మంత్రి కేటీఆర్ నిర్లక్ష్యం కారణంగా మ్యానువల్ స్కావెంజింగ్ చేస్తూ ప్రాణాలు కోల్పోయిన ఇద్దరు దళిత బిడ్డలకు రూ. కోటి చొప్పున ఎక్స్ గ్రేషియ ప్రకటించాలి: ఏఐసీసీ అధికార ప్రతినిధి డా. దాసోజు శ్రావణ్ డిమాండ్.
మంత్రి కేటీఆర్ ఏప్రిల్ లో మాట్లాడుతూ హైదరాబాద్ లో మ్యానువల్ స్కావెంజింగ్ లేదని గొప్పలు చెప్పారు. మరి కేసీఆర్ చెప్పినట్లు మ్యానువల్ స్కావెంజింగ్ అవసరమే లేకపొతే ఇద్దరు దళిత బిడ్డలు మ్యానువల్ స్కావెన్జింగ్ చేస్తూ ఎలా చనిపోయారు? మీరు చెప్పింది అబద్దం కాదా?
మ్యాన్ హోల్ స్కావెంజింగ్ లేకుండా పెద్ద ఎత్తున చర్యలు తీసుకోవాలి. నాళాలోకి వెళ్లి శుభ్రం చేసేవరకి రక్షణగా కేంద్ర ప్రభుత్వం ఒక పాలసీ తీసుకొచ్చింది. ఈ పాలసీ అమలు చేయడానికి నిర్దిష్టంగా అమలు చేసే విధండా చర్యలు తీసుకోవాలి.
లక్ష కోట్ల రూపాయిల ఆదాయం ఇచ్చే హైదరాబాద్ లో నాళాల్లో పడి ప్రజలు చనిపోతున్న పరిస్థితి. కేసీఆర్ ప్రభుత్వం సిగ్గుపడాలి. లక్ష కోట్ల ఆదాయం ఇస్తున్న హైదరాబద్ లో నాళా వైడింగ్, డిసిలిటింగ్, ఎక్స్టెన్షన్ , క్లీనింగ్ ఎందుకు చేయడం లేదు ?
టీఆర్ఎస్ నాయకుల బెదిరింపులకు భయపడం. టీఆర్ఎస్ నియంత పాలని ఎండగట్టి ప్రజాసామ్య సామాజిక తెలంగాణ సాదిస్తాం. అవినీతి చేసిన టీఆర్ఎస్ నాయకులని అణా పైసలతో కక్కిస్తాం. టీఆర్ఎస్ అసలు రంగు బయటపెడతాం.
”దళిత బంధు పేరుతో ఓట్ల రాజకీయం చేస్తున్న సిఎం కేసీఆర్.. ప్రభుత్వం నిర్లక్ష్యం కారణంగా మ్యానువల్ స్కావెంజింగ్ చేస్తూ ఊపిరాడక చనిపోయిన దళిత బిడ్డలు శివ, అంతయ్యల కుటుంబాలకు ఒకొక్క కోటి రూపాయిలు చొప్పున ఎక్స్ గ్రేషియా ప్రకటించాలి.
హైదరాబాద్ లోని ఎల్ బి నగర్ ప్రాంతంలో దొడ్లు శుభ్రం చేయడానికి మ్యాన్ హోల్ పైప్ లైన్ లో దిగిన శివ, అంతయ్య అనే ఇద్దరు దళిత ఊపిరాడక చనిపోయిన దుర్ఘటన పై తీవ్ర విచారం వ్యక్తం చేశారు దాసోజు శ్రావణ్.
దేశ సరిహద్దులో సైనికులు ఎంత ముఖ్యమో.. వ్యక్తిగత ఆరోగ్యాన్ని లెక్క చేయకుండా మ్యాన్ హోల్స్ లో దిగి దొడ్లు శుభ్రం చేసే వ్యక్తులు చేసే పని కూడా ముఖ్యమైనది. తమ ఆరోగ్యానికి కూడా లెక్క చేయకుండా ప్రమాదం అని తెలిసి కూడా మ్యాన్ హోల్ లో దిగి ఇద్దరు దళిత బిడ్డలు ప్రాణాలు కోల్పోవడం తీవ్ర బాధకరం.”
”మంత్రి కేటీఆర్ ఏప్రిల్ నెలలో మాట్లాడుతూ హైదరా బాద్ లో మ్యానువల్ స్కావెంజింగ్ లేదని గొప్పలు చెప్పారు. మరి కేసీఆర్ చెప్పినట్లు మ్యానువల్ స్కావెంజింగ్ అవసరమే లేకపొతే ఇద్దరు దళిత బిడ్డలు మ్యాన్ వల్ స్కావెన్జింగ్ చేస్తూ ఎలా చనిపోయారు ? మీరు చెప్పింది అబద్దం కాదా ? కేటీఆర్ సమాధానం చెప్పాలి. ప్రభుత్వం నిర్లక్ష్యం కారణంగా చనిపోయిన వారి కుటుంబాలకు ఒకొక్క కోటి రూపాయిలు చొప్పున ఎక్స్ గ్రేషియా ఇవ్వాలి.
‘వేసవిలోనే డీసిల్టింగ్ (చెత్తని శుభ్రం చేసే ప్రక్రియ) జరిగిపోవాలి. కానీ జులై నెలలో ఖైరతాబాద్ పరిసర ప్రాంతాలు పరిశేలిస్తే మొత్తం చెత్త కనిపించింది. చెత్తని శుభ్రపరిచే ప్రక్రియ జరగలేదు. చెత్తని ఎండాకాలంలో శుభ్రం చేస్తే వర్షాకాలంలో ఆటంకం వుండదు. ఈ విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరించిన ప్రభుత్వం మ్యానువల్ స్కావెంజర్లకి కూడా ఇబ్బంది కలిగించే పరిస్థితి సృష్టించింది.
మంత్రి కేటీఆర్ డీసిల్టింగ్, నాళా క్లీనింగ్ పనులకు సంబధించి తన ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు. నవంబర్ 2020వరకు ఈ పనులు హైదరాబాద్ మెట్రో వాటర్ వర్క్స్ కి ఇచ్చారు. వెంటనే జిహెచ్ఎస్సి కి బదిలీ చేశారు. మళ్ళీ ఆగస్ట్ 31నుంచి హైదరాబాద్ మెట్రో వాటర్ వర్క్స్ కి ఇచ్చారు. ఈ రకంగా ఇష్టానుసారంగా నిర్ణయాలు తీసుకోవడం వలన ఎవరూ బాధ్యత తీసుకోకుండా సమస్యని గాలికి వదిలేశారు. సమయాన్ని వృధా చేస్తూ జూన్ , జులైలో టెండర్ల పిలిస్తే పనులు ఎలా పూర్తవుతాయి?
మంత్రి కేటీఆర్ గత ఏడాదిగా వెయ్యి కోట్ల రూపాయిలకి పైగా పనులు చేసిన కాంట్రాక్టర్లకు డబ్బులు ఇవ్వడం లేదు. డబ్బులు ఇవ్వకపోవడంతో ఒక నెలలో జరగాల్సిన పనిని జాప్యం చేస్తూ నాలుగు ఐదు నెలలు చేస్తున్నారు. ఎండకాలంలో పూర్తి కావాల్సిన పనులు వర్ష కాలంలో పుర్తవుతున్నాయి. తీరా వర్షాలు రావడంతో చెత్త సమస్య అలానే మిగిలిపోతుంది. అసమర్దుల చేతిలో జిహెచ్ఎంసీ వుంది. వీరి నిర్లక్ష్యం అసమర్ధత కారణంగానే ఈ రోజు ఇద్దరు దళిత బిడ్డలు చనిపోయారు.
