ఈ ఏడాది సెప్టెంబర్ 10 నుంచి గణేష్ ఉత్సవాలు ప్రారంభవుతున్నాయి. సెప్టెంబర్ 19 ఆదివారం గణేశ్ నిమజ్జన ఉంటుంది. ఈ విషయాన్ని భాగ్యనగర్ గణేష్ ఉత్సవ్ సమితి జనరల్ సెక్రెటరీ భగవంత్ రావు ప్రకటించారు.
గణేష్ ఉత్సవాలు చాలా జాగ్రత్తలు తీసుకొని నిర్వహిస్తామని వాటిని పర్యవేక్షించేందుకు ఈ నెల 23 వ తేదీన భాగ్యనగర్ గణేష్ ఉత్సవ్ సమితి ఆఫీస్ ప్రారంభిస్తామని ఆయన చెప్పారు.
ఉత్సవాలు ప్రారంభమయ్యేనాటికి జిహెచ్ ఎం సి వారు, నగరంలో రోడ్లు బాగుచేయలని నిమిజ్జనమ్ సమయానికి రోడ్ల మరమ్మతులు పూర్తయ్యేలా చూడాలని ఆయన ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు.
ఇదే విధంగా విగ్రహాల తయారీకి అవసరమయిన రా మెటీరియల్ సకాలంలో ఇవ్వాలని చెబుతూ త్రాగు నీరు కూడ బాగా ఉండే లా చూడాలని ఆయన కోరారు.
ఉత్సవాల సందర్భంగా విద్యుత్తు వాడకం ఎక్కువ ఉంటంది కాబట్టి విద్యుత్ సరఫరా నిరంతరాయంగా కొనసాగేలా చూడాలని ఆయన ప్రభుత్వాన్ని కోరారు.
ప్రజలకు సంబంధించి గణేష్ విగ్రహం ఎత్తు కోసం పోటీ పడకుండా, ఉండాలని, కరోనా గైడ్ లెన్స్ అనుసరించి ఏర్పాట్లుచేయాలని ఆయన కోరారుు.