భారత ప్రధాన న్యాయమూర్తిగా బాధ్యతలు తీసుకున్న తర్వాత జస్టిస్ ఎన్ వి రమణ తొలిసారి తెలుగు రాష్ట్రాలను సందర్శించారు. ఈ రోజు ఉదయం తిరుమల సందర్శించారు. అక్కడి టిటిడి అధికారులు, ఇతర జిల్లా అధికారులకు ఆయన స్వాగతం పలికారు. అంతకు మంచిన సందడి లేదు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఢిల్లీ పర్యటనలో ఉన్నారు. ఇక మంత్రులు, రాష్ట్ర అధికారులు స్వాగతం పలికిన సందడి లేదు. ముఖ్యమంత్రి లేనపుడు ప్రొటోకోల్ పాటించేందుకు మరొక సీనియర్ మంత్రి ఎవరూ లేరు.
ఇది ఈ రోజు బాగా చర్చనీయాంశమయింది. ముఖ్యమంత్రి జగన్ కు జస్టిస్ రమణ కు వ్యతిరేకంగా ఆయన ప్రమోషన్ ముందు అప్పటి ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎస్ ఎ బాబ్డేకి లేఖ రాసి దేశవ్యాపిత సంచలనం సృష్టించారు. ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ రమణ నియమించబడే ముందు ఈ లేఖ రావడంతో సర్వత్రా అనుమానాలు వచ్చాయి. చివరకు దీని మీద విచారణ జరిపి ఇందులోని అరోపణలను సుప్రీంకోర్టు కొట్టివేసింది. ఈ గొడవయే ఈ రోజు ఆంధ్రలో లేకుండాపోయేందుకు కారణమా? అనేది బాగా చర్చనీయాంశమయింది.
దీనికి బిన్నంగా తెలంగాణలో ప్రధాన న్యాయమూర్తికి ఘన స్వాగతం లభింయింది. రాజభవన్ లో గవర్నర్ తమిళసై, ముఖ్యమంత్రి కెసిఆర్, ఇతర క్యాబినెట్ మంత్రులు ఆయన ఘన స్వాగతం పలికారు.