మహారాష్ట్రలో 8000 మంది పిల్లలు పాజిటివ్, కోవిడ్ థర్డ్ వేవ్ వస్తున్నదా? 

ఇపుడిపుడే కోవిడ్ సెకండ్ వేవ్ తగ్గు ముఖం పడుతున్నట్లు లెక్కలు వెలువడుతున్నాయి.  చాలా రాష్ట్రాల్లో లాక్ డౌన్ నియమాలు సడలిస్తున్నారు. ఆక్సిజన్ డిమాండ్ పడిపోయింది.  ప్రభుత్వాలు కొద్ది ఊపిరి పీల్చుకుంటున్న దశలో మహారాష్ట్ర  అహ్మద్ నగర్ జిల్లా నుంచి బాంబు లాంటి వార్త వెలువడింది. ఒక్క జిల్లా నుంచే 8000 మంది పిల్లలు కోవిడ్ పాజిటివ్ అని తేలింది.

ఢిల్లీ ముఖ్యమంత్రి అర్వింద్ కేజ్రీవాల్  హెచ్చరిక గుర్తుందా? కోవిడ్ ధర్డ్ వేవ్ పిల్లల మీద దాడిచేస్తుంది, కబడ్డార్ అని ఆయన వారం రోజుల కిందటే చెప్పారు. కాకపోతే, ఆయన ఇది సింగపూర్ నుంచి వస్తుందని భావించారు.

ఈ నెలలోనే అహ్మద్ నగర్ జిల్లాలో  8 వేల మంది పిల్లలు, టీనేజర్స్ కోవిడ్ పాజిటివ్ అని నిర్ధారణ కావడంతో అధికారులు హతాశులయ్యారు. జిల్లాలో కనిపించిన మొత్తం కరోనా కేసుల్లో ఇది 10 శాతంతో సమానం.

ఒక్క మే నెలలో నే 8వేల మంది పిల్లలు కరోనా పాజిటివ్ కావడం ఆందోళన కలిగిస్తున్నదని జిల్లా కలెక్టర్ రాజేంద్ర భోసలే  వ్యాఖ్యానించారు.

దీనితో వాళ్లు జులై లేదా ఆగస్టులోనెలలో ధర్డ్ వే వ్ తాకి డి ఉండవచ్చని చెబుతున్నారు.  అంటే ధర్డ్ వేవ్ కు సమాయత్త మయ్యేందుకు ఇంకా రెన్నెళ్లు టైం ఉంది. ఈ లోపు పిల్లల వార్డులను సిద్ధంచేయాలని అధికారులు చెపినట్లు  ఎన్డీటివి చెప్పింది.

భారత్ ను సెకండ్ వేవ్ తాకినపుడు మొదటి దెబ్బపడింది మహారాష్ట్ర మీదే. అక్కడ విపరీతంగా కరోనా బారిన పడ్డారు. వాళ్లకి అసుపత్రి పడకలు చాల్లేదు. మందులు చాల్లేదు. ఆక్సిజన్ దొరకలేదు.  వేలాది మందిచనిపోయారు. ఆ రాష్ట్రం కరోనా నరకం అనిపించింది.

కేంద్ర ప్రభుత్వం సైంటిఫిక్ అడ్వయిజర్  డాక్టర కె విజయరాఘవన్ ఈ మధ్య ధర్డ్ వేవ్ తప్పదని చెప్పిన సంగతి తెలిసిందే.

మహారాష్ట్రలోని సంగ్లి సిటీలోని ఆసుపత్రిలో పిల్లలకోసం ఒక కోవిడ్-19 వార్డు ప్రత్యేకంగా సిద్ధం చేస్తున్నారు. ఈ ఆసుపత్రిలో ఇపుడు అయిదుగురు పిల్లలు కోవిడ్ చికిత్స తీసుకుంటున్నారు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *