ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రమణ ‘బెయిల్’ నిర్ణయానికి మద్దతు

(లంకిశెట్టి బాలాజీ)

★బెయిల్ పొందిన తర్వాత జైల్లో ఉన్న ఖైదీలు ను తక్షణమే విడుదల చేయడానికి న్యాయస్థానం నుండి నేరుగా బెయిల్ విడుదల ఉత్తర్వులు జైలుకు పంపాలి అనే సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ నూతి వెంకటరమణ ప్రతిపాదనను  మచిలీపట్నం బార్ అసోసియేషన్ స్వాగతిస్తున్నది.

★ బ్రిటిష్ కాలం నుండి అమలు చేస్తూ వస్తున్న ఖైదీల విడుదల విధానానికి ఇది ముగింపు. నూతన ప్రక్రియకు శ్రీకారం చుడుతూ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వి రమణ ఒక కేసు విచారణలో  చేసిన ప్రతిపాదనతో చెరసాలలో ఉన్న ఖైదీలకు ఎంతో వెసులుబాటు కలిగిస్తోంది.

In this age of information and communication technology, we are still looking at the skies for pigeons to communicate order, అని జస్టిస్ రమణ ఒక కేసు విచారణ సందర్బంగా వ్యాఖ్యానించారు.
“prisoners are waiting for Supreme Court Orders to be sent by post. we had ordered release in some matters and they were not released since they did not receive an authentic copy of orders. this too much ,”అని రమణ వ్యవస్థ మీద అసంతృప్తి వ్యక్తం చేశారు.

ప్రస్తుత విధానం ప్రకారం బెయిల్ పొందిన తరువాత జామీన్ దారులను హాజరు పెట్టడం, న్యాయస్థానం విడుదల ఉత్తర్వులు కోర్టు ఉద్యోగి ద్వారా జైలుకు పంపడం, రాజమండ్రి వంటి సుదూర ప్రాంతాల్లో ఉన్న జైలుకు పోస్టులో పంపడం వలన కాలయాపన జరుగుతూ ఉంది. ఇక నుంచి ఇలాంటి కాలయాపన ఉండదు.

లంకిశెట్టి బాలాజీ

★న్యాయవ్యవస్థలో బ్రిటిష్ కాలం నాటి సివిల్, క్రిమినల్ విధివిధానాలను మార్చ వలసిన అవసరం ఎంతైనా ఉంది. పార్లమెంట్లో చర్చ జరిగి ఎంపీలు మార్చవలసిన చట్టాలు, మార్చక పోవడం వలన సాధారణ ప్రజలు బాధ పడుతున్నారు. “This Court is contemplating to adopt the procedure termed as FASTER (Fast and Secured Transmission of Electronic Record) System for transmission of e-authenticated copies of judgment/final orders/interim order to the concerned Courts/Tribunals and other duty holders of execution. This Court will make an endeavor to implement the said system at the earliest,”అని జస్టిస్ రమణ భరోసా ఇవ్వడం ఊరట కలిగించే విషయం.

★ సుప్రీం కోర్ట్ చీఫ్ జస్టిస్ నిర్ణయానికి అన్ని రాష్ట్రాల బార్ కౌన్సిల్లు హర్షం వ్యక్తం చేస్తున్నాయి.

★ఖైదీల హక్కుల పరిరక్షణ చట్టం ప్రకారం సత్వర న్యాయం చేయడానికి కొత్త ప్రతిపాదన ఎంతగానో దోహదపడుతుంది. అదే విధంగా సివిల్ కేసులలో సుదీర్ఘ కాలంగా పెండింగ్లో ఉన్న ఎగ్జిక్యూషన్ విధానాలలో కూడా మార్పు రావాల్సిన అవసరం ఎంతైనా ఉంది. కేసుల సత్వర పరిష్కారం కోసం మధ్యవర్తిత్వానికి పెద్ద పీట వేయడం ద్వారా సత్వర పరిష్కారానికి దోహదపడుతుంది. దీనిపై కూడా సుప్రీంకోర్టు ప్రతిపాదన త్వరలోనే కిందిస్థాయి కోర్టుల్లో ముందుకు వెళుతుందని ఆశిస్తున్నాను.

( లంకిశెట్టి బాలాజీ, మాజీ అధ్యక్షులు,మచిలీపట్నం బార్ అసోసియేషన్)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *