రామరాజ్యమయినా, రాజన్న రాజ్యమయినా, సోషలిజమయినా, బంగారు తెలంగాణ అయినా, స్వర్ణాంధ్ర అయినా డబ్బుంటేనే హ్యాపీనెస్ ఉంటుంది. అందుకే ఈ రాజ్యాలన్ని డబ్బులు పంచి హ్యాపీనెస్ పంచినట్లు భ్రమ కలిగిస్తాయి.అలా కాకుండా, నిజాయితీగా నాలుగు డబ్బులు పొదుపు చేసుకుంటూ హ్యాపీ గా ఉండటం ఎలా అనే ప్రశ్నకు జవాబు కావాలి. Let’s Talk Money ఒక జవాబు ఇచ్చే ప్రయత్నం అంటున్నాడు పుస్తకం సమీక్షలో చంద్రశేఖర్.
( జె చంద్రశేఖర్)
ఈ పుస్తకాన్ని గత మార్చిలో చదివాను.ఇప్పుడు మళ్లీ రెండవసారి చదువుతున్నాను. ఎందుకో తెలుసా…
60 సం. వయసు వచ్చాక పెద్దగా శ్రమించలేము.అపుడు కనీస అవసరాలు తీరి జీవితం
సాఫీ గా సాగిపోవాలంటే
ఏమి చెయ్యాలో ఈ పుస్తకం
చెబుతుంది.
*పిల్లలు పెరిగి పెద్దవారై
ఏదైనా జీవనోపాధి పొందక మునుపే కుటుంబ పెద్దకు
ఏమైనా జరిగి అర్థఅంతరంగా తనువు చాలిస్తే అప్పుడు ఆ కుటుంబం తీరని వ్యథల పాలు కాకుండా
ఉండాలంటే 60కి చాల ముందే
కుటుంబ పెద్ద ఏమి చేయాలో
పై పుస్తకం చెబుతుంది.
*నీకొచ్చే తక్కువ నెల జీతం(గవర్నమెంట్ లేదా ప్రయివేట్)తోనే భవిష్యత్తు లో
సజావాయిన జీవనానికి
కావలసిన సంపదను ఎలా
వృద్ధి చేసుకోవాలో
ఈ పుస్తకం చెబుతుంది.
* కొంత మేరకు ఖర్చులను
తగ్గించుకొని నీ కష్టార్జితమునుండి
కొంత భాగాన్ని ఏవిధంగా పొదుపు చేస్తే
మన ఆర్థికం వృద్ధి అవుతుందో
ఈ పుస్తకం చెబుతుంది.
*PF, FD, INSURANCE, CHITS, ULIPS, REALESTATE, GOLD,MUTUAL FUNDS, STOKS,….వీటిలో వేటిలో మన కష్టార్జితం నుఉంచితే గరిష్ట ప్రయోజనాన్ని
సాధించవచ్చో
పై పుస్తకం లో విపులంగా రాయబడి ఉంది.
* మనము మన అసలును
నష్టపోకుండానే
దానిని ఎలా బాగా వృద్ధి చేసుకోవాలో పై పుస్తకం లో
రచయిత్రి వివరిస్తుంది.
* అందుకే ఇది best seller అయింది.
*ఇందులో రాత్రికి రాత్రి మనల్ని
కోటీశ్వరులను చేసే చిట్కాలు ఏవీ లేవు.
*ఇందులో చెప్పబడిన
సంపద వృద్ధి మార్గాలన్నీ పూర్తిగా చట్టబద్ధమైనవి
దగుల్బాజీ దృష్టి లేనివి.
*మన దేశం లో
బాగా చదువుకున్న వారికి
కూడా
ఆర్థిక విద్యలో ఓనమాలు
తెలియని పరిస్థితి ఉంది.
* పిల్లలకు చిన్నప్పటినుండి
పొదుపు మరియు మదుపు గురించి కర్రికులం లో
ఒక భాగంగా చేసి బోధించవలసిన అవసరం ఉంది. కానీ అలా జరగని నేడు దుస్థితి ఉంది.
*పిల్లలు పెరిగి పెద్దవారై
40 లేదా 45 కల్లా
Financial freedom పొందగలిగితే ఆ తరువాత వారి
శక్తి యుక్తులను మానవజాతి ఎదుర్కొనే నిజమైన సమస్యల మీద
దృష్టి కేంద్రీకరించి ముందుకు పొగలుగుతారు.
* జీవితమంతా
కనీస మనుగడ కోసం కావలసిన డబ్బు కోసం
కష్టపడాల్సిన దౌర్భాగ్యం
నేడు అందరికి ఉంది.
ఆ పరిస్థితి లేకుండా పోవాలి.
*ఆ పరిస్థితి పోవాలంటే
60 కి చాలా ముందే
ప్లాన్ వేసుకుని
ముందుకు పోవాలి.
* జీవనానికి అవసరమయిన
నాలుగు డబ్బుల సంపాదన కోసం
జీవితాంతం కష్టపడాల్సిన దుస్థితి
పూర్తిగా పోవాలి.
*ప్రభుత్వాలు విదిల్చే
ప్రజాకర్షక పథకాల ఎంగిలి మెతుకులపై
ఆధారపడని సమాజం రావాలి
*పై పుస్తకం లో ఈ జ్ఞానామృతం ఉంది.
* బొందిలో ప్రాణం వుండగానే
ఆర్థికంగా మోక్షాన్ని
ఇచ్చే గొప్ప పుస్తకము అది.
* ఒకసారి చదవండి.చదివితే వచ్చే నష్టమయితేలేదు. ఇందులోని హితవు మీకు నచ్చక పోతే పుస్తకం చదివిన అమూల్య అనుభవం మిగులుతుంది. ఒక పుస్తకం పూర్తిగా చదవక ఎన్నాళ్ళయిందో గుర్తుకు తెచ్చుకోండి.