కరోనా వ్యాధి నిర్మూలనకు శ్రీ వేంకటేశ్వరస్వామివారి ఆశీస్సులు కోరుతూ ఇప్పటివరకు మే 31వ తేదీన టిటిడి అఖండ సుందరకాండ పారాయణం నిర్వహిస్తున్నది.
తిరుమలలోని ధర్మగిరి ఎస్వీ వేద విజ్ఞాన పీఠంలో గల ప్రార్థనా మందిరంలో శనివారం అఖండ పారాయణం జరుగుతుంది.
ఉదయం 6 నుండి రాత్రి 10 గంటల వరకు 16 గంటల పాటు నిరంతరాయంగా అఖండ సుందరకాండ పారాయణం జరుగుతుంది.
దీనికోసం నాలుగు బృందాల్లో 40 మంది పండితులు పారాయణం చేసేందుకు వీలుగా ఇక్కడి ప్రార్థనా మందిరంలో ఏర్పాట్లు చేపడుతున్నారు.
హోమం ఏర్పాటు చేసి ప్రతి శ్లోకం తరువాత హవనం చేస్తారు.
ఈ కార్యక్రమాన్ని శ్రీ వేంకటేశ్వర భక్తి ఛానల్ ప్రత్యక్ష ప్రసారం చేస్తుందని టిటిడి అదనపు ఈవో శ్రీ ఎవి.ధర్మారెడ్డి తెలిపారు.
భక్తులు తమ ఇళ్ల నుండే శ్లోకాలను పారాయణం చేయవచ్చని పారాయణం చేయలేని వారు శ్లోకాలను వినాలని కోరారు.
అదేవిధంగా ఈ కార్యక్రమం ప్రసారమయ్యే సమయంలో టీవీ సౌండ్ పెంచడం ద్వారా మంత్రపూర్వకమైన శ్లోకాల శబ్ద తరంగాలు వాతావరణంలో కలిసి శ్రీవారి ఆనుగ్రహం కలుగుతుందని ధర్మారెడ్డి అన్నారు..
అఖండ సుందరకాండ పారాయణం కారణంగా మే 31న శ్రీవారి కల్యాణోత్సవం, సహస్రదీపాలంకార సేవలను మాత్రమే ఎస్వీబీసీలో స్ల్పిట్ చేసి ప్రత్యక్ష ప్రసారం చేస్తారని, ఉదయం 6 నుండి రాత్రి 10 గంటల వరకు మిగతా కార్యక్రమాల ప్రసారాలు రద్దు కానున్నాయని ఆయన తెలిపారు.