్ ప్రచారంతో ఓట్లుపొందాలని చూస్తున్నారు.
30వ తేదీన ఓటు వేసేముందు వంట రూంలోకి వెళ్లి గ్యాస్ బండకు దండం పెట్టండి. కసి కసిగా కారు గుర్తుకు ఓటు వేయండి.