డాక్టర్ యంవి రమణారెడ్డి కన్నుమూత

(రాఘవశర్మ)
డాక్టర్ ఎం వి రమణారెడ్డి ఈ ఉదయం కర్నూలు ఆస్పత్రి లో మరణించారు. ఆయన సొంత ఊరు కడప జిల్లా ప్రొద్దుటూరు. ఎంవీఆర్ గా ఆయన పాపులర్. రాజకీయాల్లో మూడు అక్షరాల పొట్టి పేరుతో పాపులర్ అయిన తొలి నాయకుడు ఆయనే కావచ్చు. 1970 దశకంలో. ఆయనకు హీరో వర్షిప్ ఉండేది. మావోయిస్టు రాజకీయాల నుంచి పార్లమెంటరీ రాజకీయాల దాకా సాగిన ఆయన సుదీర్ఘ ప్రస్థానం లో  నిబద్ధత ఆయన హాల్ మార్క్. సాహిత్యం ముఖ్యన్గా పుస్తక పఠనం, రచనా వ్యాసంగం నీడలాగా ఆయన్ని వదల్లేదు.తుది శ్వాస వదిలేదాకా ఆయన చేయి కలం వదల్లేదు.
ఆయన మృతితో ‘సీమ’ గొంతు మూగవోయిం ది. ఎంతో ఆవేదన, ఆగ్రహం, ఆర్ద్ర త నిండిన ఆయన కలం’ రాయల సీమ కన్నీటి గాథ ‘ ను వినిపించింది. ‘ప్రభంజనం ‘ పత్రికను నిర్వహించారు. ప్రపంచ చరిత్ర పాఠాలు చెప్పారు. విప్లవరాజకీయాల తో మొదలైన ఆయన జీవితం, కార్మిక నాయకుడిగా , విప్లవ రచయిత గా, రచయిత గా, జీవిత ఖైదీ గా, రాజకీయ నాయకుడి గా ఎన్ని మలుపులు తిరిగిం దో !
అంపశయ్య పై న ఉన్నా, గో ర్ కీ ‘అమ్మ ‘ ను అనువాదం చేశారు.
జులై లో నేను, భూ మ న్, చెరు కూరి సత్యనారాయణ ఆయనను కలిశా ము.
జీవిత చరిత్ర రాయ మి ని కో రాం.
జీవిత చరిత్ర మొదలు పెట్టారు.
కానీ అది పూర్తి కాకుండా నే కర్నూలు ఆస్పత్రి లో ఈ ఉదయం కన్ను మూసా రు.
రమణారెడ్డి ని కలిసిన సందర్భంగా ఆయన తో మేము జరిపిన మాటా మంతిని మరొక సారి గుర్తు చేస్తూ ఈ పోస్టింగ్…

ఇది కూడా చదవండి

అమ్మ’ని మర్చిపోని అక్షర యోధుడు ఎమ్వీయార్ తో ’ప్రెండ్షిఫ్ డే‘

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *