యుపి జడ్ పి ఎన్నికల్లో గెలిచిన  తెలంగాణ శ్రీకళా రెడ్డి సింగ్

తెలంగాణ కు చెందిన శ్రీకళారెడ్డి ఉత్తర ప్రదేశ్ జడ్ పి ఎన్నికల్లో బిజెపి తరఫున గెలిచారు.

ఇపుడు జాన్పూర్ జిల్లా పంచాయత్ అధ్యక్ష పదవికి ఎన్నికయ్యారు.  జిల్లా పంచాయత్ లో మొత్తం 84 ఓట్లుంటే కళా రెడ్డికి 43 ఓట్లు వచ్చాయి.

ఆమె జాన్ పూర్ మాజీ బిఎస్ పి ఎంపి ధనంజయ్ సింగ్ మూడో భార్య. ధనంజయ్ సింగ్ కి డాన్ అనే కూడా పేరుంది. ఆయనను పూర్వాంచల్ బాహుబలి అని పత్రికలు వర్ణిస్తుంటాయి.

శ్రీకళారెడ్డి పెళ్లి నాటి ఫోటో (credit: thedialogue)

జాన్పూర్ ZP అధ్యక్షురాలిగా ఎన్నికయిన ధృవీకరణ పత్రంతో శ్రీకళా రెడ్డి (credit:patrika.com) తెలంగాణ సూర్యాపేటకు చెందిన శ్రీకళారెడ్డి  2017లో ధనంజయ్ ని వివాహమాడారు. తెలంగాణ నుంచి ఉత్తర ప్రదేశ్ కు వెళ్లారు. తర్వాత  బిజెపిలో చేరారు. జాన్ పూర్ జిల్లా సిక్రార బ్లాక్  45 వ వార్డు నుంచి ఆమె పోటీ చేశారు.

ఆమె తండ్రి జితేందర్ రెడ్డి గతంలో ఎమ్మెల్యే గా ఉన్నారు. శ్రీకళ   మొదట్లో టిడిపిలో ఉన్నారు. తర్వాత 2019లో పార్టీ అధ్యక్షుడు నద్దా సమక్షంలో  బిజెపిలోచేరారు.

 

పత్రికలు వార్తలు రాసినపుడల్లా ధనంజయ్ సింగ్ ని మాఫియా డాన్ గా పిలుస్తుంటాయి. ఆమె నామినేషన్ వేసిన రోజునే ఒక హత్య కేసుకు సంబంధించి  భర్త ను అరెస్టు చేసేందుకు పోలీసులు ఇంటి మీద దాడి చేశారు. ఆయన ఇంట్లో లేరు. ఆయన గురించి సమాచారం ఇచ్చిన వారికి రు. 25 వేల ఇనా మ్ ఇస్తామని పోలీసులు ప్రకటించారు

భర్త గత అసెంబ్లీ ఎన్నికల్లో  మల్హానీ నుంచి పోటీ చేశారు. అయితే సమాజ్ వాది పార్టీ అభ్యర్తి లకీ సింగ్ చేతిలో ఓడిపోయారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *