(సలీమ్ బాషా)
*ఒలింపిక్ గేమ్స్ లో ఒలింపిక్ విల్లేజ్ నిర్మించడం అనే సంప్రదాయం 1932 లాస్ ఎంజిలీస్ ఒలింపిక్స్ తో మొదలయింది. అపుడు అక్కడి బాల్ డ్విన్ హిల్స్ లో ఈ గ్రామం నిర్మించారు. కేవలం పురుష క్రీడాకారులకు మాత్రమే ఇందులో వసతి కల్పించారు. మహిళా క్రీడాకారులను మరొకచోట హాస్టల్లో ఉంచారు. ఒలింపిక్ గ్రామ నిర్మాణ అప్పటి నుంచి ప్రతిసారి జరుగుతూ ఉంది.
* మొట్టమొదటి ఒలింపిక్ క్రీడలు క్రీస్తుపూర్వం 776 లో గ్రీసు దేశం లోని ” ఒలింపియా” నగరంలో జరిగాయి. అప్పటి నుండి 4వ శతాబ్దం వరకు వరకు ఆ క్రీడలు కొనసాగాయి. తర్వాత 1894 లో ఫ్రెంచి దేశపు విద్యావేత్త, చరిత్రకారుడైన బారన్ పియరి డి కూబర్టిన్ అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ ప్రతిష్ట పించాడు. ఈయనను ఆధునిక ఒలింపిక్స్ పితామహుడు (father of Modern Olympics) అని చెప్పుకుంటారు. దాని తర్వాత 1896 లో ఏథెన్స్ నగరంలో మొట్టమొదటి ఆధునిక ఒలింపిక్ క్రీడలు జరిగాయి.
* 1860 ఏథెన్స్ లో జరిగిన మొదటి ఆధునిక క్రీడల్లో ఒలింపిక్ క్రీడల్లొ మొదటి స్థానం లో వచ్చిన వారికి రజత పతకం, రెండో స్థానం లో వచ్చిన వారికి రాగి లేదా క్యాంస పతకం ఇచ్చారు.
*1900 ప్యారిస్ ఒలింపిక్స్ లో గెల్చిన వారికి పతకాలు ఇవ్వలేదు.కేవలం కప్ లు ట్రోఫీలు మాత్రమే ఇచ్చారు. కొంత మందికి డబ్బులు కూడా ఇచ్చారు.
*మొట్ట మొదటిసారి 1904 లో ఉత్తర అమెరికాలోని సెయింట్ లూయిస్ లో జరిగిన ఒలింపిక్స్ లో మొదటి మూడు స్థానాల్లో వచ్చిన క్రీడాకారులకు బంగారు, రజతం, కాంస్యం పతకాలు ఇవ్వడం ప్రారంభించారు.
* మొదటి ఒలింపిక్ ఛాంపియన్, కొరోబస్ (గ్రీక్ దేశం ఎలిస్ నుండి ఒక వంటవాడు). అప్పుడు జరిగిన ఒకే ఒక ఈవెంట్ “పరుగు పందెంలో” నగ్నంగా పరిగెత్తి అతను పతాకం గెలుచుకున్నాడు.
* మొట్టమొదటి ఆధునిక ఒలింపిక్ క్రీడల యొక్క మొట్టమొదటి ఈవెంట్ 100 మీటర్ల రేస్, ఇది 6 ఏప్రిల్ 1896 న జరిగింది.
* ఒలింపిక్ చరిత్రలో మొట్టమొదటిసారి (ఒకే ఒక్కసారి) ఒక క్రీడ రెండు దేశాల్లో జరగడం విశేషం. 1920 బెల్జియం ఒలింపిక్స్ లో ఇది జరిగింది. 12 అడుగుల డింగీ సెయిలింగ్ క్రీడలో అన్ని రేసులు బెల్జియం లోనే జరిగాయి. అయితే ఫైనల్స్ 2 రేసులు మాత్రం నెదర్లాండ్స్ లో జరిగాయి. దానికి కారణం ఫైనల్స్ లో పోటీపడుతున్న ఇద్దరు క్రీడాకారులు నెదర్లాండ్స్ దేశానికి చెందిన వారే కావడం!
*1936 బెర్లిన్ ఒలింపిక్స్ కు చాలా ప్రత్యేకతలున్నాయి. అందులో ఒకటి గేమ్స్ టివి ప్రసారాలు. బెర్లిన్ వాసులు ఉచితంగా గేమ్స్ ని వీక్షించేందుకు గ్రేటర్ బెర్లిన్ ప్రాంతంలో 25 టీవి రూమ్ లను ఏర్పాటు చేశారు.