అఫ్గన్ ప్రభుత్వం ఏర్పాటు జాప్యం, దేశంలో అంతర్యుద్ధ మేఘాలు

ఇరవై రోజులుగా అఫ్గానిస్తాన్ లో ప్రభుత్వమే లేదు. అమెరికా మద్దతుతో కొనసాగిన అబ్దుల్ ఘనీ ప్రభుత్వం కూలిపోయింది. ఆగస్టు 15న  కాబూల్ తాలిబన్లు వశమయింది.  అయితే, తాలిబన్లు ఇంకాప్రభుత్వం ఏర్పాటుచేయలేకపోతున్నారు.

ఒకవైపు మహిళలతోసహా అన్ని వర్గాలకు ప్రాతినిధ్యం వుండే ప్రభుత్వం ఏర్పాటుచేయాలన్న అంతర్జాతీయ వత్తిడి, మరొక వైపు తాలిబన్లలోనే హఖానీ (Haqqani) వర్గంతో  నాయకత్వానికి విబేధాలు  ప్రభుత్వం ఏర్పాటుకాకుండా చేస్తున్నాయి.

ఇంకొక వైపు పంజ్ షీర్  రాష్ట్రం తాలిబన్లుకు అనుకున్నంత సులభంగా లొంగిపోవడం లేదు. పంజ్ షీర్ వశమయిందని ఒకవైపు తాలిబన్లు ప్రకటిస్తుంటే, అలాంటిదేమీ లేదు, అదంతా తాలిబన్ అనుకూల పాకిస్తాన్ మీడియా ప్రచారం అని అక్కడి తిరుగుబాటు దారులు ప్రకటిస్తున్నారు.

దీనితో  కాబూల్ ను వశపర్చుకున్నా సులభంగా తాలిబన్లు  ప్రభుత్వం ఏర్పాటుచేయలేరని, శాంతి నెలకొల్పలేరని అమెరికా చెబుతున్నది. అఫ్గనిస్తాన్  దీర్ఘకాలిక అంతర్యుద్ధంలోకి జారుకునే సూచనలు కనిపిస్తున్నాయని అమెరికా సైనికాధికారి జనరల్ మార్క్ మిలీ అంటున్నారు. ఈ పరిస్థితి అల్ ఖేదా, ఐసిస్ లు చొరబడేందుకు అనుకూలంగా మారుతుందని ఆయన ఫాక్స్ న్యూస్ తో చెప్పారు.

పంజ్ షీర్ లో తాలిబన్లను తరిమేసేందుకు స్థానికులు భీకరంగా పోరాడుతున్నారు. అక్కడి నుంచి వస్తున్న సమాచారం ప్రకాారం కనీసం 600 మంది తాలిబన్లు ఈ యుద్ధంలో చనిపోయి ఉంటారని, మరొక వేయి మంది తిరుగుబాటుదారులు బంధించి ఉంటారని  తెలుస్తున్నది. పంజ్ షీర్ లొంగిపోయిందన్న తప్పుడు వార్తతోనిన్న  సంతోషంతో గాలిలోకి కాల్పులు జరిపిన  సంఘటనలో కాబూల్ లో పలువురుచనిపోయారు.  గాయపడ్డారు.

తాలిబన్లు పంజ్ షీర్ ను చట్టుముట్టినా  రాజధాని బజారక్ ప్రాంతాన్ని సమీపించకుండా ఉండేందుకు పెద్ద ఎత్తును లాండ్ మైన్స్  అమర్చడంతో తాలిబన్లు ముందుకు సాగలేకపోతున్నారు.

పంజ్ షీర్ లో తాలిబన్ వ్యతిరేకులంతా నేషనల్ రెసిస్టెన్స్ ఫ్రంటు (NRF)గా ఏర్పడి పోరాడుతున్నారు. తాలిబన్లు పంజ్ షీర్, కపీసా సరిహద్దున ఉన్న దర్బాండ్ పర్వతాల మీదకు చేరుకున్నా ఎన్ఆర్ ఎఫ్ దళాలు వారినిదూరంగా తరిమికొట్టినట్లు అంతర్జాతీయ మీడియారాస్తున్నది.

తాలిబన్, ఎన్ ఆర్ ఎఫ్ మధ్య కొనసాగుతున్న యుద్ధం మీద ఆఫ్గనిస్తాన్ కు చెందిన టోలో న్యూస్ వీడియో

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *