వచ్చే మూడు రోజుల్లో మరిన్ని వర్షాలు

 

తెలంగాణ రాష్ట్రంలో మరో 3 రోజులపాటు ఉరుములు, మెరుపులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం ప్రకటించింది.

కిందిస్థాయి గాలులు తూర్పు, ఈశాన్య దిశల నుంచి తెలంగాణలోకి వస్తున్నట్టు తెలిపింది. తూర్పు మధ్య అరేబియా సముద్రం నుంచి రాయలసీమ, ఆంధ్రప్రదేశ్‌ తీరం మీదుగా పశ్చిమ మధ్య బంగాళాఖాతం వరకు ఉన్న ఉపరితల ఆవర్తనం ఇవాళ బలహీనపడినట్టు పేర్కొంది.

ఈనెల 10 వ తేదీన ఉత్తర అండమాన్‌ సముద్రంలో అల్పపీడనం ఏర్పడే అవకాశాలున్నాయని వెల్లడించింది. ఈ అల్పపీడనం మరింత బలపడి పశ్చిమవాయువ్య దిశగా ప్రయాణించి రానున్న 4-5 రోజుల్లో దక్షిణ ఒడిశా, ఉత్తర కోస్తాంధ్రా తీరానికి చేరుకొనే అవకాశం ఉందని తెలిపింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *