పొద్దున నిద్రలేచింది మొదలు పడుకునే వరకు వాట్సాప్ చూడకుండా ఎవరూ ఉండలేరు. వాట్సాప్ లేని జీవితం వూహించడం కష్టం. అలాగే వాట్సాప్ వైపు చూడకుండా ఒక పూట కాదు గదా, ఒక గంట గడపడం కష్టం. పనికొచ్చే మేసేజీలు రాకపోయినా, రావని తెలిసినా, పంపేవారెవరూ లేకపోయినా, మొబైల్ చేతిలో ఉన్నంతవరకు తప్పనిసరిగా పదినిమిషాల కొకసారి ఒపెన్ చేసి చూసేలాగా మనుషులందరిని ఈ యాప్ బానిసల్ని చేసింది. మనిషి జీవితంలో నుంచి విరామమనేది లేకుండా చేసిన ఒక సాంకేతిక అద్భుతం వాట్సాప్.
టెక్ట్స్ మేసెజేస్ పంపించేందుకు, వాయిస్ కాల్సకోసం, ఫోటోలు డాక్యమెంట్లను షేర్ చేసేందుకు వాడే వాట్సాప్ 2009 లో మొదలయింది. 2014 దీనిని ఫేస్ బుక్ కొనుగోలు చేసింది. 2018లో వాట్సాప్ నుంచి వాట్సాప్ బిజినెస్ అనే ప్రత్యేక యాప్ మొదయింది.ఇపుడు ప్రపంచాన్ని జయిస్తున్న యాప్ లోఇదొకటి. ఈ వాట్సాప్ గురించి నమ్మలేని నిజాలివి.
1.ప్రపంచంలో మొత్తంగా 2బిలియన్ల మంది వాట్సాప్ యూజర్లున్నారు. 2018లో ఈ సంఖ్య 1.5 బిలియన్లు. 2016లో 1 బిలియన్ మాత్రమే. అంటే ప్రతి రెండేళ్లకు అర బిలియన్ యూజర్లు వాట్సాప్ పరిధిలోకి వస్తున్నారు. ఇది మెల్లిగా ఫేస్ బుక్ దరిదాపుల్లోకి వస్తూ ఉంది.ఫేస్ బుక్ లో 2.45 బలియన్ల మంత్లీ యూజర్లున్నారు.
2.ఏప్రిల్ 2021 నాటికి 13 మిలియన్ల సార్లు వాట్సాప్ ను డౌన్ లోడ్ చేసుకున్నారు. ఇది అంతకు ముందటి నెలకంటే 18.2 శాతం ఎక్కువ. నాన్ గేమ్ యాప్స్ లో ఇది నాలుగవది. మిగతావి: టిక్ టాక్, ఫేజ్ బుక్, ఇస్టాగ్రామ్.
3.ప్రపంచం మొత్తంగా వాట్సాప్ 180 మంది దేశాల్లో అందుబాటులో ఉంది. 60 భాషల్లో సందేశాలు పంపవచ్చు. వాట్సాప్ యూరోప్ లో బాగా చొచ్చుకుపోయి ఉంది. ముఖ్యంగా నెదర్లాండ్స్ జనాభాలో 85 శాతం ప్రజల వాట్సాప్ యూజర్లున్నారు. తర్వాత స్పెయిన్ (83.1 శాతం), ఇటలీ (83 శాతం). అయితే, వాట్సాప్ లేని దేశం చైనా. ఇక క్యూబా, సిరియా, ఇరాన్, యుఎఇ, నార్త్ కొరియా, ఖతార్ లలో పాక్షికంగా, పూర్తిగా వాట్సాప్ మీద నిషేధం ఉంది. ఈ దేశాలలో వాట్సప్ టెక్స్ట్ మేసేజెస్ పంపవచ్చే. వాట్సాప్ కాల్ (VOIP)అందుబాటులో లేదు.
4.వాట్సాప్ కు ప్రపంచంలో పెద్ద మార్కెట్ భారతదేశమే.వాట్సాప్ యూజర్లో 340 మిలియన్లు మంది భారతీయులున్నారు. 2020లో వాట్సాప్ డౌన్ లోడ్ చేసుకున్న మొత్తం యూజర్లలో 49 శాతం భారతీయులే ఉన్నారు. తర్వాతి స్థానం 99 మిలియన్ యూజర్లతో బ్రెజిల్ ది. వాట్సాప్ పుట్టింది క్యాలిఫోర్నియాలోనే నైనా అమెరికాలో వాట్సాప్ అంత పాపులర్ కాదు. అక్కడ కేవలం 68 మిలియన్ల వాట్సాప్ యూజర్లే ఉన్నారు.
5.వాట్సాప్ గుండా ప్రతి రోజు 100బిలియన్ మెసేజెస్ ను పంపిస్తున్నారు. 2016లో ఇది 60 బిలియన్లు మాత్రమే. వాట్సాప్ లో గుంటకు 4.2 బిలియన్ల మెసెజీలు, నిమిషానికి 69మిలియన్ల మేసేజీలు, సెకన్ కి పదకొండు లక్షల మెసేసీలు అటూ ఇటూ ప్రసారమవుతాయి.
6.అమెరికాలో ఉన్న వాట్సాప్ యూజర్లలో 53 శాతం మంది ప్రతి రోజూ ఏదో ఒక సారి ఈయాప్ ను వాడి తీరతారు.
7.అమెరికాలోని పెద్దవారిలో ప్రతి ఐదుగరిలో ఒకరు వాట్సాప్ యూజరే.
8.వాట్సాప్ బిజినెస్ ను 5 మిలియన్ బిజినెస్ ల కంటే ఎక్కువగా వాడుతున్నాయి.
9.అర బిలియన్ వాట్సాప్ యూజర్లు వాట్సాప్ స్టేటస్ ను ఒక సారయినా వాడుతారు. వాట్సాప్ యూజర్లలో ఎక్కువ మంది కుర్రకారే. 18-24 సంవత్సరాల మధ్య వయసు అమెరికన్లే ఎక్కువగా వాట్సాప్ ను వాడతారు. వాట్సాప్ యూజర్లలో 44 శాతం ఈ వయోబృందం వారే.
10.అమెరికాలో వాట్సాప్ ని యూజర్లు ప్రధానంగా తమ కుంటుంబంతో, స్నేహితులతో నిత్యం సంబంధంలో ఉండేందుకు వాడుతుంటారు.