బడిని పిల్లల దగ్గరికే తీసుకెళ్లిన తెలంగాణ టీచరమ్మ

కరోనా వల్ల బడికి విద్యార్థులు రాలేకపోతున్నారు.  దీనితో  వారు చదువుకు దూరం అవుతున్నారు. నిన్ననే రిజర్వు బ్యాంక్ మాజీ గవర్నర్ రాజన్ ఒకటిన్నర ఏడాదిగా స్కూళ్లు మూతపడినందున ఒక తరం ఎలా నష్టపోతుందో హెచ్చరించారు. స్కూళ్లు తెరవండని కోరారు. ఇలా కొద్ది రోజులూ మూస్తే ఈ తరం స్కూళ్లను మరిచిపోతుందని,  నిరక్ష రాస్యులయిన వారికి ఉపాధి కష్టమవుతుంది. అపుడు  మరొక 60 సంవత్సరాలు వాళ్ల పోషణదేశానికి భారమవుతుందని హెచ్చరించారు.

ఇలాంటి భయానక భవిష్యత్తు ఈ తరం పిల్లలకు రానుందని ఊహించిందేమో తెలంగాణకు చెందిన ఒక  టీచరమ్మ వీధిని బడిగా మార్చేసింది.

పూర్వం గవర్నమెంటు పాఠశాలలను వీధి బడలులనే వాళ్లు. ఇపుడు   పెద్దపల్లి మండలం MPPS పుట్టపల్లి ఉపాధ్యాయురాలు సజ్జనం భాగ్యలక్ష్మి వీధిలోకి తీసుకెళ్లారు. అక్షరాల వీధిబడి ప్రారంభించారు.

ఇంకా స్పష్టంగా చెబితే, పిల్లలు ఆడుకుంటున్న చోటుకే బడిని తీసుకెళ్లారు. గోడలను ఆమె బ్లాక్ బోర్డులుగా మార్చారు. ఈ బోర్డులను చూస్తూ , ఆడుకుంటూ, పాడుకుంటూ, చెట్ల నీడన కూర్చుని  ప్రాక్టీస్ చేసేందుకు పిల్లలకు వీలు కల్పించారు.

వాడల్లో తిరుగుతూ, అడుతూ కుడా ఆవూర్లో పిల్లలు అక్షరాభ్యాసం చేస్తున్నారు. ఇదొక గొప్ప ఆలోచన. ఇలాంటి ఆలోచనకు కార్యరూపంలో కల్పించిన భాగ్యలక్ష్మిని అభినిందించాలి.

వూరూర టీచర్లు ఇలా పాఠశాలలను పిల్లలు ఆడుకునే చోటుకు తీసికెళ్లేందుకు ప్రయ్నతించాలి. కరోనా లోనే కాదు, కరోనా లేనపుడు కూడా పాటించాల్సిన గొప్ప ఆలోచన.

గ్రామంలోని గృహాల గోడలను స్కూలు బ్లాక్ బోర్డులుగా మార్చిన భాగ్యలక్ష్మికి జై కొట్టాల్సిందే…

Like the story, pl share it with friends!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *