తీన్మార్ మల్లన్న కు సికింద్రాబాద్ కోర్టు 14 రోజుల పాటు రిమాండ్ విధించినది. ఆయన మీద
IPC 306, 511 సెక్షన్స్ పెట్టడం పై న్యాయవాది ఉమేష్ చంద్ర అభ్యంతరం తెలిపారు
పిర్యాదు దారుడు ఎలాంటి సూసైడ్ అట్టెంప్ట్ చేయలేదని కోర్ట్ దృష్టికి తీసుకెళ్లిన న్యాయవాది.ఈ విషయాన్ని పరిశీలిస్తామి కోర్టు తెలిపింది.
అయితే, మల్లన్నకు బెయిల్ కోరుతూ పిటిషన్ దాఖలు చేయనున్నట్లు న్యాయవాది ఉమేష్ చంద్రతెలిపారు.
తీన్మార్ మల్లన్న గా పేరుబడిన జర్నలిస్టు చింతపండు నవీన్ ని శుక్రవారం నాడు పోలీసులు అరెస్టు చేశారు.
మల్లన్న తనని డబ్బుకోసం బ్లాక్ మెయిల్ చేస్తున్నాడని నగరానికి చెందిన లక్మీకాంత శర్మ అనే జ్యోతిష్యుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. తననుంచి 30 లక్షల రుపాయలు డబ్బు డిమాండ్ చేస్తున్నాడని, డబ్బు ఇవ్వకపోతే తన ప్రతష్టకు భంగం కలిగించే విధంగా కథనాలు తన క్యూ న్యూస్ చానెల్లో ప్రచారం చేస్తాని బెదిరిస్తున్నాడని శర్మ ఫిర్యాదు చేవారు. దీని మీద చిలకల గూడ పోలీసులు ఎఫ్ ఐఆర్ నమోదు చేసి విచారణ చేశారు.ఐపిసి 387,504 సెక్షన్ల కింద ఆయన మీద కేసులు నమోదు చేశారు. ఇదే విధంగాముఖ్యమంత్రికెసిఆర్ మీద అభ్యంతరకర వ్యాఖ్యలు చేసినందుకు కూడా పోలీసులు కేసు నమోదుచేశారు. శుక్రవారం నాడు ఆయనను పోలీసులు అరెస్టు చేశారు. నేడు కోర్టు ముందు హాజరుపరిచారు.