దేశవ్యాప్తంగా వరుసగా ఐదో రోజు పెట్రోల్, డీజిల్ ధరలు పెరిగాయి. పెట్రోలియం కంపెనీలు ఒక మోస్తరుగా ధరలు పెంచే విధానానికి స్వస్తి పలికి బుధరం నుంచి తమ మీద పడుతున్న భారాన్ని మొత్తం వినియోగదారులమీదకు బదిలీ చేయడంతో ఇలా భారీగా ధరలు పెరుగుతున్నాయి. పెట్రోలు ధర లీటర్ కు 30 పైసలు,డీజిల్ ధర 35 పైసలు పెరగడం ఇది వరుసగా మూడో రోజు. ఇంటర్నేషన ల్ మార్కెట్ లో బ్రెంట్ క్రూడ్ బ్యారెల్ ధర 82 డాలర్ల కు చేరడంతో ధరలు పెరగడం మొదలయింది. ఆయల్ ఉత్పత్తి చేసే దేశాలు (OPEC) పెట్రోలియం ఉత్పత్తిని రోజుకు 0.4 మిలియన్ బారెల్స్ మించి ఉత్పత్తి చేయకూడదని నిర్ణయించడంతో ధరలు పెరుగుతున్నాయి. ఒక నెల కిందట బ్రెంట్ క్రూడ్ ధర బ్యారెల్ 72 డాలర్లే ఉండింది. భారతదేశం ఆయిల్ కోసం దిగుమతుల మీద ఆధారపడాల్సి ఉండటంతో క్రూడ్ ధరల భారత దేశం ప్రజలందరి మీద పడుతూ ఉంది.
వచ్చే ఏడాది ఏప్రిల్ దాకా రోజుకు 4 లక్షల డాలర్లు మించి ఉత్పత్తి చేయరాదని ఒపెక్ దేశాలు నిర్ణయించాయి. క్రమంగా ఇపుడున్న 5.8 మిలియన్ల బ్యారెళ్ల ఉత్పత్తిని 4 లక్షలకు కుదించేశాయి. డిమాండ్ విపరీతంగా ప్రొడక్షన్ తగ్గిపోయింది. దీనితో క్రూడ్ ధరలు విపరీతంగా పెరిగాయని రాయిటర్స్ (Reuters) రాసింది. లక్షల బ్యారెళ్ల ఉత్పత్తి గురించి ఒపెక్ దేశాల మధ్య జూలై నెలలో ఒప్పందం కుదిరింది. వచ్చే ఏప్రిల్ దాకా దీనికి కట్టుబడే ఉంటాయి.ఈ ఏడాది ఇప్పటిదాకా ఆయిల్ ధరలు 50 శాతం పెరిగాయి.
పెరిగిన ధరల ప్రకారం ప్రధాన నగరాల్లో పెట్రోల్, డీజిల్ ధరలు ఇలా ఉన్నాయి.
ఢిల్లీలో లీటర్ పెట్రోల్ రూ. 103.84/ltr(రూ.0.30 పెరిగింది) & లీటర్ డీజిల్ రూ. 92.47/ltr(రూ.0.35 పెరిగింది).
ముంబైలో పెట్రోల్ రూ. 109.84/ltr (రూ.0.29పెరిగింది), డీజిల్ రూ .100.29/ltr(రూ.0.37 పెరిగింది)
కోల్కతాలో పెట్రోల్ రూ. 104.52/ltr (రూ.0.29 పెరిగింది) & డీజిల్ రూ. 95.58/ltr(రూ.0.35 పెరిగింది)
చెన్నైలో పెట్రోల్ రూ .101.27/ltr(రూ.0.26 పెరిగింది)& డీజిల్ రూ. 96.93/ltr(రూ.0.33 పెరిగింది)
హైదరాబాద్లో లీటర్ పెట్రోల్ రూ.108.02(రూ.0.31 పెరిగింది), డీజిల్ లీటర్ రూ.100.89(రూ.0.38 పెరిగింది).