మెక్సికో అక్కున చేరిన అఫ్గాన్ రోబొటిక్స్ బాలికలు

తాలిబన్ల చెర నుంచిబయటపడేందుకు ఆఫ్గన్ మహిళలు రకరకాల సాహసాలుచేసి సరిహద్దులు దాటుతున్నారు.  అలాగే కొంతమంది అంతర్జతీయ వలంటీర్లు కూడా వారికి సహాయం చేస్తున్నారు. ఇలా అప్ఘాన్ నుంచి తప్పించుకున్న వారిలో అయిదురుగు చిచ్చరపిడుగులున్నారు. వారంతా అమ్మాయిలు.  14 సంవత్సరాలలోపు వారే. అంతేకాదు, వాళ్లంతా ఒకే టీం.

అఫ్ఘాన్ రోబో టిక్ టీమ్. రోబోటిక్స్ అసాధారణ నైపుణ్యం ఉన్న ఆప్గనీ బాలికలు. నానా కష్టాలు పడి, అంతర్జాతీయ వలంటీర్ల  సహకారం తీసుకుని వారంతా  మంగళవారం నాడు మెక్సికో నగరం  చేరుకున్నారు.

అక్కడ మెక్సికో దేశ డిప్యూటీ విదేశాంగమంత్రి మార్తా డెల్గాడో వారికి సాదర స్వాగతం పలికారు. కాబూల్ తాలిబన్ల వశం కాగానే, తమక్కిక్కడ భవిష్యత్తు లేదనుకుని వారు  భావించారు. ఆందోళన చెందుతూ, భయం భయంగా అక్కడ బతకడం కష్టమని భావించారు.

లోకా స్ట్ వెంటిలేటర్ తో రోబొటిక్స్ బాలిక (credit: tolonews)

గతంలో తాలిబన్లు అధికారంలోకి రాగానే పాఠశాలలు, కాలేజీలను మూసేశారు. బాలికలను, మహిళలను ఇళ్లకు పంపించేశారు. అందుకే  ఇక దేశం విడిచిపోవలిసిందే అనుకున్నారు.

ఈ రోబోటిక్ టీమ్ కు దేశమంతా పేర్కొంది.వాళ్లు చేసిన ప్రయోగాలకు ఎన్నోజాతీయ అంతర్జాతీయ అవార్డులొచ్చాయి. పాండెమిక్ సమంయలో,గత మార్చిలో ఒపెన్ సోర్స్  ప్లాట్ ఫామ్ మీద పనిచేస్తూ ఒక లోకాస్ట్ వేంటిలేటర్ ను తయారుచేసి ప్రశంసలందుకున్నారు.

ఆఫ్గనిస్తాన్ నుంచి మెక్సిక్ రావాలనుకుంటున్న మహిళలకు, బాలికలకు మెక్సికో ప్రభుత్వం తలుపులు తెరించింది. వాళ్ల దరఖాస్తులను వేగంగా ప్రాసెస్ చేయడం మొదలుపెట్టింది.

అఫ్గాన్ కు చెందిన మరొక బాలికల రోబోటిక్ టీ మ్ ఖతార్ చేరింది.

మెక్సికో ప్రభత్వం ఫెమినిస్ట్ విదేేశాంగవిధానం అనుసరిస్తూ ఉందని, అందుకే తాము తాము ఈ బాలికలను సాదరంగా ఆహ్వానించామని డెల్గాడో చెప్పారు.

“Following the tradition of solidarity and with the feminist foreign policy of the Mexican government, we have carried out many diplomatic efforts to create a safe passage that would allow us to bring them to Mexico,” అని డెల్గాడో చెప్పినట్లు Mexico  News Daily రాసింది.

“Following the tradition of solidarity and with the feminist foreign policy of the Mexican government, we have carried out many diplomatic efforts to create a safe passage that would allow us to bring them to Mexico,” Delgado said. “We give you the warmest welcome to Mexico.”

మెక్సికో  చేరుకున్నాక ఈబాలికలు  మీడియాతో మాట్లాడారు.  తమక సహకరించిన వాళ్లకు ధన్యవాదాలు తెలిపారు. తమను కాపాడటమే కాదు,తమ కలలను కూడా కాపాడారని వారు పేర్కొన్నారు.

“They have not only saved our lives, but they have also saved our dreams,” ఈ బందంలోని ఒక బాలిక చెప్పింది.

మా కథ తాలిబన్ చెరలో అంతంకావడానికి వీల్లేదని ఆమె  కోవిడ్-19 మాస్క్ ధరించే చెప్పారు.

మెక్సిక్ ప్రభుత్వం వీళ్లందరికి 180 రోజులు చెల్లుబాటయ్యే హ్యూమనిటేరియన్ వీసాలుమంజూరు చేసింది. తర్వాత ఈ కాలంలో వాళ్లు వాటిని రెన్యూ చేసుకోవచ్చు, లేదా తమ హోదా మార్పుకోసం దరఖాస్తు చే కోవచ్చు. ఈ బాలికలంతా అఫ్గాన్ డ్రీమర్స్ గ్రూప్ కు చెందిన వాళ్లు.  ఇందులో 20 మంది అంత్యంత ప్రతిభ ఉన్న బాలికలు.

మంగళవారం నాడు మొత్తం  100 మంది అఫ్గాన్ శరణార్థులు మెక్సికో లో ప్రవేశించారు. బుధవారం నాడు మరొక 124 మంది వచ్చారు. వీరిలో జర్నలిస్టులు కూడా ఉన్నారు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *