నేటి నుంచి ఆగస్టు 15 వరకు ఢిల్లీ ఎర్రకోటలో ప్రవేశాలు నిలిపివేశారు స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు ముగిసేవరకు ప్రవేశాలు నిలిపివేస్తున్నట్టు ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా (ASI) ఒక ప్రకటనలో పేర్కొంది.
సెకండ్ వేవ్ కోవిడ్ కారణంగా ఢిల్లీలో ని పురాతన కట్టడాలకు సందర్శనను రెన్నెళ్ల పాటు నిలిపివేసి జూన్ 16 పున: ప్రారంభించారు. రెడ్ ఫోర్ట్ కు దాదాపు అయిదు నెలలుగా సందర్శకులు రావడమే లేదు. కోవిడ్ తగ్గు ముఖం పట్టగానే బర్డ్ ఫ్లూ వార్తలు వెలువడ్డాక జనవరి 19 నుంచి సందర్శకుల బంద్ చేశారు. తర్వాత కేంద్రం తెచ్చిన రైతు చట్టాలకు వ్యతిరేకంగా రైతుల ట్రాక్టర్ ర్యాలీ సందర్బంగా హింసాత్మకసంఘటనలుచోటు చేసుకోవడంతో మూసివేతను పొడిగించారు. తర్వాత కోవిడ్ సెకండ్ వేవ్ అంటూ మళ్లీ ఈ మాన్యుమెంటు ను మూసేశారు.జూన్ 16న తెరిచారు.
ఇపుడు స్వాతంత్య్రవేడుకల సందర్భంగా చేస్తున్న భద్రతా ఏర్పాట్లు కోసం రెడ్ ఫోర్టను మూసేస్తున్నారు.
రెడ్ ఫోర్ట్ ను మొగలు చక్రవర్తి షాజహాన్ నిర్మించారు.దీనినిర్మాణం 1638మే 12న మొదలయింది. ఆగ్రా నుంచి రాజధానిని ఢిల్లీకి మార్చాలనే ఉద్దేశంతో ఆయన ఎర్ర కోటనిర్మాణానికి పూనుకున్నారు. తాజ్ మహల్ ను డిజైన్ చేసిన వాస్తు శిల్పి ఉస్తాద్ అహ్మద్ లాహోరీయే ఎర్రకోటను కూడా డిజైన్ చేశారు