” ఛలో బైరాన్ పల్లి” పితృయజ్ఞానికి తరలిరండి !

 

– కుల మత వర్గ ప్రాంత పార్టీలకు అతీతంగా భారీ సంఖ్యలో తరలిరండి
– సర్వోన్నత్ భారతీయ సంవిధాన్ అధ్యక్షుడు డాక్టర్ మోహనకృష్ణ భార్గవ పిలుపు

జనగామ : ఆగష్టు 27 వచ్చే శుక్రవారం ఉదయం 11గంటలకు మద్దూరు మండలంలోని బైరాన్ పల్లి గ్రామంలోని బురుజు వద్ద మాజీ రాజ్యసభ సభ్యులు రాపోలు ఆనందభాస్కర్ ఆధ్వర్యంలో అమరులకు పిండప్రదానం, పితృయజ్ఞం శాంతిహోమం, సంస్మరణ సభ నిర్వహించనున్నారని తెలిపారు.

ఈ సందర్భంగా మోహనకృష్ణ భార్గవ మాట్లాడుతూ వీర బైరాన్ పల్లి అమరుల త్యాగం వల్లే నేడు తెలంగాణ ప్రజలు స్వేచ్ఛా వాయువుని పీలుస్తున్నారని గుర్తుచేశారు. నిజాం నిరంకుశ పాలనలో అతడి సైన్యమైన రజాకార్లు ప్రజల్ని హింసిస్తూ అనేక అకృత్యాలకు, హత్యలకు, మహిళలపై అఘాయిత్యాలకు పాల్పడ్డారని. హైద్రాబాద్ సంస్థానాన్ని పాకిస్తాన్ వంటి స్వతంత్ర ఇస్లాం రాజ్యంగా ప్రకటించాలని ఆలోచనలో ఉన్న నిజాంకు వీర బైరాన్ పల్లి ప్రజల తిరుగుబాటు ఉలిక్కిపడేలా కలవరపరచిందని. వారు నిజాం రజాకార్ మూకలతో పాటు బ్రిటీష్ సైన్యంపై కూడా తిరుగుబాటు చేసి ఊర్లనుండి తరిమికొట్టారని. 1948 ఆగష్టు 27న రజాకార్ల సైన్యం వీరబైరాన్ పల్లిని చుట్టు ముట్టి 118మంది పోరాట యోధుల్ని అక్కడికక్కడే కాల్చి చంపారని. ఈ సంఘటన తరువాతే నాటి భారత హోంశాఖా మంత్రి సర్ధార్ వల్లభాయ్ పటేల్‌ అపరేషన్ పోలో ద్వారా హైదరాబాద్ సంస్థానాన్ని భారత్ లో విలీనం చేశారని.

నిజాం విమోచనకు నాంది పలికిన వీర బైరాన్ పల్లి అమరుల త్యాగాన్ని స్మరించుకోవలసిన బాధ్యత మనందరిపై ఉందన్నారు. కుల,మత, వర్గ, ప్రాంత, పార్టీలకు అతీతంగా ఆగష్టు 27 బైరాన్ పల్లి బురుజు వద్ద అమరులకు నివాళులు అర్పించేందుకు ప్రజలు భారీ సంఖ్యలో కదలిరావాలని కోరారు..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *