ఇపుడు మెల్లిగా దేశంలో కోవిడ్ రాష్ట్రాలు దక్షిణ భారతానికి పాకుతున్నాయి. దేశంలో టాఫ్ 5 కోవిడ్ రాష్ట్రాలలో దక్షిణాది రాష్టరాన్నీ చేరుతున్నాయి. గత రెండు వారాలుగా కర్నాటక, కేరళ, ఆంధ్రప్రదేశ్ తమిళనాడు రాష్ట్రాలనుంచి కోవిడ్ కేసుల వాటా బాగా పెరుగుతూ ఉంది. ఇంతవరకు టాప్ లో ఉంటూ వచ్చిన మహారాష్ట్రలో కేసులు వేగంగా తగ్గిపోతున్నాయి.
మే మొదటి వారంలో దేశంలోని మొత్తం కోవిడ్ కేసులలో దక్షిణాది రాష్ట్రాల వాటా 30 శాతం ఉండింది. గత మూడు రోజులుగా ఇది 40 శాతానికి పెరిగిందని కేంద్ర ఆరోగ్య శాఖ విడుదల చేసిన గణాంక వివరాలు చెబుతున్నాయి. సోమవారం నాడు కర్నాటక, కేరళ, ఆంధ్ర ప్రదేశ్, తమిళనాడుల వాటా 42 శాతం దాకా పెరిగింది.
తాజాగా దేశంలో తమిళనాడు ఆందోళన కలిగిస్తున్న కరోనా రాష్ట్రం (State ofConcern)గా మారింది. గత 24 గంటలలో తమిళనాడులో 33 వేల కొత్త కోవిడ్ కేసులు కనిపించాయి. ఇది మహారాష్ట్ర లో నమోదయిన 34 కేసులతో దాదాపు సమానం. గత ఏడు రోజుల వివరాలు చూస్తే మూడు రోజులలో కర్నాటక కేసులు మహారాష్ట్ర ని మించిపోయాయి. సోమవారం నాడు మహారాష్ట్రలో నమోదయిన కేసులు 26,616 మాత్రమే.
కర్నాటక, కేరళ, ఆంధ్రప్రదేశ్, తమిళనాడులో 100 జిల్లాలలో కోవిడ్ పాజిటివిటి 10 శాతం కంటే ఎక్కువగానే ఉంది. ఎనిమిది జిల్లాల్లో 40శాతం మించి ఉంది.