తెలంగాణ తాలూకాఫీసులంటే అవినీతి రిజర్వాయర్లే. ఒక తాహశీల్దార్ సజీవ దహనానికి కారణమయింది. ఒక తాహశీల్దార్ కోట్ల రుపాయల లంచం లో దొరికి జైలు పాలయి, ఆత్మహత్య చేసుకునే దాకా వెళ్లింది.చాలా సందర్భాలలో కడపు మండిన రైతులు పెట్రలో డబ్బాతో ప్రత్యక్షమయిన సంఘటనలు ఎన్నో వున్నాయి. మొన్నటికి మొన్న ఒక మహిళ తన పుస్తెలతాడు తాలూకాఫీసు గుమ్మానికి కట్టి, తన భూమిని కాపాడుకునేందుకు ప్రయత్నించింది.తాలూకాఫీసు వాళ్ల ఆమెభూమిని మరొకరిపేరుతో రాసిచ్చారు.ఇది జాతీయ వార్త అయింది. దీని మీద విచారణకు ఆదేశించారు. ఈపుడు ఇలాంటి తాలూకాఫీసు అవినీతికి మరొక పేదరైతుల ఎలా బలయ్యాడో తెలిపే సంఘటన మరొకటి జరిగింది. వివరాలు:
సంగారెడ్డి జిలా జిన్నారం తాహశీల్దార్ కార్యాలయంలో ఆర్ ఐ గా పనిచేస్తున్న సునీల్ పేదల పట్ల రౌడీలాగా ప్రవర్తిస్తున్నాట్లు ఒక బాధితుడు ఆరోపిస్తున్నారు. తన 5 గుంటల భూమిని పాస్ బుక్ లో చేర్చమని అడిగితే ఆర్ ఐ తనని కొట్టి బయటకు నెట్టేశారని బాధితుడు జిన్నారం గ్రామానికి చెందిన రమేష్ అనే రైతు ఆరోపిస్తున్నారు. తనకు న్యాయం చేయాలంటూ తాహశీల్దార్ ముందు రమేష్ ధర్నాకు దిగాడు. తనని కొట్టింది తాహశీల్దార్ కార్యాలయం సిసి ఫుటేజ్ రికార్డయిందని, దానిని పరీక్షించే న్యాయం చేయాలని రమేష్ డిమాండ్ చేస్తున్నాడు
ఇది కూడా చదవండి
https://trendingtelugunews.com/top-stories/breaking/woman-hangs-mangalasutram-to-mandal-office-in-protest/