‘సెక్స్ స్కాండల్’ ఎడిటర్ కు విముక్తి, ఆయన తెలుగు కనెక్షన్ ఎంటంటే?

తరుణ్ తేజ్‌పాల్ గుర్తున్నాడుగా.  తెహెల్కా అనే సంస్థ కు ఎడిటర్. భారత జర్నలిజంలోకి స్టింగ్ ఆపరేన్ ను ప్రవేశపెట్టిన జర్నలిస్టు ఆయనే.

2001లో కేంద్రంలో బిజెపి ప్రభుత్వం ఉంది. భారతీయ జనతా పార్టీకి  తెలుగు వాడు బంగారు లక్ష్మణ్ అధ్యక్షుడిగా ఉంటున్నారు. అపుడు డిఫెన్స్ డీల్స్ భారీగా జరుగుతున్నాయి. ఇందులో భారీగా డబ్బు చేతులు మారుతున్నాయి. డిఫెన్స్ ఎలా ఎవరు  డబ్బుకోసం ప్రభావితం చేయగలరో బయట పెట్టాలని తరుణ్ తేజ్ పాల్ ఎడిటర్ గా నడుస్తున్న తెహెల్కా నిర్ణయించింది.

ఒక టీమ్ జర్నలిస్టులను యుకె కు చెందిన ఒక  డిఫెన్స్ కంపెనీ  వెస్ట్ ఎండ్ ఇంటర్నేషనల్  బ్రోకర్స్ గా తయారు పైరవీ కోసం బంగారు లక్ష్మణ్ ఇంటికి పంపించారు.

బంగారులక్ష్మణ్ తో  డీల్ కుదుర్చుకున్నారు. ఒక లక్ష రుపాయలు ఎడ్వాన్స్  డబ్బుకూడా ఇచ్చారు. ఇందంతా స్పై కెమెరాలలో రికార్డయింది. బంగారు లక్ష్మణ్ వారితో మాట్లాడుతూన్న క్రమంలో చాలా విషయాలు బయటపెట్టారు.

ఈ  వీడియాని తరుణ్ తేజ్ పాల్ విడుదల చేసి సంచలనం సృష్టించారు. దేశమంతా పెద్ద రాజకీయ తుఫాన్ చెలరేగింది . దీనితో బంగారు లక్ష్మణ్  బిజెపి అధ్యక్ష పదవికి రాజీనామా చేయాల్సింది. ఇలాంటి స్టింగ్ కు ఎవరైనా దొరుకుతారు. అయితే, బంగారు లక్ష్మణ్ వంటి వ్యక్తి దొరకడం చాలా సులభం.

బంగారు లక్ష్మణ్

తెహెల్కా వీడియోల తర్వా సిబిఐ ఆయనను అరెస్టు చేసింది. లక్ష్మన్ నాలుగేళ్లు జైలు జీవితం గడిపారు. లక్ష్మణ్ బిజెపికి అధ్యక్షుడయిన రెండో తెలుగువాడు. మొదటి వ్యక్తి వెంకయ్యనాయయుడు.

భారతీయ జనతా పార్టీ ని దళితులకు సన్నిహితం చేసేందుకు బిజెపి తెలుగు దళిత నేత అయిన లక్ష్మణ్ ను అధ్యక్షుడిని చేసింది. అయితే అది ఎటో వెళ్లిపోయింది. అంతకు ముందు లక్ష్మణ్ చాలా గౌరవప్రదయయిన నాయకుడు. కేంద్రంలో రైల్వే సహాయమంత్రిగా కూడా ఉన్నారు.  తెహెల్కా మొదటి స్టింగ్ ఆపరేషన్ కు ఇలా తెలుగు వాడు బలయ్యాడు.

అంతవరకు ఎవరికీ పెద్దగా తెలియని తరుణ్ తేజ్ పాల్ ఈ స్టింగ్ ఆపరేషన్ తో బాగా పాపులర్ అయ్యాడు. తర్వాత వచ్చిన స్టింగులేవీ క్లిక్ కాలేదు, ఆయన నడిపిన తెహెల్కా పత్రిక కూడా నష్టాల్లోనే కూరుకుపోయింది.

అయితే, తర్వాత ఏమయింది? తరుణ్ తేజ్ పాల్ సక్స్ స్కాండల్ ఆరోపణలు ఎదుర్కొన్నారు. జైలు కెళ్లారు. గోవా జైలులో ఉన్నారు. ఈ కేసునుంచి ఆయన ఇపుడు విముక్తి అయ్యారు. గోవా కోర్టు ఆయన నిర్దోషి అని తేల్చింది.

2012 నిర్భయ దుర్ఘటన తర్వాత ఇండియాలో ఆ మధ్య ‘మీ టూ’ ( Me Too)  ఉద్యమం వచ్చింది. కార్యాలయాల్లో బాసుల చేత లైంగికంగా వేధింపులకుగురయిన వాళ్లంతా బయటకు వచ్చి అసలు విషయం బయటపెట్టారు. ఇలాంటి కేసులో నాటి విదేశీ వ్యవహారాల శాఖ సహాయమంత్రి ఎంజెఅక్బర్ కూడా ఉన్నారు. ఆయన కూడా పేరున్న జర్నలిస్టే, లైంగిక వేధింపులు ఆరోపణలు రాగానే ఆయన ఉద్యోగం ఊడిపోయింది.

ఇలాంటి ఆరోపణలు ఎదుర్కొన్నచాలా మంది ఎడిటర్లు ఉద్యోగాలు పొగొట్టుకున్నారు. కొందరు జైలు కు పోయారు. జైలు కు పోయిన వారిలో తరుణ్ తేజ్ పాల్ ప్రముఖుడు.

2013లో ఆయన దగ్గిర పనిచేస్తున్న ఒక మహిళా జర్నలిస్టు లైంగిక ఆరోపణలు చేసింది. THink 13 సదస్సు ఒక ఫైవ్ స్టార్ హోటల్లో జరుగుతుంది. అక్కడ తరుణ్ తేజ్ పాట్ తన పట్ల అసభ్యంగా ప్రవర్తించాడని ఆమె ఆరోపణలు చేసింది. దీని మీద  2017లో రేప్,  లైంగిక వేధింపులు, అక్రమ నిర్బంధం ఆరోపణలో ఒక ట్రయల్ కోర్టులో కేసువిచారణ కు వచ్చింది. తరుణ్ తేజ్ పాల్ దీనికి వ్యతిరేకంగా  2019 ఆగస్టులో సుప్రీంకోర్టుకు వెళ్లారు. అయితే, అక్కడ ఆయన ఉరట  దొరకలేదు. ట్రయల్ కోర్టు విచారణ కొనసాగాలని సుప్రీం చెప్పింది. 2013నవంబర్ 30న నే ఆయన అరెస్టు అయ్యారు.2014లో బెయిల్ పై బయటకు వచ్చారు.

అయితే, ఇపుడు ట్రయల్ కోర్టు ఈ కేసును కొట్టి వేసింది. ఈ నెల మే 19నే ఈ కేసుపై తీర్పు వెలువడాల్సి ఉంది. తౌక్తే తుఫాన్ వల్ల  విద్యుత్ లేకపోవడంతో తీర్పును అడిషనల్  జడ్జి క్షమా జోషి వాయిదా వేశారు.

ఈ రోజు ట్రయల్ కోర్టు అంటే మాపుసా లోని డిస్ట్రిక్ట్ సెసన్స్ కోర్టు ఆ ఆరోపణలన్నింటినీ కోర్టు కొట్టివేసింది.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *