రాష్ట్ర వ్య్తాప్తంగా దాదాపు 50 వేల మంది ఎంబీబీఎస్ పూర్తిచేస్తున్న వైద్యులను కోవిడ్ చికిత్స కోసం నియమించాలని తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్ఆదేశించారు. ఈ రిక్రూట్ మెంటుకు దరఖాస్తులను ఆహ్వానించాలని చెప్పారు. కరోనా పరిస్థితి మీద జరిగిన ఒక సమీక్షలో ముఖ్యమంత్రి ఈ నిర్ణయం ప్రకటించారు.
కష్టకాలంలో ప్రజలకోసం సేవచేయడానికి ముందుకు రావాలని యువ డాక్టర్లకు ముఖ్యమంత్రి పిలుపునిచ్చారు.
ముఖ్యమంత్రి, కేంద్ర వైద్యారోగ్యశాఖ మంత్రి హర్షవర్దన్ తో ఆయన ఫోన్లో మాట్లాడి, కరోనా నియంత్రణ కోసం రాష్ట్రం చేపడుతున్న చర్యలను వివరించారు. కరోనాని అతివేగంగా వ్యాప్తి కారకులను’ గుర్తించి వారికి ముందువరసలో టీకాలు వేస్తే బాగుంటుందని కేంద్రానికి సిఎం సూచించారు.
* ఆటో డ్రైవర్లు, క్యాబ్ డ్రైవర్లు, కండక్టర్లు, గ్యాస్ ను బాయ్స్, స్ట్రీట్ వెండర్స్, వలస కార్మికులు తదితరులతో పాటు కరోనా వ్యాప్తి అధికం చేసే అవకాశాలున్న వారిని ప్రత్యేక కేటగిరీ కింద గుర్తించి వాక్సిన్ ను అందచేసేందుకు నిబంధనలను సడలించాలని కెసిఆర్ కోరారు.
సమావేశంలో తీసుకున్న మరిన్ని నిర్ణయాలు:
*రెండు, మూడు నెలల కాలానికి డాక్టర్లు, నర్సులు, లాబ్ టెక్నీషియన్లు, ఫార్మాసిస్టులు, ఇతర పారా మెడికల్ సిబ్బంది ని తక్షణమే నియమించుకోవాలి.
*నియామకం జరిపిన వారికి గౌరవ ప్రదమైన రీతిలో జీతాలు అందించాలి.
*కీలక సమయంలో రాష్ట్రం కోసం పనిచేస్తున్నందున వారి సేవలకు సరియైన గుర్తింపునివ్వాలి.
*భవిష్యత్తులో ప్రభుత్వ ఉద్యోగ నియామకాల్లో వారికి వెయిటేజీ మార్కులను కలపాలి
*డాక్టర్లతో పాటు రాష్ట్రంలో అర్హతవున్న నర్సులు, లాబ్ టెక్నీషియన్లు, ఫార్మాసిస్టులు, ఇతర పారా మెడికల్ సిబ్బంది ముందుకు రావాలని,* వరంగల్లు అదిలాబాద్ ల్లో సూపర్ స్పెషాలిటీ దవాఖాన్ల ప్రారంభం : 729 మంది వైద్య సిబ్బంది నియామకం.
* వరంగల్, అదిలాబాద్ జిల్లాల్లో సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ ను తక్షణమే ప్రారంభించాలి.
* కాకతీయ మెడికల్ కాలేజీ ఆవరణలో నిర్మించిన ఎం జి ఎం కు చెందిన 250 పడకల సూపర్ స్పెషాలిటీ దవాఖానను, అదిలాబాద్ జిల్లా రిమ్స్’ లోని మరో 250 పడకల సూపర్ స్పెషాలిటీ దవాఖానను తక్షణమే ప్రారంభించాలి.
* వరంగల్ దవాఖానా కోసం 363 వైద్య సిబ్బందిని, అదిలాబాద్ రిమ్స్ సూపర్ స్పెషాలిటీ కోసం 366 మంది వైద్యసిబ్బందిని, మెత్తం 729 సిబ్బంది నియామకానికి తక్షణమే చర్యలు తీసుకోవాలి.
* ఆసక్తి వున్నవాళ్లు ఆన్ లైన్లో ఈ లింక్ నుంచి దరఖాస్తు చేసుకోవాలి https://odls.telangana.gov.in/medicalrecruitment/Home.aspx..