”మ్యాన్ హోల్ స్కావెంజింగ్ లేకుండా పెద్ద ఎత్తున చర్యలు తీసుకోవాలి. నిరుపేద బిడ్డలు శివ, అంతయ్యల కుటుంబాలకు ఒకొక్క కోటి రూపాయిలు చొప్పున ఎక్స్ గ్రేషియా ఇవ్వాలి. నాళాలోకి వెళ్లి శుభ్రం చేసేవరకి రక్షణగా కేంద్ర ప్రభుత్వం ఒక పాలసీ తీసుకొచ్చింది. ఈ పాలసీ అమలు చేయడానికి నిర్దిష్టంగా అమలు చేసే విధండా చర్యలు తీసుకోవాలి. ప్రభుత్వ అసమర్ధత , అధికారుల నిర్లక్ష్యం కారణంగానే ఇద్దరు నిరు పేద బిడ్డలు చనిపోయారు. ఈ చావులకి ప్రత్యేక్షంగా పరోక్షంగా కారణమైన వారందరిపైన కేసులు పెట్టాలి.
”లక్ష కోట్ల రూపాయిల ఆదాయం ఇచ్చే హైదరాబాద్ లో నాళాల్లో పడి ప్రజలు చనిపోతున్న పరిస్థితి. కేసీఆర్ ప్రభుత్వం సిగ్గుపడాలి. లక్ష కోట్ల ఆదాయం ఇస్తున్న హైదరాబద్ లో నాళా వైడింగ్, డిసిలిటింగ్, ఎక్స్టెన్షన్ , క్లీనింగ్ ఎందుకు చేయడం లేదు ? ఈ పనులన్నీ చేయడానికి నిర్దిష్టమైన ప్రణాళిక తీసుకురావాలి. 70వేల కోట్ల రూపాయిలు ఖర్చు చేస్తామని చెప్తారు ? పది నిమిషాలు వర్షం పడితే వీధులు రోడ్లు చేరువులైపోతున్నాయి. దయచేసి పనులన్నీ జరిగే విధంగా ఒక సమగ్రమైన ప్రణాళిక తీసుకురావాలి. ఈ కార్మికుల కుటుంబాలని ఆడుకునేలా కోటి రూపాయిలు ఇవ్వాలి.
”తెలంగాణ సమాజానికి ఒక విజ్ఞప్తి. నిర్లజ్జగా దోపిడీకి పాల్పడుతున్న టీఆర్ ఎస్ ఎమ్మెల్యేలు, మంత్రులు , నాయకుల పై నిఘా పెట్టాలి. అవినీతిని నిలదీయండి. దోపిడీ చేస్తున్న వారిని కాలర్ పట్టుకొని అడగండి. 2014లో స్కూటర్ మీద తిరిగడానికి డబ్బులు లేని వాళ్ళు ఈ రోజు కోట్ల రూపాయలు దోచుకున్నారు. ఎవరి సొమ్ము ఇదంతా ? సాండ్ మాఫియా, ల్యాండ్ మాఫియా వైన్ మాఫియా ఒక్కటి కాదు అధికార పార్టీ నాయకుల ఆగడాలకు అడ్డులేకుండపోయింది. అడిగితే రౌడీఇజం చేసి దాడి చేయడం , బ్లాక్ మెయిల్ చేయడం, పోలీసులుని పాలెగాళ్ళ లెక్క వాడుకొని కేసులు పెట్తించడం టీఆర్ఎస్ కి అలావాటుగా మారిపోయింది.
కానీ టీఆర్ఎస్స్ నాయకుల ఆటలు ఇంక ఎక్కువ కాలం సాగవు. రానున్న రెండేళ్ళు కాంగ్రెస్ పార్టీ ధర్మ యుద్ధంచేయనుంది. టీఆర్ఎస్ నియంత పాలని ఎండగట్టి ప్రజాసామ్య తెలంగాణ, సామాజిక తెలంగాణ సాదిద్దాం. టీఆర్ఎస్ నాయకుల బెదిరింపులకు భయపడం. అవినీతి చేసిన నాయకులని అణా పైసలతో కక్కిస్తాం. టీఆర్ఎస్ అసలు రంగు బయటపెడతాం.