డ్రగ్స్ కేసులో 12 మంది సినిమా స్టార్లకు నోటీసులు

ఆ మధ్య తెలుగు చిత్ర పరిశ్రమను కుదిపేసిన డ్రగ్స్ కేసు మళ్లీ వార్తలకెక్కింది. సెలెబ్రెటీల మీద బుక్ అయ్యే కేసులకు పట్టిన గతే దీనికి పట్టింది. అయితే ఇపుడు కేంద్ర సంస్థ జోక్యం చేసుకుంది. ముగింపు ఎలా ఉంటుందో తెలియదు కాని, కొద్ది రోజులు సినిమా సందడి రక్తి కట్టిస్తుంది.

మాదక ద్రవ్యాల రవాణా, మనీలాండరింగ్ కేసుకు సంబంధించి 12 మంది టాలీవుడ్ స్టార్లకు ఎన్‏ఫోర్స్‏మెంట్ డైరెక్టరేట్ (ED) ఈ రోజు సమన్లు జారీ చేసింది.

ఆగస్టు 31 నుంచి సెప్టెంబరు 22 వరకు సినీ స్టార్స్ విచారణకు హాజరు కావాలి.

చిత్రమేమిటంటే ఆ కేసు మిద రాష్ట్ర ప్రభుత్వం సిట్ వేసింది. అంతే. కేస్ కదలలేదు. సాక్షాలు లేవని, పరోక్షంగా క్లీన్ చిట్ ఇచ్చారు. అందుకే ఈ కేస్ దర్యాప్తు చేసిన ఎక్సయిజ్ అధికారులకు కూడా ఇడి అధికారులు సమన్లు జారీ చేశారు.

స్పెషల్ ఇన్వెస్టిగేషన్  62 మంది టాలివుడ్ యాక్టర్ల, ఇతర సెలెబ్రిటీల, వెండ్రుకలు, గోళ్లనమూనాలు సేకరించిపరీక్షించినా  ఒక్కరి పేరు కూడా సిట్ ఫైల్ చేసిన చార్జీషీట్లలోకి ఎక్కలేదు. 12 కేసులు నమోదుచేసిన వేసిన చార్జ్ షీట్లు కేవలం నాలుగు. ఈ 62 మందిలో  కనీసం 12 మందిని సిట్ విచారించింది. ఇందులో టాప్ డైరెక్టర్లు యాక్టర్లు, ఇతర సపోర్టింగ్ యాక్టర్లు ఉన్నారని టైమ్స్ ఆఫ్ ఇండియా ఎపుడో రాసింది.

సిట్ విచారణ ప్రగతి మీది హైదరాబాద్ కు చెందిన ఫోరమ్ ఫర్ గుడ్ గవర్నెన్స్  (FGG) అప్పటి రాష్ట్ర ప్రధాన కార్యదర్శికి లేఖ రాస్తూ విచారం వ్యక్తం  చేసింది. సాధారణంగా సిట్ కు సీనియర్ ఐపిఎస్ అధికారిని ఇన్ చార్జ్ గా నియమిస్తారు. గతంలో ఏర్పాటయిన లిక్కర్ స్కామ్ లో గాని,నయీమ్ కేసులో గాని అడిషనల్ డిజి ర్యాంక్ అధికారిని ఇన్ చార్జ్ గా నియమించారు. సినిమా స్టార్ల మీద వచ్చిన ఆరోపణను విచారించేందుకు వేసిన సిట్ మీద కేవలం ఒక ఇన్స్ పెక్టర్ ర్యాంక్ అధికారిని ఇన్ చార్జ్ గా నియమించడం చూస్తే ఈకేసు మీద ప్రభుత్వానికి పెద్ద ఆసక్తి లేదని అర్థమవుతుందని ఈసంస్థ కార్యదర్శి ఎం పద్మనాభరెడ్డి లేఖలో పేర్కొన్నారు.

ఇపుడు సమన్లు ఆందుకున్నవారు:

పూరి జగన్నాధ్.. ఆగస్టు 31
ఛార్మి సెప్టెంబర్ 2,
రకుల్ ప్రీత్ సింగ్ సెప్టెంబర్ 6
రాణా దగ్గుబాటి సెప్టెంబర్ 8
రవితేజ సెప్టెంబర్ 9
శ్రీనివాస్ సెప్టెంబర్ 9
నవదీప్ సెప్టెంబర్ 13
ఎఫ్ క్లబ్ జీఎం
సెప్టెంబర్ 13
ముమైత్ ఖాన్ సెప్టెంబర్ 15
తనీష్
సెప్టెంబర్ 17
నందు సెప్టెంబర్ 20
తరుణ్ సెప్టెంబర్ 22 న

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *