లండన్ మేయర్ గా పాకిస్తాన్ సంతతికి చెందిన సాదిక్ మళ్లీ ఎన్నిక

పాకిస్తాన్ సంతతికి చెందిన సాదిక్ ఖాన్ లండన్ మేయర్ గా రెండో సారి ఎన్నికయ్యారు. సాదిక్ లేబర్ పార్టీకిచెందిన అభ్యర్థి. ఆయనకు 55.42 శాతం వోట్లు పోలయితే ఆయన ప్రత్యర్థి కన్సర్వేటివ్ పార్టీకి చెందిన షావున్ బెయిలీకి 44.8 శాతం ఓట్లపడ్డాయి. శనివారం రాత్రింత ఓట్ల లెక్కింపు జరిగింది.

పాకిస్తాన్ సంతతికి చెందిన సాదిక్ లండన్ కే మొత్తం యూరోపియన్ నగరాలలోనే మొదటి ముస్లిం మేయర్. ఆయన మాజీ పార్లమెంటు సభ్యుడు కూడా. ఆయన 2016లో మొదటి సారి మేయర్ గా ఎన్నికయ్యారు. నిజానికి ఈ ఎన్నికలు 2020లోనే జరగాల్సి ఉండింది. అయితే, కరోనావైరస్ పాండెమిక్ కారణంగా వాయిదా పడ్డాయి. అనేక పాశ్చాత్య దేశాలలో ముస్లిం వ్యతిరేకత జాత్యహంకార దోరణి తీవ్రమవుతున్నపుడు లండన్ ప్రజలు సాదిక్ కు పట్టం రెండు సార్లు కట్టడం విశేషం. మేయర్ గా ఆయన కూడా లండన్ ప్రజల మనసుదోచుకున్నారు.

మరొక సారి ప్రపంచంలో అతిపెద్ద మహానగరానికి నాయకత్వం వహించేందుకు అవకాశమిస్తూ లండన్ ప్రజలు తన మీదఉంచిన విశ్వాసానికి తాను ముగ్ధుడినయ్యానని ఆయన వ్యాఖ్యానించారు.

“I am deeply humbled by the trust Londoners have placed me in me to continue to leading the greatest city on earth.”

 

“I promise to strain every sinew, help build a better and brighter future for London, after the dark days of the pandemic, and to create a greener, fairer and safer city for all Londoners, to get the opportunities they need to fulfill their potential. I am proud to have won an overwhelming mandate today,” అని సిటి హాల్ ఆఫీస్ లో మాట్లాడుతూ చెప్పారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *