( సలీమ్ బాషా)
సాధారణంగా క్రీడాకారులు వ్యక్తిగత మరియు జాతీయ కీర్తి రెండింటినీ పణంగా పెట్టినప్పుడు ఇలాంటి పోటీల్లో ఎప్పుడూ తామే గెలవాలని అనుకుంటారు, ముఖ్యంగా ఒలింపిక్స్ లో. అయితే 1988 లో, కెనడియన్ సైలర్ లారన్స్ లెమియక్స్ తను కలలు కన్న ఒలింపిక్ బంగారు పతకం ఆశలను పక్కన పెట్టి ఒక అనూహ్యమయిన పనికి పూనుకున్నాడు.
1988 దక్షిణ కొరియాలోని బూసాన్ లో ఒలింపిక్స్ జరుగుతున్నాయి. సెప్టెంబర్ 24న సెయిలింగ్ కాంపిటీషన్ జరుగుతూ ఉంది. పోటీ మధ్యలో గాలి ఉన్నట్లుండి ఉధృతంగా మారింది. అపుడు సింగపూర్ టీమ్ కు చెందిన పడవ బోల్తాపడింది. అందులో జోసెఫ్, స్యూ షా హెర్ అనే ఇద్దరు సెయిలర్లు ఉన్నారు.బోటు బోల్తాపడటంతో వారిద్దరికి గాయాలయ్యాయి.వాళ్లకి తక్షణ సాయం అవసరం. అపుడు లారెన్స్, ఫిన్ క్లాస్ రేసుల్లో అయిదో రేసుల్లో ఉన్నారు. మెడల్ కు దగ్గిరగా రెండో స్థానంలో ఉన్నాడు. అలాంటపుడు లారెన్స్ కు ఈ పడవ ప్రమాదం కనిపించింది. లారెన్స్ అరవడానికి ప్రయత్నించినా ఆ గాలి హోరులో అది వినపడలేదు. వెంటనేలారెన్స్ రేస్ ను మధ్యలోనే వదిలేసి షా ను రక్షించడానికి అటువైపు తన పడవను మళ్లించాడు.
సముద్రంలో పడిపోయిన మరొక రేసర్ జోసఫ్ ను లారెన్స్ రక్షించాడు. ఇక షా ను రక్షించడానికి బోట్ వద్దకు వెళ్ళాడు. అక్కడికి చేరుకుని బోటు కు ఉండే తెరచాపను 15 నిమిషాల్లో సరిగ్గా అమర్చాడు.
ఈ లోపు లారెన్స్ కనిపించకపోవడంతో కంగారుగా కోచ్ అతని కోసం వెతుక్కుంటూ వచ్చాడు. అక్కడ ఉన్న పరిస్థితిని చూసి రెస్క్యూ టీంను అక్కడి కి పంపించాడు. అయితే రేస్ మాత్రం అప్పటికే చేజారిపోయింది. లారెన్స్ వెనుకంజలో ఉన్నాడు. చివరికి 22వ స్థానంలో రేస్ పూర్తి చేశాడు. లారెన్స్ కు దీని పట్ల ఎటువంటి విచారం లేదు.
లారెన్స్ మెడల్ గెలవనప్పటికీ, అందరి హృదయాలు మాత్రం గెలిచాడు. అతనికి మెడల్ కన్నా ప్రతిష్ఠాత్మకమైన అవార్డు వచ్చింది. నిజమైన క్రీడా నైపుణ్యం, స్పూర్తి ప్రదర్శించినందుకు గాను అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ పియరీ డి కూబెర్టిన్ పతాకాన్ని లారెన్స్ కు అందజేసింది. అలా లారెన్స్ అందరి దృష్టిలో ఒలంపిక్ హీరో అయ్యాడు.
At Seoul 1988, Lawrence Lemieux abandoned his own race when he saw that a Singaporean dinghy was capsized 🥺
For his actions, he was awarded Pierre de Coubertin Medal for sportsmanship ❤️👊 https://t.co/72Wl427Bzi pic.twitter.com/roaAnELyF3
— Team Canada (@TeamCanada) April 28, 2020
(సలీమ్ బాషా, స్పోర్ట్స్ జర్నలిస్టు, హోమియో వైద్యుడు,