సాధారణంగా రాజకీయ పార్టీలు కొత్త నీళ్లకు గేట్లు తెరవవు. మార్పుకు అంతసులభంగా స్వాగతం పలకవు. అందుకే మనకు గ్రామ సర్పంచు దగ్గిర నుంచి ఎమ్మెల్యేదాకా, పార్టీ గ్రామకమిటీల దగ్గిర నుంచి రాష్ట నాయకుల దాకా అవే ముఖాలు కనిపిస్తూ ఉంటాయి. వాళ్లు రకరకాలుగా స్వామి భక్తి, పార్టీ నాయకత్వం పట్ల వీర విధేయత ప్రకటించి ఈ పా…తముఖాలు తమ స్థానాలను పదిలంగా కాపాడుకుంటూ ఉంటాయి.
ఎంత టాలెంటయిన సరే, కొత్త వ్యక్తిని దరిదాపుల్లోకి రానీయరు. అందుకే ఎన్నికయ్యే ప్రతిపోస్టు దగ్గిర ఒకే వ్యక్తి, లేదా ఒకే కుటుంబం వేళ్లూనికుని ఉంటుంది.దానిని వారసత్వ సంపద లాగా అనుభవించాలనుకుంటు ఉంటుంది. మరొకరెవరూ ఈ స్థాయికి ఎదగకుండా అడ్డకుంటూఉంటుంది.
ఏదైనా కొత్త పార్టీ వచ్చి, కొత్తలతో కొత్త ముఖాలను పరిచయం చేసినా, అది పాత పద్ధతల్లోకి చూస్తుండగా పతనమవుతుంది. టి ఆర్ ఎస్ చూడండి. మొదట్లో కొత్త ముఖాలతో, కొత్త భాషతో, భావావేశంతో ముందుకొచ్చింది. ఇపుడేమమయింది. కాంగ్రెస్, తెలుగు దేశం భాషేమాట్లాడుతూ ఉంది. అవే ముఖాలు, అవే ఉపన్యాసాలు. తొలినాళ్లలో పార్టీ నేతల్ని చూస్తే ముచ్చటేసింది.
ముఖాలు ఇక శాశ్వతమయి పోవడంతో కొత్త దనం ఆవిరైపోయింది.
అందుకే మార్పు ఎక్కడయినా కొద్దిసేపు కనిపించినా సందడి సందడి గా ఉంటుంది.
పార్టీ లో వేళ్లూనుకుని ఉన్న కుటుంబాలను, విధేయత పేరుతో మరొకనెవరిని పదవి దగ్గిరకు రానీయకుండా అడ్టుకుంటున్న సీనియర్లను కాదని కాంగ్రెస్ నాయకత్వం చాలా కాలం తర్వాత మార్పును ఆహ్వానించింది. కొత్త నీటికి గేట్లు తెరిచింది. తెలుగుదేశం పార్టీ నుంచి వచ్చి, ఎంపి గెలిచిన రేవంత్ రెడ్డిని పిసిసి అధ్యక్షుడిని చేసింది. ఇది కొంతమంది ‘రాజకీయ పాలెగాళ్ల’లో అసంతృప్తి రగిలించినా, కొత్త దనం తెస్తుంది, అనుమానం లేదు. అందుకే కాంగ్రెస్ లో ఇంతవరకు సైడ్ లైన్ అయిన వాళ్లలో కదలిక వస్తుంది ఎపుడూ తెరమీద కనిపించే వర్గం కాకుండా కొంత వర్గం తెరమీదకు వస్తుంది. ఇది పార్టీలో కొంతయిన చైతన్యం, ఉత్సాహం తీసుకువస్తుంది.
ఈ రోజు షాద్ నగర్ కాంగ్రెస్ శ్రేణులు కొత్త టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డిని సత్కరించాయి. వీర్లపల్లి శంకర్ ఆధ్వర్యంలో రేవంత్ రెడ్డికి సన్మానం జరిగింది. ఇదొక కొత్త దనం.
ఆపత్సమయంలో కాంగ్రెస్ పార్టీకి అండగా నిలిచిన ప్రతి కాంగ్రెస్ కార్యకర్తకు భవిష్యత్తులో అండగా ఉంటానని టీపీసీసీ చీఫ్, ఎంపి రేవంత్ రెడ్డి ఈ సందర్భంగా మాట్లాడుతూ రేవంత్ అన్నారు.
ఆదివారం రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత వీర్లపల్లి శంకర్ ఆధ్వర్యంలో కాంగ్రెస్ శ్రేణులు రేవంత్ రెడ్డిని సన్మానించేందుకు పెద్ద ఎత్తున హైదరాబాద్ తరలి వచ్చారు.
టీపిసిసి చీఫ్ రేవంత్ రెడ్డి నివాసంలో ఆయనను వీర్లపల్లి శంకర్ ఆధ్వర్యంలో ఘనంగా సన్మానించారు.
టీపీసీసీ చీఫ్ గా ఎంపిక చేయడం పట్ల హర్షం వ్యక్తం చేస్తూ స్వీట్లు తినిపించారు. ఈ సందర్భంగా తనకు శుభాకాంక్షలు తెలియజేయడానికి వచ్చిన కాంగ్రెస్ నియోజకవర్గ కాంగ్రెస్ శ్రేణులను ఉద్దేశించి రేవంత్ రెడ్డి ప్రసంగించారు. అందరికీ అండగా ఉంటానని భరోసా ఇచ్చారు.
రేవంత్ ను సత్కరించిన వారిలో మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ వై.యాదయ్య యాదవ్, కిసాన్ కాంగ్రెస్ రంగారెడ్డి జిల్లా అధ్యక్షుడు చల్ల శ్రీకాంత్ రెడ్డి, నందిగామ సీనియర్ కాంగ్రెస్ నాయకుడు రాంరెడ్డి, బ్లాక్ కాంగ్రెస్ ప్రెసిడెంట్ బాల్రాజ్ గౌడ్, చెంది తిరుపతి రెడ్డి, చౌదరిగుడా మండల అధ్యక్షుడు రాజు, ఎంపీటీసీల సంఘం రాష్ట్ర అధ్యక్షులు శ్రీశైలం, నందిగామ ఎంపీటీసీ కొమ్ము కృష్ణ, రాజగోపాల్ రెడ్డి, కుమార స్వామి గౌడ్, మొగిలిగిద్ద ఎంపిటిసి శ్రీశైలం, యూత్ కాంగ్రెస్ మాజీ అధ్యక్షులు పురుషోత్తం రెడ్డి, జితేందర్ రెడ్డి, కమ్మదనం ఎంపీటీసీ బొమ్మ అరుణమ్మ, అంజయ్య గౌడ్, కొత్తూరు హరినాథ్ రెడ్డి,పర్వతాపూర్ ఎంపిటిసి మల్లేష్ గౌడ్, తుపాకుల శేఖర్, ఉప సర్పంచ్ సీతారాములు, కౌన్సిలర్ రాయికల్ శ్రీనివాస్, ఉప సర్పంచ్ సుదర్శన్, నెహ్రూ నాయక్, జాకారం శేఖర్, మాధవులు, శ్రీనివాస్, నందారం అశోక్, లింగారెడ్డి గూడా అశోక్, నవీన్, తీగాపూర్ ఆంజనేయులు, గంగమోని సత్తయ్య, ఎలికట్ట డిప్యూటీ సర్పంచ్ రాజు, బుడ్డా నర్సింలు, లింగం పుల్లారెడ్డి, అమర్నాథ్ రెడ్డి, శ్రీకాంత్ తదితరులులు ఉన్నారు.