హరిత హారానికి ప్రత్యేక నిధి: కేసీఆర్

 

తెలంగాణకు హరితహారం కార్యక్రమాన్ని మరింత సమర్థవంతంగా నిర్వహించేందుకు  హరిత నిధి ఏర్పాటు చేస్తున్నట్లు అసెంబ్లీ లో ముఖ్యమంత్రి కెసీఆర్ ప్రకటించారు.

పచ్చదనం పెంపు పట్ల ప్రతీ ఒక్కరు తమ బాధ్యత, పాత్ర పోషించేలా చొరవ తీసుకునేలా చేసేందుకు
తెలంగాణ హరిత నిధి ఏర్పాటు  ప్రతిపాదన చేస్తున్నట్లు ఆయన చేశారు.

ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీల జీతాల నుంచి నెలకు 500 రూపాయలు అందిస్తారు.

ఐఏఎస్, ఐపీఎస్, ఐఎఫ్ఎస్ అధికారులు ప్రతీ నెలా 100 రూపాయల విరాళం ఇస్తారు.

ప్రతీ ప్రభుత్వ ఉద్యోగి నుంచి నెలకు 25 రూపాయలు అందిస్తారు.

రిజిస్ట్రేషన్లు, భవనాలు అనుమతులు, వాహన రిజిస్ట్రేషన్ల సమయంలో కొద్ది మొత్తం వసూలు చేస్తారు.

విద్యార్థుల అడ్మిషన్ల సమయంలో ఒక్కొక్కరికి ఐదు రూపాయలు సేకరిస్తారు.

స్వచ్ఛందంగా ముందుకు వచ్చే సంస్థలు, వ్యక్తుల నుంచి విరాళాల సేకరణ  జరుగు తుందని సీఎం చెప్పారు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *