తెలంగాణ దళితుల సాధీకారీకరణ కోసం ముఖ్యమంత్రి కెసిఆర్ మూడు రోజుల కిందట అఖిల పక్ష సమావేశం ఏర్పాటు చేశారు. అన్నిపార్టీల నేతల దీనికి హాజరయ్యారు.అక్కడ ఆయన దళితులకోసం ఒక అజెండా విడుదల చేశారు. దీనిని చూసి కాంగ్రెస్ నేత మల్లు భట్టి విక్రమార్క, బిజెపి నేతమోత్కు నరసింహులు చాలా హర్షం వ్యక్తం చేశారు. అయితే, దళితుల సంస్థలు ఈ కెసిఆర్ అజండాలను శంకిస్తున్నాయి. ఇది కేవలం కంటితుడుపు మాత్రమే అంటున్నాయి. ఆయన మీద
తెలంగాణ జన సమితి పార్టీ భూపాల్ పల్లీ జిల్లా అధ్యక్షులు రత్నం కిరణ్ 23 దళిత ప్రశ్నలు ముఖ్యమంత్రి మీదకు సంధించారు. ఈ ప్రశ్నలకు సమాధానం కావాలి అంటున్నారు. ఇన్ని ప్రశ్నార్థకాలు ఉన్నపుడు కెసిఆర్ ఉన్నట్లుండి ప్రకటించిన దళిత అజండాని విశ్వసించడమెలా అని ఆయన అంటున్నారు. కిరణ్ సంధించిన ప్రశ్నలివే:
1. దళిత ముఖ్యమంత్రి ఏది..?
2. మూడు ఎకరాల భూమి ఎక్కడ?
3. ఎస్సీ ఎస్టీ బ్యాక్ లాగ్ ఉద్యోగాలు ఎక్కడ?
4. నీ క్యాబినెట్ లో దళిత మంత్రులు ఎందరు…?
5. నీ క్యాంప్ ఆఫీసులో దళిత ఆఫీసర్లు ఎందరున్నారు..?
6. ఉద్యోగ విరమణ చేసిన ఉన్నత స్థాయి ఉద్యోగులను నియమించుకున్న వారిలో నీ దగ్గర ఉన్న దళితులు ఎందరున్నారు?
7. ఐఏఎస్ ఐపీఎస్ దళిత ఆఫీసర్ల కు మీ ప్రభుత్వంలో సముచిత స్థానం ఉందాం? ఉంటే ఆకునూరి మురళి ఐఏఎస్ ఎందుకు వెళ్ళిపోయాడు?
8.125 అడుగుల అంబేద్కర్ విగ్రహం ట్యాంక్‌బండ్ పై ఎక్కడ ఉంది?
9. పంజాగుట్ట అంబేద్కర్ విగ్రహాన్ని ఎక్కడ ఉంచారు..?
10.అదిలాబాద్ జిల్లా టేకు లక్ష్మి హంతకులకు శిక్షలు ఏవి?
11. నేరెళ్ల దుర్ఘటనకు కారకులు ఎవరు?
12. కారణం లేకుండా డా. రాజయ్యను మంత్రి పదవి నుండి ఎందుకు తొలగించారు.?
13. దళితుల్లో మంత్రిపదవులు నామినేటెడ్ పోస్టులు ఇవ్వడానికి అర్హులే లేరా?
14. ప్రత్యేక తెలంగాణ రాష్ట్రంలో ఎంతమంది దళితులకు ఉద్యోగాలు ఇచ్చారు,లెక్కలు తీయండి?
15. దళిత మహిళలకు మంత్రి పదవులు ఇవ్వరా…?
16. ప్రతి నియోజకవర్గంలో ఒక లక్ష వరకు అర్హులు ఉంటే వంద మందికి పది లక్షలు ఇస్తే సరిపోతుందా..?
17. మాల మాదిగల మధ్య చిచ్చుపెట్టి రచ్చ చేసింది మీరు కాదా…?
18. లంబాడి గోండుల మధ్య చిచ్చు పెట్టింది మీరే కదా..?
19. అంబేద్కర్ జయంతి వర్ధంతి రోజు ఎప్పుడైనా మనస్సాక్షిగా కార్యక్రమాలలో కనీసం దండం వేయడానికి వచ్చారా…?
20. ప్రత్యేక తెలంగాణ ఉద్యమంలో ధూంధాం కళాకారులు దళితులే…..
ప్రత్యేక తెలంగాణ ఉద్యమంలో ప్రాణాలు కోల్పోయింది దళిత బిడ్డలే…….
21. ఒక్క వెలమ దొరసాని గోచి పెట్టుకొని దళితులతో కలసి ఆడలే,పాడలే?
22. నిన్ను దీక్ష విరమింపజేసినది దళితులు కదా…?
23. దళిత మహిళ మరియమ్మ ను హత్యచేసిన పోలీసులపై
Sc,St యాక్టు ప్రకారం చర్యలెందుకు తీసుకోవు? సస్పెండ్ పేరుతో కంటితుడుపు చర్యలేంది?
కెసిఆర్ దళిత్ అజండా ఇదే…
https://trendingtelugunews.com/top-stories/breaking/kcr-announces-telangana-dalit-manifesto/