ఆంధ్రప్రదేశ్ కు మూడు రోజుల వాతావరణ సూచన

భారత వాతావరణ కేంద్రం ప్రకటన

పశ్చిమ మధ్య బంగాళాఖాతం లో ఉత్తర ఆంధ్రప్రదేశ్ తీరంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం ఇప్పుడు దక్షిణ ఒడిశా తీరం వరకు సగటు సముద్రమట్టానికి 3.1 కిమీ & 7.6 కిమీ మధ్య నైరుతి దిశగా ఎత్తులో వంగి ఉంటుంది.వీటి ఫలితముగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాగల మూడు రోజుల వరకు వాతావరణ సూచన :

ఉత్తర కోస్తా ఆంధ్ర , యానాం :

ఈ రోజు ఉత్తర కోస్తా ఆంధ్రాలో ఉరుములు మెరుపులతో కూడిన తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు చాలా చోట్ల కురిసే అవకాశం ఉంటుంది. మరియు భారీ వర్షాలు ఒకటి లేక రెండు చోట్ల కురిసే అవకాశం ఉంటుంది
రేపు , ఉత్తర కోస్తా ఆంధ్రాలో ఉరుములు మెరుపులతో కూడిన తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు చాలా చోట్ల కురిసే అవకాశం ఉంటుంది. మరియు భారీ నుంచి అతి భారీ వర్షాలు ఒకటి లేక రెండు చోట్ల కురిసే అవకాశం ఉంటుంది. పెనుగాలులు 40కిమీ నుంచి 50కిమీ వరకు గరిష్టముగా 60కిమీ వరకు ఉత్తర కోస్తా తీరం వెంబడి వీచే అవకాశం ఉంటుంది.

ఎల్లుండి ఉరుములు మెరుపులతో కూడిన తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు చాలా చోట్ల కురిసే అవకాశం ఉంటుంది. మరియు భారీ వర్షాలు ఒకటి లేక రెండు చోట్ల కురిసే అవకాశం ఉంటుంది. పెనుగాలులు 40 కిమీ నుంచి 50 కిమీ వరకు గరిష్టముగా 60 కిమీ వరకు ఉత్తర కోస్తా తీరం వెంబడి వీచే అవకాశం ఉంటుంది.

దక్షిణ కోస్తా ఆంధ్ర :

ఈరోజు, రేపు, ఎల్లుండి దక్షిణ కోస్తా ఆంధ్రాలో ఉరుములు మెరుపులతో కూడిన తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షం కొన్ని చోట్ల కురిసే అవకాశం ఉంటుంది .
పెనుగాలులు 40కిమీ నుంచి 50కిమీ వరకు గరిష్టముగా 60కిమీ వరకు దక్షిణ కోస్తా తీరం వెంబడి వీచే అవకాశం ఉంటుంది

రాయలసీమ

రాయలసీమ లో ఈరోజు రేపు, ఎల్లుండి తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షం కొన్ని చోట్ల కురిసే అవకాశం ఉంటుంది .

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *