ఆశ్చర్యం. ప్రముఖ బెంగాలీ నటి తృణమూల్ పార్టీకి చెందిన జాదవ్ పూర్ ఎంపి మిమి చక్రబర్తి పేక్ వ్యాక్సిన్ బారిన పడ్డారు. శనివారం నాడు ఆమె ఆరోగ్యం క్షీణించడంతో డాక్టర్ ను పిలిచారు. ఇపుడామె ఇంటిదగ్గిరే డాక్టర్ పరిశీలనలో ఉన్నారు. ఆమె ఆరోగ్యం నిలకడగా ఉందని, కాకపోతే, రక్తపోటుతో బాధపడుతున్నారని డాక్టర్ చెప్పారు.
నాలుగు రోజుల కిందట ఆమె ఒక వ్యాక్సిన్ క్యాంపులో వ్యాక్సిన్ తీసుకున్నారు. వ్యాక్సిన్ డ్రైవ్ కార్యక్రమంలో పాల్గొన్ని వ్యాక్సిన్ తీసుకునేలా ప్రజలను ఉత్తేజ పరిచేందుకు ఆమె ఈ క్యాంపులో వ్యాక్సిన్ తీసుకున్నారు.
కోవిషీల్డ్ వ్యాక్సిన్ తీసుకున్నాక ఆమె ఎలాంటి సర్టిఫికేట్ గాని, రషీదు గాని రాలేదు.దీనితో ఆమె పోలీసులకు ఫిర్యాదు చేశారు. అపుడు తెలిసింది తాను మోసపోయానని, తీసుకున్నది ఫేక్ వ్యాక్సిన్ అని.
ఇపుడామె ఖాయిలా పడ్దారు. అయితే, ఆమె అనారోగ్యం ఫేక్ వ్యాక్సిన్ వల్లనే లేక మరొక కారణంతోనా అనే విషయం తెలిసేందుకు వేచిచూడాలని ఆమె పరీక్షించిన డాక్టర్ చెప్పారు.
ఆమె ఫేక్ వ్యాక్సిన్ బారినపడటంతో కోల్ కతాలో సాగుతున్న ఫేక్ వ్యాక్సిన్ కుంభకోణం బయటపడింది.
చివరకు తేలిందేమిటంటే, మిమి కి ఫేక్ వాక్సిన్ వేసినవాడు కూడా ఒక ఫేక్ ఐ ఏ ఎస్ అధికారి. ఆటగాడు కోల్కతా మునిసిపల్ కార్పొరేషన్ జాయింట్ కమిషనర్ అని చెప్పి, కొంతమంది ఫేక్ ఉద్యోగులను వెంటేసుకుని నాలుగయిదు నెలలుగా డబ్బు తీసుకుని వేలాది మందికి వాక్సిన్లు వేసాడు. ఇపుడు ఇతగాడిని పోలీసులు అరెస్ట్ చేశారు.
Bengali actor and @AITCofficial MP #MimiChakraborty says she became a victim of a fraud #COVID19 vaccination drive in #Kolkata and took a shot that turned out to be fake. @mimichakraborty pic.twitter.com/yPZHQ91aIN
— editorji (@editorji) June 24, 2021