“ఏడేళ్ళుగా ఒక్క గ్రూప్ వన్ నోటిఫికేషన్ లేదు: ప్రత్యేక తెలంగాణ ఘనత”

డా. దాసోజు శ్రవణ్

”దేశంలోనే ధీర్గ క్యాబినెట్ మీటింగ్ అని ప్రచారం చేస్తున్న కేసీఆర్ సర్కార్.. క్యాబినెట్ మీటింగ్ పేరుతో అతి పెద్ద డ్రామాకు తెర తీశారని  ఏఐసీసీ అధికార ప్రతినిధి డా. దాసోజు శ్రవణ్ అంటున్నారు.. టీఆర్ఎస్ ప్రభుత్వం తాజా క్యాబినెట్ భేటి పై  దాసోజు   ఈ రోజు జరగిన విలేకరుల సమావేశంలో చేసిన వ్యాఖ్యలు

కరోనా కంటే పెద్ద సమస్య నిరుద్యోగం. కేసీఆర్ క్యాబినెట్ భేటిలో ఈ సమస్యకు పరిష్కారం చుపుతారేమో అని తెలంగాణ సమాజం ఆశలు పెట్టుకుంది. ఐతే అందరి ఆశలుపై నీళ్ళు చల్లుతూ నిరుద్యోగులు నోట్లో మన్నుకొట్టారు కేసీఆర్.

దుబ్బాక, జీహెచ్ ఎంసీ, ఎంఎల్సీ, సాగర్ , ఎన్నికల సమయాల్లో 50వేల ఉద్యోగాలు కలిపిస్తామని ప్రకటన చేశారు. కానీ ఇప్పటివరకూ ఒక్క ఉద్యోగం కూడా భర్తీ చేయలేదు. ఇప్పుడు హుజురాబాద్ ఎన్నికల సమీపించడంతో మరో యాబై వేల ఉద్యోగాలని మాట మాటలు చెప్తున్నారు కేసీఆర్.

ఏడేళ్ళలో ఒక్క గ్రూప్ వన్ నోటిఫికేషన్ లేదు. టీచర్లని భర్తీ చేయక విద్యని నాశనం చేశారు. డాక్టర్లు, నర్సులని భర్తీ చేయక వైద్యాన్ని నాశనం చేశారు. రాష్ట్రాన్ని మొత్తానికి బ్రష్టు పట్టించిన ఘనత కేసీఆర్ ది.

క్యాబినెట్ బేటీలో నిరుద్యోగ బృతి పై చర్చనే లేదు. 3016రూపాయిల నిరుద్యోగ బృతి ఇస్తామని చెప్పి ఇప్పటివరకూ ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదు. పిట్టల మాదిరి నిరుద్యోగులు ఆత్మహత్యలు చెసుకుంటున్నారు. కేసీఆర్ కి ఎందుకింత శాడిజం ? వాగ్దానం చేసి ఎందుకు అమలు చేయడం లేదు ? చేతకాపొతే దిగిపోవాలి. నిరుద్యోగులకు కాంగ్రెస్ పార్టీ న్యాయం చేస్తుంది.

బిశ్వాల్ కమిటీ నివేదిక ప్రకారం లక్షా తొంబై రెండు వేల ఉద్యోగ ఖాళీలు. లక్షా యాబై కాంట్రాక్ట్, అవుట్ సోర్సింగ్ ఉద్యోగాలు. కొత్తగా ఏర్పడి కొత్త జిల్లాలు, మండలాలు, పెరిగిన పరిపాలన యంత్రాంగం కారణంగా రెండులక్షల వరకూ కొత్త ఉద్యోగాలు కల్పించవచ్చు. దాదాపు ఐదు లక్షల ఉద్యోగాలు భర్తీలు జరగాలి. కానీ సోయి లేని కేసీఆర్ సర్కార్ నిరుద్యోగుల పాలిట శాపంగా మారి వారి జీవితాలతో చెలగాటం ఆడుతుంది.

15లక్షల ఉద్యోగాలు టీఎస్ ఐపాస్ ద్వారా ఇచ్చామని ప్రజల చెవులో పువ్వులు పెడుతున్నారు కేటీఆర్. వాస్తవం ఏమిటంటే.. టీఎస్ ఐపాస్ కమీషన్ ఇచ్చిన డాటా ప్రకారం కేవలం 6 లక్షల 99వేల తొమ్మిది వందల అరవై ఆరు ఉద్యోగాలు ఇచ్చినటు ఆధారాలతో సహా వుంది. అసలు కేటీఆర్ మొహం ఎక్కడ పెట్టుకుంటారు ? ఎందుకు అబద్దం ఆడుతున్నారు? దీనిపై బహిరంగ చర్చకు రావాలి.

స్వయం ఉపాధి కల్పనలో కూడా కేసీఆర్ ప్రభుత్వ వైఫల్యం. ఇంత దుర్మార్గమైన పాలన చరిత్ర లేదు. కేసీఆర్ క్యాబినెట్ లో బిసీ, ఎస్సీ కోటాలో వుండే మంత్రులు సిగ్గుపడాలి. బీసీ,ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలు బానిసలు గా కనిపిస్తున్నారా?

కొండని తవ్వి ఎలకని కూడా పట్టనట్టు కేసీఆర్ క్యాబినెట్ మీటింగ్ సాగింది. రాష్ట్రంలో కరోనా కంటే అతి పెద్ద సమస్య నిరుద్యోగం. కేసీఆర్ క్యాబినెట్ భేటిలో ఈ సమస్యకు పరిష్కారం చుపుతారేమో అని తెలంగాణ సమాజం ఆశలు పెట్టుకుంది. ఐతే అందరి ఆశలుపై నీళ్ళు చల్లుతూ నిరుద్యోగులు నోట్లో మన్నుకొట్టారు కేసీఆర్. నిరుద్యోగ నిర్మూలనకు ఓ మార్గం చూపాలనే చిత్త శుద్ధి కేసీఆర్ లో కనిపించలేదు. 40 లక్షల మంది నిరుద్యోగుల జీవితాలతో చెలగాటం ఆడుతున్న కేసీఆర్ సిగ్గుతో తలదించుకోవాలి.

ఎన్నికలు జరిగిన ప్రతిసారి ఉద్యోగ ప్రకటన ఇచ్చారు కేసీఆర్. దుబ్బాక, జీహెచ్ ఎంసీ, ఎంఎల్సీ, సాగర్ , ఎన్నికల సమయాల్లో 50వేల ఉద్యోగాలు కలిపిస్తామని ప్రకటన చేశారు. ఇప్పుడు హుజురాబాద్ ఎన్నికల సమీపించడంతో మరో యాబై వేల ఉద్యోగాలని ప్రకటన చేశారు. కేసీఆర్ ప్రకటన ప్రకారం రెండు లక్షల ఉద్యోగాలు భర్తీ కావాలి. కానీ ఇప్పటివరకూ ఒక్క ఉద్యోగం కూడా భర్తీ చేయలేదు. నిరుద్యోగుల జీవితాలతో చెలగాటం ఆడుతున్నారు.

ఏడేళ్ళుగా ఒక్క గ్రూప్ వన్ నోటిఫికేషన్ కూడా విడుదల చేయలేదు. కొన్ని వేలమందికి వ అయోపరిమి దాటిపొయింటుంది. గ్రూప్ వన్ ఆఫీసర్ గా రాష్ట్రానికి పని చేయాలని భావించిన అనేకమంది యువత నోట్లో మన్నుకొట్టారు కేసీఆర్. అసలు ఈ విషయంలో కేసీఆర్ కి సోయి ఉందా ? డిఎస్సీ , డిస్త్రిక్ సర్విస్ కమీషన్ లేదు. ప్రభుత్వ బదులు మూసేస్తారు మరో పక్కన ప్రైవేట్ స్కూల్స్ కి దోచుకునే అవకాశం కలిస్తారు. విద్యని నాశనం చేశారు. డాక్టర్లు, నర్సులని భర్తీ చేయక వైద్యం ని నాశనం చేశారు. మొత్తం రాష్ట్రాన్ని భ్రస్టు పట్టించిన ఘనత కేసీఆర్ ది.

క్యాబినెట్ లో అసలు ఏం నిర్ణయాలు తీసుకున్నారు ? నిరుద్యోగ బృతి ఎక్కడ ? పది లక్షల మంది పేర్లు నమోదు చేసుకున్నారు. టీఎస్పిఎస్సి లో ఉద్యోగాల కోసం దాదాపు ముఫ్ఫై లక్షల మంది నమోదు చేసుకున్నారు. తెలంగాణలో దాదాపు నలఫై లక్షల మంది నిరుద్యోగాలు వున్నారు. 3016రూపాయిల నిరుద్యోగ బృతి ఇస్తామని చెప్పి ఇప్పటివరకూ ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదు. పిట్టల మాదిరి నిరుద్యోగులు ఆత్మహత్యలు చెసుకుంటున్నారు. కేసీఆర్ కి ఎందుకింత శాడిజం ? వాగ్దానం చేసి ఎందుకు అమలు చేయడం లేదు ? అడిగితే డబ్బులు లేవని అంటున్నారు. కాళేశ్వరం కు డబ్బులు వుంటాయి. ఆంధ్ర కాంట్రాక్టర్ లకు ప్రాజెక్ట్లు ఇచ్చి దాని ద్వారా కమీషన్ దోచుకోవడానికి డబ్బులు వుంటాయి. కానీ నిరుద్యోగ బృతికి మాత్రం డబ్బులుండవ్. క్యాబినేట్ లో నిరుద్యోగ బృతిపై చర్చ కూడా లేదు. నిరుద్యోగులు, విశ్వవిద్యాలయాల విద్యార్ధులు, ప్రజలు కేసీఆర్ ని కాలర్ పట్టుకొని నిరుద్యోగ బృతి ఎక్కడ అని నిలదీయాలి. అప్లీకేషన్ పెట్టుకున్న పది లక్షమందికి బృతి ఇవ్వాలంటే 3వేల ఆరు వందల కోట్ల రూపాయిలు కావాలి. అది కూడా ఇవ్వలేని దయనీయ స్థితిలో ఉందా కేసీఆర్ సర్కార్ ? కేసీఆర్ సర్కార్ కి చేతకాకపోతే దిగిపోవాలి. కాంగ్రెస్ పార్టీ నిరుద్యోగులకు అండగా వుంటుంది. కేవలం ఎన్నికల సమయంలో ఓటుకు బీరు బిర్యాని నోట్లు చల్లి ఓట్లు కోనేయాలనే క్షుద్ర రాజకీయం చేస్తున్న కేసీఆర్ సర్కార్ తీరుని కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా ఖడిస్తున్నది.

ఏడేళ్ళు దాటింది. అసలు ఉద్యోగ ఖాళీలు ఎన్ని ? టీఆర్ఎస్ సర్కార్ కి ఒక ఎంప్లాయిమెంట్ పాలసీ ఉందా ? ప్రభుత్వ రంగంలో ఉద్యోగ కల్పన, భర్తీ ఎలా చేయాలనే అంశం పై పాలసీఏలు. ప్రైవేట్ రంగంలో తెలంగాణ ప్రజలకు న్యాయం జరిగేల స్థానిక రిజర్వేషన్ ఎలా కల్పించాలనే దానిపై ఒక విధానం లేదు. స్కిల్ డెవలప్ మెంట్ లేదు. సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేసే పాలసీ కూడా లేదు. అసలు కేసీఆర్ సర్కార్ కి ఎలాంటి పాలసీ లేదు. కాళేశ్వరం పేరుతో కమీషన్ లో దోచుకునే పాలసీ మాత్రమే కేసీఆర్ సర్కార్ కి వుంది. ఎన్నికల వస్తే ప్రజలని బానిసలు మాదిరిగా చూసి డబ్బులు చల్లి ఓట్లు గుంజుకునే విధానం మాత్రమే వుంది.

