ఆంధ్రప్రదేశ్ లో కరోన కేసులు భారీగా తగ్గాయి. నిన్న నమోదయిన 13 వేల కేసులనుంచి కొత్త పాజిటివ్ కేసులు 7943 లకు పడిపోయాయి. మృతుల సంఖ్య కూడా తగ్గినా ఇంకా ఎక్కువగానే ఉంది. గత 24గంటలలో 98 మంది మృతి చెందారు.
రాష్ట్రం లో గత 24 గంటల్లో ( నిన్న 9AM నుంచి నేడు 9AM వరకు)
83,461 శాంపిల్స్ ని పరీక్షించగా కేవలం 7,943 పాజిటివ్ కేసులు కనిపించాయి. ఇదొక రికార్డు. ఎందుకంటే అంతకు ముందటి 24 గంటల్లో 13,400కొత్త కేసులు కనిపించాయి. తర్వాత 24 గంటల్లో ఇవి 7,943 కు పడిపోవడం రికార్డు.
కోవిడ్ మరణాలకు సంబంధించి చిత్తూర్ లో పదిహేను మంది, పశ్చిమ గోదావరిలో పన్నెండు మంది,
ప్రకాశంలో పది, అనంతపూర్ లో తొమ్మిది, తూర్పు గోదావరిలో ఎనిమిది,
విశాఖపట్నంలో ఎనిమిది, శ్రీకాకుళంలో ఏడుగురు, కృష్ణలో ఆరుగురు, కర్నూల్ లో ఆరుగురు, విజయనగరంలో ఆరుగురు, గుంటూరులో నలుగురు, నెల్లూరులో నలుగురు, వైఎస్ఆర్ కడపలో ముగ్గురు మరణించారు.
జిల్లాల వారీగా కోవిడ్ పాజిటివ్ కేసులు వివరాలు: