ఆంధ్రప్రదేశ్ లో గత 24 గంటల్లో (9AM-9AM)కోవిడ్ వల్ల 99 మంది మృతి చెందారు. మొత్తంగా 91,120 శాంపిల్స్ ని పరీక్షించగా 18,285 మం ది కోవిడ్19 పాజిటివ్ అని తేలింది.
కోవిడ్ వల్ల చిత్తూర్ లో పదిహేను మంది, పశ్చిమ గోదావరిలో పద్నాలుగు మంది, విజయనగరంలో తొమ్మిది, అనంతపూర్ లో ఎనిమిది, తూర్పు గోదావరిలో ఎనిమిది, నెల్లూరులో ఎనిమిది, ప్రకాశంలో ఎనిమిది, విశాఖపట్నంలో ఎనిమిది, కర్నూల్ లో ఆరుగురు, గుంటూరు లో ఐదుగురు, కృష్ణా లో ఐదుగురు, శ్రీకాకుళంలో ఐదుగురు మరణించారని రాష్ట్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది.
గడచిన 24 గంటల్లో 24,105 మంది కోవిడ్ నుండి పూర్తిగా కోలుకున్నారు.
నేటి వరకు రాష్ట్రం లో 1,88,40,321 శాంపిల్స్ ని పరీక్షించారు.
జిల్లాల వారీగా వివరాలు