‘బిశ్వాల్ కమిటీ నివేదిక ప్రకారం లక్షా తొంబై రెండు వేల ఉద్యోగ ఖాళీలు వున్నాయి. లక్షా యాబై కాంట్రాక్ట్, అవుట్ సోర్సింగ్ ఉద్యోగాలు. కొత్తగా ఏర్పడి కొత్త జిల్లాలు, మండలాలు, పెరిగిన పరిపాలన యంత్రాంగం కారణంగా రెండులక్షల వరకూ కొత్త ఉద్యోగాలు కల్పించవచ్చు. ఈ రకంగా చూసుకుంటే దాదాపు ఐదు లక్షల ఉద్యోగాలు భర్తీలు జరగాలి. కానీ సోయి లేని కేసీఆర్ సర్కార్ నిరుద్యోగుల పాలిట శాపంగా మారి వారి జీవితాలతో చెలగాటం ఆడుతుంది. విభజన చట్టం ప్రకారం.. 2014నాటికే 4లక్షల 91వేల ఉద్యోగాలు వుండాలి. అలా చూసుకుంటే ప్రతి వెయ్యి మందికి 14మంది ఉద్యోగస్తులు వున్నట్లు. కానీ ఇవాళ 61% మాత్రమే ఉద్యోగస్తులు వున్నారు.. మిగతా 39% ఉద్యోగాలు ఖాళీ వున్నాయి. అంటే ప్రతి వెయ్యి మందికి కేవలం ఎనిమిది మందే ఉద్యోగస్తులు వున్నారు. దీంతో ఉద్యోగాలపై పనిభారం పెరుగుతుంది. వారు శ్రమ దోపిడీకి గురౌతున్నారు కేసీఆర్ సర్కార్ కేవలం దుష్ట రాజకీయాలపైనే ద్రుష్టి పెట్టి పాలనని యంత్రంగాన్ని భ్రస్టుపట్టించారు.

”ముఫ్ఫై ఆరు నెలల్లో జిల్లాల, జోనల్ వారిగా డిపార్ట్మెంట్ ఖాళీలు, జోనల్ రియాలికేషన్స్ పూర్తి చేయాలనీ 2018, 124 జీవో లో స్పష్టంగా చెప్పారు. గడువు ముగిసింది. మూడేళ్ళు దాటిపోయింది. నిరుద్యోగుల కష్టాలు కేసీఆర్ కి కనిపించడం లేదా ? ఉద్యోగాలు లేక యువత ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. కేసీఆర్ కి మానవత్వం లేదా ? దీనికి ఏం సమాధానం చెప్తారు. మార్చి 24 2021 చీఫ్ సెక్రటరీ మరో లేఖ విడుదల చేశారు. మళ్ళీ రియాలికేషన్ వివరాలు ఇవ్వమని కోరారు. మంత్రి హరీష్ కూడా మళ్ళీ వివరాలు కొత్తగా అడుగుతున్నారు. మూడేళ్ళు క్రితం తెచ్చిన జీవోని చెత్తకుండీ పారేసి మళ్ళీ డ్రామా మొదలుపెడతారా? ఇంత నిర్లక్ష్యంగా వుండే హక్కు కేసీఆర్ సర్కార్ కి ఎవరిచ్చారు.

విశ్వ విద్యాలయాల్లో ఛాన్స్ లర్, అధ్యాపకులని నియమించరు. అధ్యాపకులు లేని విద్యాలయలకు వెళ్లి కేసీఆర్ పిలల్లు చదువుకుంటరా? జ్ఞానానికి కేంద్రాలైన విశ్వ విధ్యాలయాలని కూడా కేసీఆర్ నేడు నిరుద్యోగ కేంద్రాలుగా మార్చేశారు. ఏ విశ్వ విద్యాలయ పోరాటంతో వచ్చిన తెలంగాణలో నేడు కేసీఆర్ అధికారం వెలగబెడుతున్నారో .. ఆ విశ్వ విద్యాలయాలని చులకన చేస్తున్నారు.

ఒక్క ఆరోగ్య శాఖలోనే 23512ఉద్యోగాలు ఖాళీగా వున్నాయని బిస్వాల్ కమిటీ చెప్పింది. కానీ యాబై వేల ఉద్యోగాలు నింపుతామని కేసీఆర్ గొప్పలు చెప్పారు. కానీ ఇప్పటివరకూ పట్టుమని పది ఖాళీలు నింపలేదు. అసలు ఈ ఉద్యోగాలు ఎప్పుడు భర్తీ చేస్తారో కేసీఆర్ చెప్పాలి. కరోనా కాలంలో డాక్టర్లు, నర్సులు లేక ఎంతమంది ప్రాణాలు కోల్పోయారో చూశాం. ఇప్పుడు థర్డ్ వేవ్ వస్తుందని సూచనలు అందుతున్నాయి. మెడికల్ ఖాళీలు ఎప్పుడు భర్తీ చేస్తారో కేసీఆర్ చెప్పాలి.

ప్రైవేట్ ఉద్యోగాలపై కేసీఆర్ సర్కార్ నిస్సుగ్గా అబద్దాలాడుతుంది. 15లక్షల ఉద్యోగాలు టీఎస్ ఐపాస్ ద్వారా ఇచ్చామని ప్రజల చెవులో పువ్వులు పెడుతున్నారు కేటీఆర్. వాస్తవం ఏమిటంటే.. టీఎస్ ఐపాస్ కమీషన్ ఇచ్చిన డాటా ప్రకారం కేవలం 6 లక్షల 99వేల తొమ్మిది వందల అరవై ఆరు ఉద్యోగాలు ఇచ్చినటు ఆధారాలతో సహా వుంది. అసలు కేటీఆర్ మొహం ఎక్కడ పెట్టుకుంటారు ? ఎందుకు అబద్దం ఆడుతున్నారు? దీనిపై బహిరంగ చర్చకు రావాలి. ఇందులో కూడా తెలంగాణ యువతకి రావాల్సిన స్థానిక రిజర్వేషన్ లో కూడా అన్యాయం జరుగుతుంది. స్థానిక రిజర్వేషన్ కోసమే తెలంగాణ ఉద్యమం జరిగింది. ప్రైవేట్ ఉద్యోగాలలో కూడా సస్థానిక రిజర్వేషన్ కోసం కేసీఆర్ సర్కార్ ఎందుకు పట్టుపట్టడం లేదు.

 

ఎస్సీ కార్పోరేషన్ వివరాలు తీసుకుంటే ..9 లక్షల 15వేల 553మంది దళిత బిడ్డలు లోన్స్ కి అప్లయ్ చేస్తే పది శాతం మందికే లోన్స్ ఇచ్చారు. ఎస్సీలు ఏం పాపం చేశారు? సబ్ ప్లాన్ కింద 50వేల కోట్ల రూపాయిలు ఖర్చు పెడతామన్న ముఖ్యమంత్రి ఈ ఏడేళ్ళలో 70వేల కోట్ల రూపాయిలు ఖర్చు పెట్టుండాలి. కానీ నిధులు కేటాయించ కుండ, కేటాయించిన నిధులు ఖర్చు చేయకుండా దళితులకు ద్రోహం చేస్తున్నారు. ఇదెక్కడి న్యాయం ?

ఎంబీసీ కార్పోరేషన్ విషయానికి వస్తే ప్రతి ఏడాది వెయ్యి కోట్లు ఇస్తామని చెప్పారు. ఏడేళ్ళలో ఏడు వేల కోట్లు ఖర్చు చేయాలి. 2014నుంచి 16వరకు ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదు. 2017- 2018లో 9వందల 21కోట్లు, 18, 19లో వెయ్యి కోట్లు, 19, 20లో ఐదు కోట్లు , 20, 21లో 500వందల కోట్లు మొత్తంమీద 3వందల 50కోట్లు మంజూరు చేస్తే ,ఖర్చు చేసింది కేవలం 7కోట్ల 10లక్షల రూపాయిలు. అసలు కేసీఆర్ సర్కార్ కి సిగ్గు ఉందా? బీసీ,ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలు బానిసలు గా కనిపిస్తున్నారా? గొర్రెలు, బర్రెలు, మంగళి కత్తులు కాదు.. మాకు ఉద్యోగం కావాలి. మీ జేబు నుంచి కాదు మేము కడుతున్న ట్యాక్స్ నుంచి ఇటున్నపుడు కేసీఆర్ కి ఏం నొప్పి ?బీసీ,ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలు వర్గ ప్రజల నోట్లో మన్ను కొడుతున్న కేసీఆర్ సర్కార్ లో కడుపునిండుతున్నది కేవలం కల్వకుంట్ల కుటుంబానికి టీఆర్ఎస్ పెద్దలకు మాత్రమే.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *