కరోనా విజృంభిస్తున్నపుడు సెలెక్ట్ అయిన స్టాఫ్ నర్సులను పక్కన బెట్టి.. కాంట్రాక్టు పద్ధతిన వైద్య సిబ్బందిని నియమించడమేంటని తెలంగాణ ప్రభుత్వాన్ని వైఎస్ షర్మిల ప్రశ్నించారు.
“మీ ఛాతిలో ఉన్నది గుండెనా బండనా” ముఖ్యమంత్రి కెసిఆర్ ను ఉద్దేశిస్తూ ఆమె తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. టిఎస్ పిఎస్ పి ద్వారా సెలెక్టయి, పోస్టింగ్ పొందలేకపోతున్న నర్సింగ్ అభ్యర్థులకు ఆమె మద్దతు ప్రకటించారు. వాళ్ల తరుఫున మాట్లాడారు.
స్టాఫ్ట్ నర్సులుగా సెలెక్టయి పోస్టింగ్ పొందలేకపోయిన అభ్యర్థులతో వైఎస్.షర్మిల వీడియా కాన్ఫరెన్స్ పాల్గొన్నారు.
2017లో 3,311 స్టాఫ్ నర్సు పోస్టుల భర్తీకి టీఎస్పీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేసి 2018లో పరీక్ష నిర్వహించగా 2021 ఫిబ్రవరిలో ఫలితాలు వెల్లడించారని బాధిత అభ్యర్థులు తెలిపారు.
కటాఫ్ మార్కుల ఆధారంగా 3,170 మంది అర్హత సాధించారని, ఫిబ్రవరి, మార్చి నెలల్లో 3076 మంది సర్టిఫికెట్లను వెరిఫికేషన్ చేసి, అందరినీ వెబ్ ఆప్షన్ పెట్టుకోవాలని కమిషన్ తెలిపింది అన్నారు.
అనంతరం 2,418 మందిని మాత్రమే ఎంపిక చేసిన టీఎస్పీఎస్సీ, మిగతా 658 మందిని ఎలాంటి కారణాలు లేకుండా పక్కన పెట్టిందని షర్మిల ముందు తమ గోడును వెళ్లబోసుకున్నారు.
బాధిత అభ్యర్థుల ఆవేదన విన్న అనంతరం షర్మిళ ఆమె మాట్లాడాడు.
కేసీఆర్.. మీది గుండెనా..బండనా.?సెలెక్ట్ అయిన స్టాఫ్ట్ నర్సులకు తక్షణమే పోస్టింగ్ ఇవ్వండి. 658 కుటుంబాల ఉసురు పోసుకోకండి. బాధితులెవరూ అధైర్య పడొద్దు.. అండగా నేనుంటా..వైద్య,ఆరోగ్యశాఖలో ఉన్న ఖాళీలన్నింటినీ భర్తీ చేయాలి.https://t.co/wrYTfjF0V0
— YS Sharmila (@realyssharmila) May 26, 2021
“గతంలో చంద్రబాబు హయాంలో అన్ని కాంట్రాక్టు ఉద్యోగాలు కల్పిస్తున్న సమయంలో ముఖ్యమంత్రి పదవిని కూడా కాంట్రాక్టు పెట్టుకుంటే సరిపోదా అని కేసీఆర్ అన్న మాటలను గుర్తుతెచ్చుకోవాలి. చంద్రబాబు కాంట్రాక్టు ఉద్యోగాలకు కిటికీలు తెరిస్తే.. మీరు తలుపులు తెరవడాన్ని ఏమనాలి, ‘ అని ఆమె ప్రశ్నించారు.
పీఆర్సీ నివేదిక ప్రకారమే వైద్య, ఆరోగ్యశాఖలో 23,724 పోస్టులు ఖాళీగా ఉన్నాయని కోవిడ్ సెకండ్ వేవ్ ఇంత భయంకరంగా ఉన్న నేపథ్యంలో ఆ పోస్టులను ఎందుకు భర్తీ చేయడం లేదని వైఎస్.షర్మిల ప్రశ్నించారు.
గత ఏడాది బడ్జెట్ లో ఆరోగ్యశాఖకు 3.3శాతం నిధులు కేటాయించిన ప్రభుత్వం కరోనా సమయంలో ఈ ఏడాది అధిక నిధులు కేటాయించడం పోయి 2.7శాతం నిధులు మాత్రమే ఇచ్చి.. ప్రజారోగ్యాన్ని ఎందుకు నిర్లక్ష్యం చేస్తుందో అర్థంకావడం లేదని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. ఇటీవల నూతన ఆసుపత్రులను నిర్మించాలని మరో 50 వేల వైద్య సిబ్బందిని నియమించాలని ప్రభుత్వం భావించడం పట్ల ఆమె సంతోషం వ్యక్తం చేశారు.
అయితే ఇందులో స్టాఫ్ ను నియమించే ముందు ‘మీ నిర్లక్ష్యానికి నష్టపోతున్న 658 కుటుంబాలకు న్యాయం చేయాలి’ అని డిమాండ్ చేస్తున్నామన్నారు.
సెలెక్ట్ అయిన స్టాఫ్ట్ నర్సులందరికీ తక్షణమే పోస్టింగులు ఇవ్వాలని షర్మిల ప్రభుత్వాన్ని కోరారు. అంతేకాదు.. నర్సింగ్ సంబంధించిన పోస్టులన్నింటినీ కాంట్రాక్టు పద్ధతిలో కాకుండా పర్మినెంట్ గా రిక్రూట్ చేయాలని డిమాండ్ చేశారు. మరోవైపు.. తెలంగాణలో నిరుద్యోగ యువత మరిన్ని అఘాయిత్యాలకు పాల్పడక ముందే.. ఉద్యోగ నోటిఫికేషన్లు వేయాల్సిన అవరసముందన్నారు.
కోవిడ్ తో జనం పిట్టల్లా రాలుతున్నా. మరికొందరు అప్పుల బారిన పడుతున్నారు. అయినా ముఖ్యమంత్రి మాత్రం కరోనాను ఆరోగ్యశ్రీలో చేర్చకుండా తాత్సారం చేయడం తనను విస్మయానికి గురిచేస్తుందని చెబుతూ కరోన చికిత్సను వ తక్షణమే ఆరోగ్యశ్రీలో చేర్చి నిరుపేదలను ఆదుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందన్నారు.
ఆయుష్మాన్ భారత్ ద్వారా తెలంగాణలోని అన్ని ఆసుపత్రులు కవర్ కావనీ ఆమె గుర్తు చేశారు. కేసీఆర్ కు అప్పులు తేవడం వెన్నతో పెట్టిన విద్యన అంటూ చేతులు కాలాక ఆకులు పట్టుకున్న చందంగా, ఇప్పుడు అప్పుల బాట పడుతున్నారని షర్మిల ఎద్దేవా చేశారు. అప్పుల కంటే ముందు బడ్జెట్ కేటాయింపులను పెంచాలని ఆమె సూచించారు.
సెలెక్ట్ అయిన స్టాఫ్ నర్సులంతా ధైర్యంగా ఉండాలని, ఎవరూ అధైర్య పడొద్దని షర్మిల భరోసానిచ్చారు.
‘మీ తరుపున నేను పోరాడుతాను,’ అని బాధిత అభ్యర్థులకు ఆమె హామీ ఇచ్చారు.
అంతకు ముందు పలువురు బాధిత అభ్యర్థులు మాట్లాడుతూ.. తాము చదువుకునే సమయంలో వైఎస్సార్ గారి ప్రభుత్వం అధికారంలో ఉందని.. ఆ మహానుభావుడి పుణ్యాన పూర్తి ఫీజు రీయింబర్స్ మెంట్ వచ్చిన విషయాన్ని వారు గుర్తు చేసుకున్నారు. ఈ కార్యక్రమంలో వివిధ జిల్లాలకు చెందిన రాణి, నాగజ్యోతి, రజని, లక్ష్మీ, ప్రియదర్శిని, క్రిష్ణవేణి, కిరణ్మయి, ఇసాక్, స్వప్న తదితరులు పాల్గొన్నారు.