నాగార్జునసాగర్, శ్రీశైలం ప్రాజెక్టుల పరిధిలో తెలంగాణ ప్రభుత్వం జలవిద్యుదుత్పత్తి చేయడాన్ని ఆంధ్రప్రదేశ్ వ్యతిరేకిస్తున్నది. ప్రాజెక్టులు సగమైనా నిండకుండానే సాగర్ లో డెడ్ స్టోరేజీ నుంచి విద్యుదుత్పత్తి చేయడంపై ఏపీ అభ్యంతరం వ్యక్తం చేస్తున్నది వెంటనే కరెంట్ ఉత్పత్తిని ఆపేయాలని తెలంగాణ ప్రభుత్వాన్ని ఏపీ నీటిపారుదల శాఖ అధికారులు కోరారు. ప్రాజెక్టులో సరిపడా నీళ్లు లేకుండా జలవిద్యుత్ ను తయారు చేయడం నిబంధనలను ఉల్లంఘించడమేనని ఆంధ్రప్రదేశ్ వాదిస్తున్నది.
తెలంగాణ అధికారులతో చర్చలు జరపాలని ఏపీ అధికారులు భావిస్తున్నారు. అంతేకాదు, కృష్ణాబోర్డుకు, ప్రధాని కూడా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఫిర్యాదు చేయాలనుకుంటున్నది. ఈ విషయం ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి మొన్నటి క్యాబినెట్ సమాశేంలో ప్రస్తావించారు. ఈ విషయంలో తెలంగాాణ రగడకు దిగితే హైదరాబాద్ లో ఉన్న ఆంధ్రులకు అభద్రత ఏర్పడుతుందని ఆయన వ్యాఖ్యానించారు.
ఇది ఇలా ఉంటే
తెలంగాణ ప్రభుత్వం ఏపీ అధికారుల బృందాన్ని సరిహద్దు వద్ద తెలంగాణప్రభుత్వం నిలిపి వేసింది. నాగార్జునసాగర్ వద్ద విద్యుత్ ఉత్పత్తి ఆపమని ఏపీ ప్రభుత్వం తరఫున తెలంగాణ అధికారులకు వినతి పత్రం ఇద్దామని వెళ్తితే తెలంగాణ పోలీసులు అనుమతించలేదని గురజాల ఆర్డీవో జె. పార్థసారధి తలిపారు.
ఆశించిన స్థాయిలో వర్షాలు లేక నాగార్జున సాగర్ డ్యాం లో నీళ్లు తక్కువగా ఉన్నాయని, వ్యవసాయ సీజన్ కు సాగునీరు అందించకపోతే రైతులు ఇబ్బంది పడే పరిస్థితులు ఉన్నాయని, ఇలాంటపుడు విద్యుదుత్పాదన సరికాదని ఆయన అన్నారు.
కృష్ణా డెల్టాలో రైతులకు నీరు అవరమయినపుడు నాగార్జున సాగర్ డ్యామ్ వద్ద విద్యుత్తు చేయటం వలన నీరు సముద్రంలో కలసిపోయి ఉపయోగం లేకుండా పోతుందని ఆయన వ్యాఖ్యానించారు. ప్రాజక్టుల నీటి కి సంబంధించి మొదట ప్రాముఖ్యం వ్యవసాయమేనని , దీనిని తెలంగాణ ఉల్లంఘిస్తున్నదని ఆయన అన్నారు
సాగర్ డ్యాం వద్ద నెలకొన్న పరిస్థితులను ఎప్పటికప్పుడు ఉన్నతాధికారుల దృష్టికి తీసుకు వెళ్తున్నామని ఆయన చెప్పారు.
ఈ ఆంధ్ర వాదనతో తెలంగాణ ఏకీభవించడంలేదు. తెలంగాణలో విద్యుత్ డిమాండ్ పెరిగిందని, దీనికోసం విద్యుదుత్పాన తప్పనిసరి అంటున్నది. అంతేకాకుండా, ప్రాజక్టులో నీటి మట్టం పెంచి రాయలసీమలోని ప్రాజక్టులకు అక్రమంగా నీటిని తరలించుకుపోవాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం భావిస్తున్నదని తెలంగాణ ప్రభుత్వం అనుమానిస్తున్నది. అందువల్ల నీటిమట్టం రాయలసీమ ప్రాజక్టులకు అనుకూలంగా పెరగుకుండా ఉండేందుకు తెలంగాణ ప్రభుత్వ విద్యుదుత్పాదన పెంచింది.
ఈ గొడవల వల్ల ఉద్రిక్త పరిస్థితులు తలెత్తకుండా అటు ఏపీ, ఇటు తెలంగాణ ప్రభుత్వాలు ప్రాజెక్టుల వద్ద పోలీసులను మోహరించాయి. పులిచింతల ప్రాజెక్టు వద్ద గుంటూరు జిల్లా సత్తెనపల్లి డీఎస్పీ ఆధ్వర్యంలో వంద మంది పోలీసులను మోహరించారు. ఇటు తెలంగాణలోని సూర్యాపేట జిల్లా పరిధిలోనూ పోలీసు మోహరింపులు జరిగాయి. సాగర్ ప్రాజెక్టు వద్ద అటువైపు ఏపీ, ఇటువైపు తెలంగాణ ప్రభుత్వాలు పోలీసులతో బందోబస్తును నిర్వహిస్తున్నాయి. శ్రీశైలం ఎడమగట్టు విద్యుత్ కేంద్రం, జూరాల ప్రాజెక్టు వద్ద కూడా సాయుధ బలగాలు పహారా కాస్తున్నాయి.