ఈ ఉదయం హైదరాబాద్ రామ్ నగర్ ఫిష్ మార్కెట్ … ఇలా కిటికిట లాడింది. మాస్కులున్నా, సరిగ్గా ధరించని వాళ్లు,మొక్కుబడిగా ధరించిన వాళ్లు ఎక్కువ. సోషల్ డిస్టాన్స్ పాటించడం ఇక్కడ సాధ్యమా! చాలా మంది చేపల బేరానికి, స్నేహితులతో మాట్లాడేందుకు, ఫోన్ లో మాట్లాడేందుకు మాస్క్ ముక్కుమీది నుంచితీసేస్తున్నారు. కొందరు మాస్క్ లను గడ్డానికి తగిలించుకున్నారు. ఇంకొందరు పోలీసులకు భయపడి మాస్క్ వాడుతున్నట్లుంది తప్ప కరోనా నివారణకు అన్నట్లు లేదు.
ఒకపక్క పోలీసు వాళ్లు ఎంత మొత్తుకున్నా పొద్దుటి పూట మార్కెట్లు ఇలా ప్రమాదకరంగా తయారవుతున్నాయి.