తెలంగాణ గ్రామంలో లోకల్ లాక్డౌన్

తెలంగాణ జగిత్యాల జిల్లా వెల్గటూర్ మండలం ఎండపల్లిలో 2 రోజుల క్రితం కరోనాతో ఒకరు మృతి చెందడంతో పాటు, కేసుల సంఖ్య 12 కు పెరిగింది.

దీంతో గ్రామ పెద్దలు అప్రమత్తం అయ్యారు. జూలై 19 వ తేదీ నుంచి ఆగస్ట్ 1 వ తేదీ వరకు 10 రోజులపాటు లాక్డౌన్ విధిస్తూ ఎండపల్లి గ్రామపంచాయతీ తీర్మానం చేసింది.

ఉ. 7 గం. ల నుంచి 9 గం. ల వరకు మాత్రమే దుకాణాలు తెరిచి ఉంచాలనీ, తర్వాత మూసేయాలంటూ తీర్మానంలో పేర్కొన్నారు.

నిబంధనలు ఉల్లంఘించిన దుకాణ యజమానులకు ₹ 5 వేల వరకు జరిమాన విధిస్తామని తెలిపారు. అలాగే గుంపులుగా తిరిగినా, మాస్క్ ధరించకపోయినా ₹ 1000 జరిమానా విధించాలని నిర్ణయించారు.

సామాజిక దూరం పాటించాలనీ,బ్ గుంపులుగా తిరగొద్దనీ, మాస్క్ ధరించాలంటూ అవగాహన కల్పించేలా గ్రామంలో వాల్ పోస్టర్లను సైతం అతికించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *