జూలై 23 నుంచి తెలంగాణ సినిమా హాళ్లు మొదలు

తెలంగాణలో సినిమా థియేట‌ర్లు వారం రోజుల్లో మళ్లీ తెర్చుకోనున్నాయి. ధియోటర్ల లో 100 శాతం కెపాసిటితో ప్రదర్శనలు ప్రారంభించేందుకు  ప్రభుత్వం అనుమతినిచ్చింది. ఈ విషయాన్ని సినిమాటోగ్రఫీ మంత్రి తలసాని శ్రీనివాసయాదవ్ వెల్లడించారు. అయితే,  ఈ నెల 23వ తేదీ నుంచి సినిమా థియేట‌ర్ల‌లో ప్రదర్శనలను  తెలంగాణ ఫిల్మ్ ఛాంబ‌ర్ నిర్ణ‌యించింది. ఈ మేర‌కు తెలంగాణ ఫిల్మ్ ఛాంబ‌ర్ నిర్ణయం తీసుకుంది.  చేంబర్  ప్రెసిడెంట్ ముర‌ళీమోహ‌న్, సెక్ర‌ట‌రీ సునీల్ నారంగ్  ఎగ్జిబిట‌ర్ల‌తో అత్య‌వ‌స‌ర స‌మావేశం ఏర్పాటు చేసి  థియేట‌ర్ల పున:ప్రారంభించాలని నిర్ణయించారు. ధియోటర్లు మూసివేయడం వల్ల  సినిమా థియేట‌ర్ల‌లో ప‌ని చేసే సిబ్బందిరి జీతాలు లేక ఆర్థికంగా కుంగిపున్నారని, ఈ విషయాన్నికూడా పరిగణనలోకి తీసుకుని సినిమా ధియోటర్లు ప్రారంభించాలని నిర్ణయించినట్లు వారు తెలిపారు.

కరోనా వాప్తి చెందుతున్న నేపథ్యంలో నైట్ కర్ఫ్యూ విధించడంతో  ఏప్రిల్ 20 నుంచి రాత్రిషోలు మొదట బంద్ చేశారు. ఇది పదిరోజులు పాటు కొనసాగింది. కర్ఫ్యూ రిలాక్స్ చేసినపుడు షోలకు కోవిడ్ నియమాలతో అనుమతినిచ్చారు.అయితే ఎగ్జిబిటర్లు స్వచ్ఛందంగా సినిమా హాళ్లను ఏప్రిల్ 30 దాకా మూసేందుకు నిర్ణయించారు.   జూన్ 20న లాక్ డౌన్ ఎత్తేసినా సినిమా ధియేటర్లను మాత్రం అనుమతించలేదు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *