హైదరాబాద్: తెలంగాణ శాసనసభ సమావేశాలు శుక్రవారం నుంచి ఉదయం 11 గంటలకు ప్రారంభవుతున్నాయి.
సభ జరిగే తేదీలు, ఎజెండా తదితర అంశాలను అసెంబ్లీ సమావేశాల తొలి రోజున జరిగే బిజినెస్ అడ్వైజరీ కమిటీ (బీఏసీ) ఖరారు చేస్తుంది.
తొలి రోజున ఇటీవల మరణించిన మాజీ శాసనసభ్యులు, మండలి సభ్యుల మృతికి సంతాపం ప్రకటించి వాయిదా పడుతుంది.
శని, ఆది వారాల్లో విరామం.
ఈ నెల 27 నుంచి వరుసగా ఐదు రోజుల పాటు సభ సాగుతుంది. సీనియర్ సభ్యుడు
నాగార్జునసాగర్ ఉప ఎన్నికలో టీఆర్ఎస్ నుంచి ఎన్నికైన నోముల భరత్ కూడా తొలిసారి శాసనసభ సమావేశాలకు హాజరవుతారు.
ఇటీవల తెలంగాణ రాజకీయాల్లో చర్చనీయాంశమయిన ‘దళితబంధు’కు చట్టరూపం ఇచ్చేందుకు ఒక బిల్లు ఈ సమావేశాలలో చర్చకు వస్తుంది.
దీని మీద బాగా రభస జరిగే అవకాశం ఉంది.ఎందుకంటే,ప్రతిపక్ష పార్టీలు ‘దళిత బంధు’ ను రాష్ట్రమంతా అమలు చేయాలని, ఇతర కులాలకు కూడా బంధుపథకం అమలుచేయాలని డిమాండ్ చేస్తున్నాయి.
దళితబంధు పథకం, వరి ధాన్యం కొనుగోలు రద్దు,, నదీ జలాల వివాదంలో రాష్ట్ర ప్రభుత్వ దోరని, ముఖ్యమంత్రే హామీ ఇచ్చిన 50 వేలఉద్యోగాల భర్తీ సింగరేణి కాలనీలో ఆరేళ్ల చిన్నారిపై అత్యాచారం, హత్య ఘటన వంటి అంశాలు సమావేశాల్లో చర్చకు వచ్చే అవకాశముంది.